newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

విజ‌య‌సాయిరెడ్డిని దూరం పెడ‌తారా..? అయ్యే ప‌నేనా..?

09-05-202009-05-2020 08:38:13 IST
Updated On 09-05-2020 09:08:15 ISTUpdated On 09-05-20202020-05-09T03:08:13.039Z09-05-2020 2020-05-09T03:08:08.812Z - 2020-05-09T03:38:15.281Z - 09-05-2020

విజ‌య‌సాయిరెడ్డిని దూరం పెడ‌తారా..? అయ్యే ప‌నేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కుడిభుజం లాంటి నేత విజ‌య‌సాయిరెడ్డి. వైసీపీలో నెంబ‌ర్ 2 ఎవరైనా ఉన్నారా అంటే ట‌క్కున చెప్పే పేరు ఆయ‌న‌ది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుద‌ల‌లో ఆయ‌న పాత్ర ఎక్కువే. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఆయ‌న బాగా న‌మ్మ‌క‌స్తుడు. అటువంటి నేత‌ను ఇప్పుడు జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశార‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఓ చిన్న వీడియో ఇందుకు కార‌ణం కాగా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ఈ ప్ర‌చారం న‌డుస్తోంది. అయితే, విజ‌యసాయిరెడ్డిని ప‌క్క‌న పెట్టాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్‌కు ఉందా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ మ‌ధ్య తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఓ ప‌త్రికాధిప‌‌తి త‌న వ్యాసంలో జ‌గ‌న్‌కు, విజ‌య‌సాయిరెడ్డికి విభేదాలు రావొచ్చేమో అని రాసుకున్నారు. నిజానికి ఆ వ్యాసంలో వీరిద్ద‌రికీ విభేదాలు రావాల‌నే ఆకాంక్ష కూడా క‌నిపిస్తుంది.

జ‌గ‌న్ చేతిలో తాను కీలుబొమ్మ కాద‌ని విజ‌య‌సాయిరెడ్డి నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ఒక‌వేళ ఇద్ద‌రికీ చెడితే జ‌గ‌న్ గుట్టు భ‌య‌ట‌పెడ‌తాన‌నే హెచ్చ‌రిక కూడా విజ‌య‌సాయిరెడ్డి చ‌ర్య‌ల్లో ఉంద‌ని ఈ వ్యాసంలో రాశారు. వాస్త‌వానికి, విజ‌య‌సాయిరెడ్డి వంటి నేత జ‌గ‌న్‌కు దూర‌మ‌వ‌డం టీడీపీకి క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉంది.

చాలావ‌ర‌కు జ‌గ‌న్‌కు ఆయ‌న ఒక బ‌లం. ద‌శాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో విజ‌య‌సాయిరెడ్డి ఉంటున్నారు. జ‌గ‌న్ తాత రాజారెడ్డి ఆర్థిక వ్య‌వ‌హారాల నుంచి ఇప్పుడు జ‌గ‌న్ ఆర్థిక వ్య‌వ‌హారాల వ‌ర‌కు ఒక సీఏగా విజ‌య‌సాయిరెడ్డి చూసుకున్నారు.

జ‌గ‌న్ ఆస్తుల కేసులో ఆయ‌న‌తో పాటు విజ‌యసాయిరెడ్డి జైలుకు కూడా వెళ్లారు. అప్ప‌టి నుంచి ఆయ‌నను రాజ‌కీయంగానూ జ‌గ‌న్ హైలెట్ చేస్తూ వ‌చ్చారు. పార్టీకి మొద‌టి రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి. ఈ స్థానం కోసం అప్ప‌ట్లో చాలామంది సీనియ‌ర్‌లు ఆశించినా వారంద‌రినీ ప‌క్క‌న‌పెట్టే విజ‌య‌సాయిరెడ్డిని జ‌గ‌న్ ఢిల్లీ పంపించారు.

జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని విజ‌య‌సాయిరెడ్డి నిల‌బెట్టుకున్నారు. ఢిల్లీలో పార్టీ వ్య‌వ‌హారాల‌ను ఆయ‌నే పూర్తిగా చూసుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపుకు ఒక ప్ర‌ధాన కార‌ణంగా టీడీపీ, బీజేపీ మ‌ధ్య విభేదాలు రావ‌డం. ఇలా విభేదాలు రావ‌డంలో విజ‌య‌సాయిరెడ్డి పాత్ర ఉంద‌ని చెప్పుకుంటారు. ఢిల్లీలో వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా బీజేపీ పెద్ద‌ల‌తో విజ‌య‌సాయిరెడ్డి సంబంధాలు పెంచుకున్నారు. ఒకానొక స‌మ‌యంలో మిత్ర‌ప‌క్షంలో ఉన్న అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అపాయింట్‌మెంట్ దొర‌క‌ని రోజుల్లో విజ‌య‌సాయిరెడ్డికి ప్ర‌ధాని మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరికింది.

త‌ర‌చూ ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యంలో విజ‌య‌సాయిరెడ్డి క‌నిపించ‌డం కూడా బీజేపీ ప‌ట్ల చంద్ర‌బాబుకు కొంత అస‌హ‌నం ఏర్ప‌డ‌టానికి కార‌ణ‌మైంది. ఇక‌, పార్టీ వ్య‌వ‌హారాల్లోనూ విజ‌య‌సాయి చాలా రోజులుగా కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల ముందు పెద్ద ఎత్తున పార్టీలోకి చేరిక‌లు జ‌రిగాయి. ఈ చేరిక‌లు ఎన్నిక‌ల ముందే వైసీపీ గెల‌వ‌బోతోంది అనే ఒక భావ‌న‌ను తీసుకొచ్చాయి.

చాలా మంది నేత‌ల చేరిక వెనుక విజ‌యసాయిరెడ్డి ఉన్నారు. ఆయ‌నే వివిధ పార్టీల నేత‌ల‌తో  చ‌ర్చ‌లు జ‌రిపి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వారిని పార్టీలో చేర్పించారు. ఎన్నిక‌ల ముందు వైసీపీ సోష‌ల్ మీడియాను కూడా విజ‌య‌సాయిరెడ్డి న‌డిపించార‌ని అంటారు.

ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ఉన్నారు. రాష్ట్ర వ్య‌వ‌హారాల్లోనూ ఆయ‌న కీల‌క వ్య‌క్తి. ప్ర‌త్యేకించి ఉత్త‌రాంధ్ర వ్య‌వ‌హారాలు చూసుకుంటున్నారు. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా చేస్తున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డంతో అందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లను కూడా విజ‌య‌సాయిరెడ్డి చూసుకుంటున్నారు.

ఇలా, అన్ని విధాలుగా జ‌గ‌న్‌కు విజ‌య‌సాయిరెడ్డి అండ‌గా, న‌మ్మ‌క‌స్తుడిగా ఉంటున్నారు. ఇలా జ‌గ‌న్‌కు బ‌లంగా మారిన విజ‌య‌సాయిరెడ్డి దూర‌మైతే, జ‌గ‌న్‌కు సంబంధించిన లోగుట్టు ఏదైనా ఉంటే, అది ఆయ‌న బ‌య‌ట‌పెడితే బాగుంటుంద‌నేది స‌ద‌రు ప‌త్రికాధినేత‌, టీడీపీ ఆశ కావొచ్చు.

మొన్న విశాఖ‌ప‌ట్నం వెళుతున్న జ‌గ‌న్ కారులో ఎక్కిన విజ‌య‌సాయిరెడ్డి వెంట‌నే దిగిపోయిన సంఘ‌ట‌న తోడ‌య్యింది. అందుకే టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థ‌లు విశాఖ దుర్ఘ‌ట‌న వార్త‌ల‌తో పాటు విజ‌య‌సాయిరెడ్డి కారు దిగిపోయిన వార్త‌కు కూడా ప్రాధాన్య‌త ఇచ్చి ప్ర‌సారం చేశాయి.

మ‌రోవైపు ఇటీవ‌ల విశాఖ‌ప‌ట్నంలో విజ‌య‌సాయిరెడ్డి జోక్యం ఎక్కువ అయింద‌ని జ‌గ‌న్‌కు కొంద‌రు వైసీపీ నేత‌లే ఫిర్యాదులు చేశార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే జ‌గ‌న్ ఆయ‌న ప‌ట్ల కొంత అస‌హ‌నంగా ఉన్నార‌నే చ‌ర్చ ఉంది. అయితే, త‌న‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడైన నేత‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్ట‌డం అయ్యే ప‌నేనా అనిపిస్తోంది.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle