newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

విజయవాడ వెస్ట్.. అలీకి బెస్ట్ అవుతుందా?

12-03-201912-03-2019 11:54:41 IST
2019-03-12T06:24:41.440Z12-03-2019 2019-03-12T06:24:39.418Z - - 25-02-2020

 విజయవాడ వెస్ట్.. అలీకి బెస్ట్ అవుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీలో చేరిన కమెడియన్ అలీ... ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలీ కోసం వైసీపీ అధినేత ఏ సీటు కేటాయించారు. ఇదే ఇప్పుడు జగన్ పార్టీలో హాట్ టాపిక్. మొదటి నుంచీ అలీ టీడీపీలో చేరతారంటూ వచ్చిన వార్తలకు ఝలక్ ఇస్తూ ఆయన వైసీపీలో చేరారు. గుంటూరు తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా అలీ పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే... స్థానిక మైనార్టీ నేతలు, అలీ అభ్యర్థిత్వాన్ని ఒప్పులేదట. ఇన్నాళ్లూ పార్టీకి సేవ చేసిన తమను పక్కన పెట్టి... కొత్త వ్యక్తిని తెస్తే ఎన్నికల్లో పని చేయమని తేల్చి చెప్పారట. 

ఈ విషయాలన్నీ తెల్సుకున్న అలీ, లేనిపోని గొడవ ఎందుకని భావించి వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో అలీ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. వైసీపీ వర్గాల ప్రకారం... విజయవాడ పశ్చిమ సీటు నుంచి వైసీపీ అభ్యర్థిగా అలీ బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంఎల్ఏ జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్ పోటీ చేస్తున్నారు.

దీంతో అలీని ఇక్కడ నుంచి బరిలో దింపాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ వెల్లంపల్లి శ్రీనివాస్‌ను ఒప్పించాల్సిన బాధ్యత జగన్ మీదే ఉందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle