newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

విజయవాడలో రెడ్ జోన్ .. సరుకుల పంపిణీ

11-04-202011-04-2020 11:07:30 IST
Updated On 11-04-2020 11:57:24 ISTUpdated On 11-04-20202020-04-11T05:37:30.016Z11-04-2020 2020-04-11T05:37:20.660Z - 2020-04-11T06:27:24.907Z - 11-04-2020

విజయవాడలో రెడ్ జోన్ .. సరుకుల పంపిణీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నివురు గప్పిన నిప్పులా వ్యాపిస్తోంది కరోనా వైరస్. ఈనేపథ్యంలో విజయవాడలోని  పాత రాజరాజేశ్వరి పేట రెడ్ జోన్ ను పరిశీలించారు సీపీ ద్వారకా తిరుమల రావు. అధికారులకు పలు సూచనలు చేశారు. మున్సిపల్ అధికారులను వివరాలు అడిగి అప్రమత్తం చేశారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో పాజిటివ్ కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. విజయవాడలో ఆరు ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించామన్నారు. 

రెడ్ జోన్ ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, ,ప్రజలు బయటకి రావద్దన్నారు. ఫుడ్ సప్లై చేసే వాళ్ళు మున్సిపల్ కార్పోరేషన్ లో ఒక నెంబర్ ఏర్పాటు చేస్తాయని, రెడ్ జోన్ కి సంబంధించి పోలీస్ శాఖ తరుపున 1 ఎస్.ఐ,మున్సిపల్ అధికారులు పర్యవేక్షణలో  ఉంటారన్నారు. ఫుడ్ సప్లై చేసే ప్రతి ఒక్కరు అనుమతి తీసుకోవాలి..లేకపోతే కఠినమైన శిక్ష వేస్తాం అన్నారు. మరోవైపు కరోనా లక్షణాలు దాచినా కేసులు పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. 

ఇటు గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఈనెల 12వ తేదీ ఆదివారం సంపూర్ణంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటనలో తెలిపారు. సాధారణ రోజులలో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిత్యావసర సరుకులు కొనుగోలుకు ఇచ్చిన వెసులుబాటు కూడా ఆదివారం రోజు ఉండదన్నారు. గుంటూరు జిల్లాలోని అన్ని రెడ్ జోన్ల పరిధిలో వున్న వారు ఎవ్వరూ  బయటకు వెళ్ళే వీలులేదన్నారు.  

మెడికల్ షాపులు, ఆసుపత్రులకు మాత్రం ఆదివారం రోజు మినహాయింపు వుంటుందన్నారు. లాక్ డౌన్ ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు ఆ ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు కనీసం 15 రోజులకు అవసరమైన నిత్యావసర వస్తువులను సమకూర్చుకోవలసి  ఉంటుందన్నారు. మందులు, పిల్లలకు పాల డబ్బాలు వంటివి అవసరమైనంత ముందస్తుగా సమకూర్చుకోవాలని కోరారు. 

అవసరమైన పక్షంలో కూరగాయలు ప్రత్యామ్నాయ రోజులలో... పోలీసులు అనుమతించిన రోజులలో ఉదయం 6 నుండి 9 గంటల లోపు కొనుగోలు చేసుకోవచ్చని  జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధానికై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ఈ  చర్యలకు  ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని ఆ ప్రకటనలో జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. 

కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసినా.. బయటకు చెప్పనందుకు తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురిపై కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్‌ అస్మి చెప్పిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా నుంచి శంఖవరం మండలం కత్తిపూడికి వచ్చిన ఓ వ్యక్తకి కరోనా లక్షణాలు కనిపించాయి. ఆయన ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స చేయించుకున్నారు.

అయినా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలో బాధితుడి మామ, వైద్యం చేసిన ఆర్ఎంపీ వైద్యుడు, అతడికి రక్త పరీక్షలు చేసిన ల్యాబ్ టెక్నీషియన్‌పై కేసులు నమోదయ్యాయి. బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటతో చికిత్స కోసం విశాఖపట్నానికి తరలించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నప్పుడు తెలియజేయకపోతే ఆ కుటుంబ సభ్యులతో పాటు వైద్యం చేసిన వారిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ నయీమ్‌ అన్నారు. 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle