newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

విజయవాడ సెంట్రల్ సీటును మల్లాది గెలిచేశారట?

23-03-201923-03-2019 09:21:28 IST
2019-03-23T03:51:28.763Z23-03-2019 2019-03-23T03:51:19.146Z - - 22-09-2019

విజయవాడ సెంట్రల్ సీటును మల్లాది గెలిచేశారట?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు దాదాపుగా గెలిచేశారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మల్లాది విష్ణు సామాజిక వర్గమైన బ్రాహ్మణ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది. దీంతో పాటు మరో బలమైన కాపుల ఓట్లు కూడా విష్ణు వైపే ఉన్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారట. వైసీపీ నుంచి ఈ సీటు ఆశించిన వంగవీటి రాధా, ఆ తర్వాత టీడీపీలో చేరి భంగపడ్డారు. దీంతో ఆయన ఇప్పుడు విజయవాడ సెంట్రల్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంఎల్ఏ బోండా ఉమాకు మద్దతుగా తిరుగుతున్నారు.

అయితే ఇప్పుడు బ్రాహ్మణుల ఓట్లు గంపగుత్తగా విష్ణు వైపు ఉన్నాయనీ, దీంతో పాటు రంగా అభిమానుల్లో ఎక్కువ శాతం మంది మల్లాది విష్ణుకే మద్దతు ఇస్తున్నారని మల్లాది ఫాలోవర్స్ చెప్పే మాట. ఎందుకంటే వంగవీటి రాధా టీడీపీలో చేరడం కాపులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారట. తన తండ్రిని చంపిన పార్టీలోకి రంగా ఎలా వెళ్లారని వీరంతా కోపంగా ఉన్నారట. ఇదే సమయంలో ఎంఎల్ఏగా బోండా ఉమ దాష్టికాల మీద కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమా పేరుతో ఆయన అనుచరులు భూకబ్జాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు జనం ఆరోపిస్తున్నారట. ఈ మొత్తం ఎపిసోడ్ వివరిస్తున్న జనం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణు గెలుపు ఖరారు అయినట్లు చెబుతున్నారు. కాకపోతే ఎన్నికలు, కౌంటింగ్ తర్వాతే వాస్తవం ఏంటో తేలిపోతుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle