newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

విజ‌య‌సాయిరెడ్డి గుడ్ న్యూస్‌..!

05-01-202005-01-2020 13:35:55 IST
Updated On 06-01-2020 13:13:59 ISTUpdated On 06-01-20202020-01-05T08:05:55.557Z05-01-2020 2020-01-05T08:05:49.959Z - 2020-01-06T07:43:59.008Z - 06-01-2020

విజ‌య‌సాయిరెడ్డి గుడ్ న్యూస్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కృషి ఫ‌లించింది. పాకిస్థాన్ చెర‌లో ఉన్న ఉత్త‌రాంధ్ర జాల‌ర్లు తిరిగి రాబోతున్నారు. జాల‌ర్ల‌ను పాకిస్థాన్ విడుద‌ల చేయ‌బోతుంది. ఈ నెల 6న వాగా స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఉత్త‌రాంధ్ర జాల‌ర్ల‌ను భార‌త్ అధికారుల‌కు అప్ప‌గిస్తామ‌ని పాకిస్థాన్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు భార‌త విదేశాంగ శాఖ‌కు పాకిస్థాన్ ప్ర‌భుత్వం స‌మాచారం అందించింది.

ఉత్త‌రాంధ్ర‌కు చెందిన 20 మంది మ‌త్స్య‌కారులు పొట్ట‌కూటి కోసం గుజ‌రాత్‌కు వ‌ల‌స వెళ్లారు. గుజ‌రాత్ వ‌ద్ద స‌ముద్రంలో చేప‌ల‌వేట సాగిస్తున్న స‌మ‌యంలో మ‌త్స్యాక‌రులు పొర‌పాటున పాకిస్థాన్ జ‌లాల్లోకి ప్ర‌వేశించారు. దాంతో వారిని పాక్ భ‌ద్ర‌తా బ‌లాలు అరెస్టు చేసి జైలులో ఉంచాయి. వారిని విడిపించేందుకు ఆరేడు నెల‌లుగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

మ‌త్స్య‌కార కుటుంబ స‌భ్యుల‌ను భారత విదేశాంగ‌శాఖ మంత్రి జ‌య‌శంక‌ర్ వ‌ద్ద‌కు తీసుకెళ్లిన విజ‌య‌సాయిరెడ్డి వారి గోడును వినిపించారు. వైసీపీ ఎంపీల బృందం కూడా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జ‌య‌శంక‌ర్‌ను క‌లిసి ఈ అంశంపై విన‌తిప‌త్రం అంద‌జేసింది. వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రి జ‌య‌శంక‌ర్‌ను క‌ల‌వ‌గా, ఆ రోజున టీడీపీ మీడియా సంస్థ‌లు మాత్రం నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ కోస‌మే వైసీపీ ఎంపీల బృందం జ‌య‌శంక‌ర్‌ను క‌లిసింది అంటూ టీడీపీ మీడియా ప్ర‌చారం చేసింది.

మ‌త్స్య‌కారుల అంశంలో క్ర‌మం త‌ప్ప‌కుండా కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను క‌లుస్తూ విజ‌య‌సాయిరెడ్డి ఒత్తిడి తెచ్చారు. ఈ నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు భార‌త ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల‌కు పాకిస్థాన్ సానుకూలంగా స్పందించింది. మ‌త్స్య‌కారుల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 20 మంది ఉత్త‌రాంధ్ర మ‌త్స్య‌కారుల జాబితాను కూడా పాకిస్థాన్ భార‌త్‌కు పంపించింది. పాకిస్థాన్‌కు ప‌ట్టుబ‌డ్డ మ‌త్స్య‌కారులు విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన వారు. మ‌త్స్య‌కారుల విడుద‌ల‌కు వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి చేసిన కృషిని పలువురు అభినందిస్తున్నారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle