newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

విజ‌య‌సాయిరెడ్డి సంచలనం.. ఏపీలో మ‌రో 12 కొత్త జిల్లాలు

22-12-201922-12-2019 16:55:53 IST
Updated On 23-12-2019 11:42:30 ISTUpdated On 23-12-20192019-12-22T11:25:53.684Z22-12-2019 2019-12-22T11:25:39.218Z - 2019-12-23T06:12:30.517Z - 23-12-2019

విజ‌య‌సాయిరెడ్డి సంచలనం.. ఏపీలో మ‌రో 12 కొత్త జిల్లాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 25 జిల్లాల ఏర్పాటులో భాగంగానే సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌ను తెర‌మీద‌కు తెచ్చార‌న్న చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా, మూడు రాజ‌ధానులంటూ జ‌గ‌న్ చెప్పిన‌ప్ప‌ట్నుంచి రాజ‌ధాని రైతుల నిర‌స‌న‌లు ఆకాశాన్నంటిన సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌లు చేప‌ట్టిన త‌రువాత వ‌చ్చిన మొట్ట‌మొద‌టి జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘ‌నంగా జ‌రుపుకున్నారు.

సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌ల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స‌రికొత్త అంశాన్ని తెర‌మీద‌కు తెచ్చారు. రాష్ట్రంలో ఇక‌పై 13 జిల్లాలు కాదని, 25 జిల్లాలుగా విభ‌జ‌న కానుంద‌ని చెప్పారు. రానున్న కాలంలో రాష్ట్రాన్ని 25 జిల్లాలుగా విభ‌జ‌న చేస్తామ‌న్నారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌నుండ‌టం కార‌ణంగానే ముంద‌స్తుగా మూడు రాజ‌ధానుల ఏర్పాటు నిర్ణ‌యాన్ని తీసుకున్నామ‌న్నారు.

సీఎం జ‌గ‌న్ గురించి మాట్లాడిన విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిత్యం పాటుప‌డే వ్య‌క్తి అన్నారు. ఎన్నో అవ‌కాశాలు ఉన్నా.. టీడీపీ హ‌యాంలో అభివృద్ధికి దూర‌మైన విశాఖ‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్‌గా చేస్తూ జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న చారిత్రాత్మ‌క‌మ‌న్నారు. ఏపీ విభ‌జ‌న నాడు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని.. అధికార వికేంద్రీక‌ర‌ణ‌తో రాష్ట్ర మొత్తం అభివృద్ధి చేయాల‌న్న ఉద్దేశంతోనే జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ఏర్పాటు నిర్ణ‌యం తీసుకున్నార‌న్నారు. అందులో భాగంగానే ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాలు రానున్న రోజుల్లో 25 జిల్లాలుగా ఏర్పాటుకానున్నాయ‌న్నారు.

కాగా, సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌లకు ముందు త‌న పాద‌యాత్ర స‌మ‌యంలో ఒక్కో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తాన‌ని చెప్పిన సంగ‌తి విధిత‌మే. మాట త‌ప్ప‌ని.. మడ‌మ తిప్ప‌ని నైజం ఉన్న సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చే క్ర‌మంలో 25 జిల్లాల ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టార‌న్నారు విజ‌య‌సాయిరెడ్డి. జ‌గ‌న్ నుంచి 25 జిల్లాల ప్ర‌స్థావ‌న రాగానే అందుకు సంబంధించిన అంశంపై కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు ఇప్ప‌టికే ముమ్మ‌రం చేశార‌న్నారు.

ఇక ఇప్ప‌టికే ఉన్న 13 జిల్లాల‌తోపాటు కొత్త‌గా రానున్న 12 జిల్లాలు చూస్తే ఇలా ఉన్నాయి : 

అన‌కాప‌ల్లి

అర‌కు

అమ‌లాపురం

రాజ‌మండ్రి

న‌ర‌సాపురం

విజ‌య‌వాడ‌

న‌ర‌స‌రావుపేట‌

బాప‌ట్ల‌

తిరుప‌తి

రాజంపేట‌

నంద్యాల‌

హిందూపురం అని తెలుస్తుంది.  అలాగే విజ‌య‌న‌గం, శ్రీ‌కాకుళం, అర‌కులోని కొన్ని ప్రాంతాల‌ను క‌లుపుతూ మ‌రో గిరిజ‌న జిల్లాను ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్టు ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న స‌మాచారం.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle