newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

విచ్చల విడిగా ప్లాస్మా అమ్మకాలు..!

17-09-202017-09-2020 10:45:09 IST
2020-09-17T05:15:09.446Z17-09-2020 2020-09-17T04:16:45.333Z - - 30-09-2020

విచ్చల విడిగా ప్లాస్మా అమ్మకాలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో విచ్చల విడిగా ప్లాస్మా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ప్లాస్మా కావాల్సిన వారు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించడం.. ఆ తర్వాత వారి నుండి డబ్బు డిమాండ్ చేస్తూ ఉండడం.. ఇలాంటి పనులు మధ్యవర్తుల సమక్షంలో జరుగుతూ ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పెద్ద ఎత్తున ప్లాస్మా కోసం డబ్బులను గుంజుతున్నారు.

నెల్లూరు లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లో ఓ వ్యక్తి ప్లాస్మాను ఇవ్వడానికి వచ్చాడు. 5000 రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉండగా ఇంకా ఎక్కువ డబ్బును డిమాండ్ చేశాడు సదరు ప్లాస్మా దాత. బ్లడ్ బ్యాంకు వాళ్ళు ఒప్పుకోకపోవడంతో సదరు వ్యక్తి ఎవరికైతే ప్లాస్మా అవసరమో ఆ కుటుంబాన్ని సంప్రదించాడు. మీరేమైనా ఎక్కువ డబ్బులు ఇవ్వగలరా అని పేషెంట్ కుటుంబాన్ని అడిగాడు.

అతడు అడిగిన డబ్బులు ఇవ్వలేమని వారు చెప్పడంతో సదరు వ్యక్తి సైలెంట్ గా జారుకున్నాడు.  విశాఖపట్నంలో  ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి కోవిద్-19 బారిన పడ్డాడు. అతడికి కూడా ప్లాస్మా కావాలని వెతుకుతూ ఉండగా.. ఓ వ్యక్తి బ్లడ్ గ్రూప్ కు పేషెంట్ బ్లడ్ గ్రూప్ కు సరిపోయింది. దీంతో ఆ వ్యక్తి తనకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని కోరాడు.కుటుంబం గడవడమే కష్టమవుతోందని ప్లాస్మా ఇస్తాను కాస్త ఎక్కువ డబ్బు ఇవ్వండి అని అడిగాడట..!

రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్మా దానం చేసిన వారికి 5000 రూపాయలు ఇస్తోంది. 400 ఎంఎల్ ప్లాస్మా కు 14000 రూపాయల వరకూ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులలో వసూలు చేస్తూ ఉన్నారు.  కొందరు మధ్యవర్తులు  బ్లడ్ బ్యాంకులలో ప్లాస్మా లభించకపోతే తమకు తెలిసిన వారు ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున డబ్బు గుంజుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు కూడా మధ్యవర్తులకు భారీగా కమీషన్లను ఇస్తూ ప్లాస్మా డోనర్లను సంప్రదిస్తూ ఉన్నారు. 

జనవరిలో శశికళ జైలు నుండి విడుదల.. అన్నాడీఎంకేలో పరుగులు!

జనవరిలో శశికళ జైలు నుండి విడుదల.. అన్నాడీఎంకేలో పరుగులు!

   an hour ago


అన్నదాతను వెంటాడుతున్న అవే ఇబ్బందులూ... అవే ఆంక్షలూ!

అన్నదాతను వెంటాడుతున్న అవే ఇబ్బందులూ... అవే ఆంక్షలూ!

   3 hours ago


బాబ్రీ బాసీదు కూల్చివేత కేసు.. కోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన!

బాబ్రీ బాసీదు కూల్చివేత కేసు.. కోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన!

   6 hours ago


కరోనాపై కథలు కాదు... వాస్తవాలు చెప్పాలి..?!

కరోనాపై కథలు కాదు... వాస్తవాలు చెప్పాలి..?!

   8 hours ago


ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

   9 hours ago


దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

   11 hours ago


దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

   11 hours ago


తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

   11 hours ago


తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

   11 hours ago


అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle