newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

12-07-202012-07-2020 19:39:18 IST
Updated On 13-07-2020 09:26:50 ISTUpdated On 13-07-20202020-07-12T14:09:18.155Z12-07-2020 2020-07-12T14:09:10.804Z - 2020-07-13T03:56:50.271Z - 13-07-2020

విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పదునైన వ్యాఖ్యలతో టీడీపీ నేతలపై విరుచుకుపడుతుంటారు. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలతో టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుపై ఎంపీ  విజ‌య‌సాయి రెడ్డి విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు. వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడు' అంటూ ఎద్దేవా చేశారు. 

'లచ్చల్ లచ్చల్ ఇళ్లు తామే నిర్మించేశాం - పంపిణీ మర్చిపోయాం అంటున్నాడు చంద్రబాబు. నీవు ఇళ్లు నిర్మిస్తే పచ్చ బ్యాచ్ కు పంచకుండా ఉంటావా బాబూ? లేని నగరాన్నే గ్రాఫిక్స్‌లో సృష్టించి వాటాలు పంచినోడివి. బొంకరా బొంకరా బాబు అంటే కరోనా వ్యాక్సిన్ తానే తయారు చేశానన్నాడంట' అంటూ వ్యంగ్య బాణాలు విసిరారు. అంతటితో ఆగలేదు. మరో ట్వీట్‌లో లోకేష్ ని, దేవినేని ఉమామహేశ్వరరావుని విమర్శించారు.

చిట్టి మాలోకం చిన్న మెదడు పూర్తిగా చితికిపోయినట్లుంది. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది బాబు హయాంలోనే. తొమ్మిదేళ్ల వరస కరువును ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మేత దొరకక పశువులను కబేళాలకు అమ్ముకున్న దయనీయ దృశ్యాలను ప్రపంచమంతా చూసింది. రాజన్న రాకతోనే వ్యవసాయం పండగలా మారింది.

https://www.photojoiner.net/image/giMUdnbD

తాను ట్వీట్ చేస్తే వైఎస్ఆర్సీపీ వణికి పోతుందన్నాడు చిట్టినాయుడు. జనం మాత్రం టిక్ టాక్ లేని లోటు తీరుస్తున్నాడంటున్నారు. తిండి ఖర్చుల గురించి ఆయన మాటలు  విని  నవ్వుకుంటున్నారు. ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు. అన్నట్లు కొల్లును పరామర్శించావా ? మర్చిపోయావా చిట్టి! అంటూ లోకేష్ ని గిల్లారు విసారెడ్డి. 

‘‘వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోందట. ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడేదీ తెలియట్లేదు ఉమకి. ఇరిగేషన్ ప్రాజెక్టుల కుంభకోణాలు బయటకు వస్తే నువ్వూ ఊచలు లెక్కపెట్టాల్సిందే. మాజీ సీఎం, మాజీ మంత్రులైనా ఎవరూ తప్పించుకోలేరు. దోచుకోవడాలు పంచుకోవటాలు మీతోనే పోయాయి' అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. 

https://www.photojoiner.net/image/mdSW35yy

విజయసాయిరెడ్డి తీరుపై ఇటు తెలుగు తమ్ముళ్ళు మండిపడుతున్నారు. నిత్యం ట్విట్టర్లో వుండే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయసాయిని తూర్పారబట్టారు. రాజ భవనానికి ప్రజల సొత్తుతో సోకులు అంటూ ఇష్టం వచ్చినట్టు లెక్కలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న. ప్రజా ధనంతో దుబారా సబబు కాదు @ysjagan గారు. మంచినీళ్లు, మజ్జిగ కోసం కోటి, కరెంట్ పని, కుర్చీల కోసం 4 కోట్లు మంది సొమ్ముతో విలసాలు ఏంటి? ఊరికో రాజ భవనం నిర్మించుకోవడం మీకు ఫ్యాషన్ అయినా వాటిని నిర్వహించే స్తోమత రాష్ట్ర ప్రజలకు లేదు జగన్ రెడ్డి గారు అంటూ లాఫింగ్ బుద్దా పేరుతో ట్వీట్ చేశారు. కరోనా వేళ ఈ ట్వీట్ల యుద్ధం ఏపీలో మహా పసందుగా సాగుతోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle