newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

విజయసాయి.. దూకుడు తగ్గట్లేదు

15-06-201915-06-2019 15:04:05 IST
Updated On 21-06-2019 16:54:29 ISTUpdated On 21-06-20192019-06-15T09:34:05.019Z15-06-2019 2019-06-15T09:34:00.618Z - 2019-06-21T11:24:29.632Z - 21-06-2019

విజయసాయి.. దూకుడు తగ్గట్లేదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చేవరకూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో టీడీపీని టార్గెట్ చేశారు. మే 23వ తేదీన ఫలితాలు రావడం, జగన్ అఖండ విజయం సాధించడంతో ఆయన దూకుడుకి కళ్ళెం పడడం లేదు. రోజుకోరకంగా కామెంట్లు చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.

ఇప్పుడు మళ్ళీ విజయ సాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా కామెంట్లతో వేడెక్కిస్తున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన సంఘటన రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. గన్నవరం విమానాశ్రయంలో మాజీ సీఎం చంద్రబాబును తనిఖీలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ర్యాలీలు కూడా నిర్వహించారు. 

ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కూడా కేటాయించలేదని అధికారుల తీరుపై తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ నుంచి కౌంటర్ పంచ్‌లు ఇస్తున్నారు నేతలు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి పాత సంఘటనలను గుర్తుచేస్తూ టీడీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

Image may contain: text

ప్రతిపక్ష నేతగా ఉండగా.. జగన్ పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగినప్పుడు భద్రత ఎందుకు కల్పించలేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకి ఏదో జరిగినట్లు శోకాలు పెడుతున్నారని ఆయన విమర్శించారు.

ఆయన కాన్వాయ్‌కి ట్రాఫిక్ ను ఆపడం లేదని.. ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్లు ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రికి, ప్రతిపక్షనేతకు ప్రోటోకాల్ ఉండదన్న సంగతి తెలుసుకోవాలన్నారు. 

అలా అయితే... విపక్షనేతగా మీరు ఫెయిలైనట్టే


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle