newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

విజయవాడేనా.... వైజాగ్ ఎందుకంత దూరం..?-2

26-06-201926-06-2019 07:50:59 IST
Updated On 26-06-2019 07:56:34 ISTUpdated On 26-06-20192019-06-26T02:20:59.425Z26-06-2019 2019-06-26T02:20:52.071Z - 2019-06-26T02:26:34.497Z - 26-06-2019

విజయవాడేనా.... వైజాగ్ ఎందుకంత దూరం..?-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

విజయవాడ-గుంటూరు కాకుండా, అప్పటికే అంతర్జాతీయ నగర స్థాయికి చేరుకున్న విశాఖను ఒకవేళ రాజధానిగా చేసుకుని వుంటే టీడీపీ ప్రభుత్వానికి ఏవిధమైన మకిలీ అంటుకుని ఉండేది కాదన్న వాదనలో కూడా నిజం లేకపోలేదు.

ఎందుకంటే విశాఖ నగరం అచ్చంగా మినీ భారతదేశం మాదిరి వుంటుంది. హైదరాబాద్‌లో కనిపించే భిన్న సంస్కృతులు విశాఖలో కూడా చూడచ్చు. ఒక మాటలో చెప్పాలంటే విశాఖ భాగ్యనగరానికి నకలు. బెజవాడ తరహా కులం మార్క్ రాజకీయాలు అక్కడ అస్సలు కనిపించవు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నం దేశంలో అతి పెద్ద జిల్లాగా ఉంది. 

విశాఖ ఉక్కు కర్మాగారం, జింకు శుద్ది కర్మాగారం, హిందుస్థాన్ షిప్‌యార్డు, కోరమాండల్ ఫెర్టిలైజర్, గంగవరం పోర్టు, హెచ్‌పీసీఎల్ వంటి సంస్థలు, అనేక ఫార్మాస్యూటికల్ పరిశ్రమలతో దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖ పేరొందింది.

హుద్‌హుద్ తుఫాన్ సమయంలో పది రోజులు విశాఖలోనే ఉండిపోయిన చంద్రబాబు ఆ సందర్భంలోనే ఆ నగరం గొప్పతనాన్ని స్వయంగా చూడగలిగారు. అమరావతితో సమానంగా విశాఖను అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లకు విశాఖను వేదికగా చేసుకోవడంతో ఆయన ఊహించిన దానికంటే ముందుగానే నగరం అభివృద్ధి చెందింది. దానికితోడు ఐటీ రంగానికి ఏపీలో ముఖ్య చిరునామాగా మారింది.

ఇన్ని ప్రత్యేకతలు గల విశాఖకు రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని ఉత్తరాంధ్ర ప్రజానీకం ఆశిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర శాసనసభను అమరావతిలో కాకుండా సాగరతీర నగరంలో నిర్మించాలని విశాఖవాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు. విశాఖ రాష్ట్రానికి ఒక మూలన ఉంటుందన్న వాదన కూడా సరికాదు. 

హైదరాబాద్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా చేసుకున్నప్పుడు కూడా ఇటువంటి అభ్యంతరాలే వినిపించాయి. కానీ, అవేమీ ఆనాడు అడ్డుకోలేకపోయాయి.

ఇప్పుడు జగన్ సర్కార్ అభివృద్ధినంతా ఒకేచోట కేంద్రీకరించకుండా విశాఖలో అసెంబ్లీ, రాయలసీమ (కర్నూలు)లో హైకోర్టు, అమరావతిలో సచివాలయం, శాఖధిపతుల కార్యాలయాలు ఏర్పాటుచేసుకుని పరిపాలన సాగిస్తే అది అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చినట్టు అవుతుందనేది కొత్త వాదన. మరి దీనికి అధికార పక్షం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

విజయవాడేనా.... వైజాగ్ ఎందుకంత దూరం..?-1


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle