newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న ట్వీట్లవార్

30-10-201930-10-2019 19:17:20 IST
Updated On 31-10-2019 12:09:46 ISTUpdated On 31-10-20192019-10-30T13:47:20.084Z30-10-2019 2019-10-30T13:45:09.299Z - 2019-10-31T06:39:46.746Z - 31-10-2019

విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న ట్వీట్లవార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో టీడీపీ నుంచి లోకేష్ ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తుంటే.. ఇప్పుడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న యాక్టివ్ అయ్యారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్వీట్లతో దాడి చేశారు. ఇసుక దుమారం, అమరావతి నిర్మాణం, కంటివెలుగు.. ఇలా ఏ అంశాన్నీ వదలలేదు బుడ్డా వెంకన్న. విజయసాయిరెడ్డిని ఎకాఎకిన ట్వీటాట ఆడేసుకున్నారు. అయ్యా @VSReddy_MP గారు, ట్విట్టర్ లో ఇసుక కొరత లేదు అని మీరు సెలవిచ్చారు  బానే ఉంది, మరి మీ మేధావి @ysjagan ఇసుక వారోత్సవాలు ఎందుకు చేస్తున్నట్టు? మీ వైకాపా ఇసుక మాఫియా ట్రాక్టర్ డ్రైవర్లపై దాడులు చేసి ఇసుక ఎత్తుకుపోతున్నారు, అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడడంలేదని ట్వీటేశారు.

No photo description available.

అంతటితో ఆగలేదు బుడ్డా వెంకన్న. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి పందికొక్కుల్లా ఇసుకని తింటూ, భవన నిర్మాణ కార్మికులని మింగేస్తున్న మీరు ఇసుక గురించి నీతులు మాట్లాడుతున్నారా? పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదన్నట్లుగా ఉంది మీ వ్యవహారం. దమ్ముంటే ఇసుక కొరత లేదని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి ? అని సవాల్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజలు ఛీ కొట్టడాన్ని భరించలేక జగన్ కి మతిస్థిమితం పోవడంతో మీకు మెదడు మోకాల్లోకి జారినట్టు ఉంది విజయసాయిరెడ్డి. 

No photo description available.

రాష్ట్రం ఆత్మహత్యలతో అట్టుడుకుతుంటే మీరు, మీ ముఖ్యమంత్రి గారు ఫిడేలు వాయించుకుంటున్నారు. మిమ్మల్ని చూసి సిగ్గే సిగ్గుపడుతుంది. చంద్రబాబు  హయాంలో ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాల్లో ప్రజలు అంతా కంటి పరీక్షలు చేయించుకున్నారు.

ఇప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు పథకంలో కంటి పరీక్ష చేయించుకోవాల్సింది మీరు ఒక్కరే. మీకు చత్వారం రావడం వలనే అమరావతిలో జరిగిన నిర్మాణాలు కనబడటం లేదు. వయసుకూడా పెరుగుతోంది కదా. అమరావతి గ్రాఫిక్స్ ఐతే, చంద్రబాబుగారు నిర్మించిన సచివాలయం నుండి పాలన ఎవరు చేస్తున్నట్టు?అని ప్రశ్నించారు వెంకన్న. 

హైకోర్టు గ్రాఫిక్ అంటున్నారు, త్వరలో  వెళ్తారుగా అప్పుడు మీకు మబ్బులు వీడడం ఖాయం అన్నారు. అధికారం వచ్చిన 5 నెలల్లో అమరావతిని ఎడారి చేసిన సిగ్గులేని జన్మ మీది,మీ సీఎం  గారిది విసారెడ్డి! గారూ.. అంటూ తూర్పారబట్టారు ట్విట్టర్ లో టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. మరి ఈ ట్వీట్లకు విజయసాయిరెడ్డి ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి. 

 

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   8 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   8 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   9 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   10 hours ago


తూర్పుగోదావరి  వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

తూర్పుగోదావరి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

   10 hours ago


కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

   15 hours ago


బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

   15 hours ago


సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

   16 hours ago


రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

   16 hours ago


మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle