newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

విజయసాయికి కరోనా.. సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్

22-07-202022-07-2020 09:23:15 IST
Updated On 22-07-2020 12:10:36 ISTUpdated On 22-07-20202020-07-22T03:53:15.517Z22-07-2020 2020-07-22T03:53:10.600Z - 2020-07-22T06:40:36.179Z - 22-07-2020

విజయసాయికి కరోనా.. సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్క ట్వీట్ పెట్టి ఆసక్తికర చర్చ రేపారు. విజయసాయి హోం క్వారంటైన్ కు వెళుతున్నట్టు ట్వీట్ చేశారు. ఇప్పటికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. పది రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని విజయసాయి నిర్ణయించారు. కరోనా మహమ్మారి బారినపడ్డ వైసీపీ ప్రజాప్రతినిధుల జాబితాలో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చేరారు.

https://www.photojoiner.net/image/B0Rp2xeb 

ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా, విజయసాయిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ అని తేలినట్టు తాజా సమాచారం. ఈ నేపథ్యంలో, విజయసాయి ట్విట్టర్ లో స్పందించారు. "కరోనా పరిస్థితుల దృష్ట్యా, నాకు నేనుగా వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్ లో ఉండడం తప్పదు. టెలిఫోన్ లోనూ అందుబాటులో ఉండను.. ఏవైనా కొన్ని అత్యవసర విషయాలకు మాత్రమే సంప్రదించగలరు" అంటూ ట్వీట్ చేశారు.

నిత్యం ఎంతో బిజీగా తిరిగే విజయసాయి హోం క్వారంటైన్ కి వెళ్ళడం, అత్యవసర కాల్స్ కి మాత్రమే తాను స్పందిస్తానని చెప్పడంతో వైసీపీ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. నిత్యం విపక్ష నేతలపై సెటైర్లు వేస్తుంటారు. అలాంటిది విజయసాయి సైలెంట్ అయిపోతే ఎలా అంటున్నారు. మరోవైపు విపక్ష నేతలు మాత్రం రిలీఫ్ ఫీలవుతున్నారు. 

టీడీపీ నేతలు రాజకీయాలను పక్కన పెట్టి విజయసాయిరెడ్డి త్వరగా కోలుకోవాలని ట్వీట్‌లు, పోస్టులు పెడుతున్నారు. ఈ మహమ్మారిపై త్వరగా గెలవాలని ఆకాంక్షించారు. ‘విజయసాయిరెడ్డి గారు మీకు నిజంగానే కరోన సంక్రమిస్తే మీరు వైరస్ ని జయించి..రావాలి. టెస్టులు,వైద్యం మన రాష్ట్రం లోనే చేయించుకోండి.మన రాష్ట్ర ప్రజలకి మనోధైర్యం ఇచ్చినట్లు ఉంటుంది.. విజయోస్తు.. సుఖీభవ’అంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. 

ఇటు విజయసాయిపై మామూలు రోజులలో అంతెత్తున లేచే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా తనదైన రీతిలో స్పందించడం విశేషం. ‘‘రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప వ్యక్తిగతంగా మా మధ్య ఎటువంటి గట్టు తగాదా లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడటం బాధాకరం. ఆయన కరోనా నుండి త్వరగా కోలుకుని ట్విట్టర్ లో యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అన్నారు. 

అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. రాజకీయంగా విభేదించినా ఈ కరోనాకి అందరం ఒకటే. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. మొత్తం మీద విజయసాయి ట్వీట్ మీద కూడా వరుసగా ట్వీట్లు రావడం హాట్ టాపిక్ అవుతోంది. 

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   6 minutes ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   25 minutes ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   an hour ago


మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

   14 hours ago


సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

   14 hours ago


ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

   16 hours ago


రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

   18 hours ago


మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

   20 hours ago


ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

   a day ago


కృష్ణానదిలో అంతకంతకూ పెరుగుతున్న వరద!

కృష్ణానదిలో అంతకంతకూ పెరుగుతున్న వరద!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle