newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

విజయవాడేనా.... వైజాగ్ ఎందుకంత దూరం..?-1

26-06-201926-06-2019 07:50:57 IST
Updated On 26-06-2019 17:04:38 ISTUpdated On 26-06-20192019-06-26T02:20:57.380Z26-06-2019 2019-06-26T02:17:55.587Z - 2019-06-26T11:34:38.785Z - 26-06-2019

విజయవాడేనా.... వైజాగ్ ఎందుకంత దూరం..?-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నవ్యాంధ్ర రాజధాని ఎంపికలో విశాఖ నగరాన్ని విస్మరించడం వల్లే తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి దూరమైందా? హైదరాబాద్ కంటే ముందే గ్రేటర్ సిటీ హోదా పొందిన విశాఖపట్నాన్ని ‘తాత్కాలిక రాజధాని’గా మార్చుకుని ఉంటే మొన్నటి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి ఉండేదా? అంతర్జాతీయ నగరంగా ఖ్యాతిగాంచిన విశాఖను వదిలేసి అమరావతి పేరిట ప్రపంచశ్రేణి నగరాన్ని నిర్మించడానికి సాహసించి చంద్రబాబు చేజేతులా అధికారాన్ని జారవిడుచుకున్నారా? అసలీ కొత్త వాదన కథేమిటి? ఈ కొత్త కోణంలో నిజానిజాలేంటి? 

సుమారు 208 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న విశాఖ నగరానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన పాణిని, కాత్యాయనుని రచనల్లో ‘విశాఖ’ ప్రస్తావన ఉంది. ఎన్నో ప్రముఖ వంశాల రాచరికపు ఏలుబడిలో ఖ్యాతిగాంచింది ఈ విశాఖ. 7వ శతాబ్దంలో కళింగులు, 8వ శతాబ్ధంలో చాళుక్యులు,

తరువాతి కాలంలో రెడ్డిరాజులు, చోళులు, గోల్కొండకు చెందిన కుతుబ్ షాహీలు, మొఘలులు, హైదరాబాద్ నవాబులు పాలించారు. 1700 నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీవారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతి కొద్ది వర్తక స్థావరాలలో విశాఖ ఒకటి. సహజసిద్ధమైన నౌకాశ్రయం విశాఖ రేవు ప్రత్యేకత. ఉక్కు కర్మాగారం స్థాపనతో విశాఖ నగరం శాఖోపశాఖగా ఎదిగి ప్రస్తుతం ఒక అంతర్జాతీయ నగరంగా గుర్తింపుపొందింది.  

కొత్తగా ఏర్పాటుచేసిన రాష్ట్రానికి రాజధానిగా ఏ ప్రాంతమైతే బావుంటుందో పరిశీలించి శివరామకృష్ణ కమిటీ కొన్ని ఆప్షన్లు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఆ ఆప్షన్లన్నీ పక్కకుపెట్టి రాష్ట్రానికి నడిబొడ్డున, అది కూడా నది ఒడ్డున ఉన్న కృష్ణాతీర ప్రాంతమైతే అన్నివిధాలా బావుంటుందని నిర్ణయించింది.

విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ఏర్పాటు చేయబోయే ఈ సరికొత్త నగరానికి ‘అమరావతి’ అనే పేరు భేషుగ్గా సరిపోతుందని మీడియా మొఘల్ రామోజీరావు చెప్పడంతో చివరికి ఆ పేరే ఖరారు చేశారు.

పేరుకు అమరావతి గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ, ఉద్యోగులు, అధికారులు, ఇతర ప్రభుత్వ ప్రముఖుల్లో అత్యధిక శాతం విజయవాడ నుంచే రాకపోకలు సాగిస్తుండటంతో ఈ నగరమే అసలు రాజధానిగా మారింది.

కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే బెజవాడకు ఒక్కసారిగా ‘రాజధాని’ హోదా రావడంతో ఊహించని రీతిలో ఏపీ రాజకీయాలు కులం రంగు పులుముకున్నాయి. అప్పటి నుంచే టీడీపీకి కౌంట్‌డౌన్ షురూ అయ్యిందని చెప్పాలి. 

అధికార పార్టీ ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తోందనే అసంతృప్తి మిగిలిన అన్ని వర్గాల్లో ఈ నాలుగేళ్లలో అంతకంతకూ పెరిగిపోయిందనేది వాస్తవం. చంద్రబాబు చుట్టూ ఎప్పుడూ ఆ సామాజిక వర్గం వారే ఒక కోటరిలా కమ్ముకుని ఉంటుండటం ఇతర సామాజిక వర్గాలకు నచ్చలేదు. దాంతో ఎప్పుడూ లేనంతగా ఈ ఎన్నికలు కుల సమీకరణలతో రసవత్తరంగా మారాయి. దాని ప్రభావమే ఫలితాల్లో చాలా స్పష్టంగా కనిపించింది. (ఇంకా ఉంది)

విజయవాడేనా.... వైజాగ్ ఎందుకంత దూరం..?-2


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle