newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

విక‌టించిన బాబు ప్ర‌యోగం.. ఆది కూడా జంప్‌..!

19-08-201919-08-2019 08:11:25 IST
Updated On 20-08-2019 11:36:33 ISTUpdated On 20-08-20192019-08-19T02:41:25.808Z19-08-2019 2019-08-19T02:41:15.624Z - 2019-08-20T06:06:33.469Z - 20-08-2019

విక‌టించిన బాబు ప్ర‌యోగం.. ఆది కూడా జంప్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కడ‌ప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గ‌ట్టి షాక్ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టికే జిల్లాకు చెందిన ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్ పార్టీకి గుడ్‌బై చెప్పి కాషాయ కండువా క‌ప్పేసుకోగా తాజాగా మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి కూడా అదే బాట‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

త్వ‌ర‌లోనే ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న బీజేపీ పెద్ద‌ల‌తో ఇప్ప‌టికే మంత‌నాలు జ‌రిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఆదినారాయణ‌రెడ్డి కొన్ని రోజుల‌కే ఆ పార్టీకి దూర‌మయ్యారు. 

తెలుగుదేశం పార్టీ మొద‌టిపెట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు లొంగి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. మూడేళ్ల పాటు జ‌గ‌న్ స్వంత జిల్లా అయిన క‌డ‌ప‌లో ఆదినారాయ‌ణ‌రెడ్డి చ‌క్రం తిప్పారు. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీలో ముందుండేవారు.

క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్‌ను దెబ్బ‌తీయాల‌నే ఏకైక ల‌క్ష్యంతో చంద్ర‌బాబు అప్ప‌ట్లో ఆదినారాయ‌ణ‌రెడ్డిని పార్టీలో చేర్చుకొని ఓ పెద్ద ప్ర‌యోగ‌మే చేశారు. జ‌మ్మ‌ల‌మ‌డుగులో నాలుగు ద‌శాబ్దాలుగా ఉన్న ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌ను కాద‌ని, మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డిని బుజ్జ‌గించి మ‌రీ ఆదినారాయ‌ణ‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకొని మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. 

రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. ఇద్ద‌రు ప్ర‌త్య‌ర్థులూ క‌లిసినా గ్రామ స్థాయిలో రెండు వ‌ర్గాలు మాత్రం క‌ల‌వ‌లేదు.ఎన్నిక‌ల వేళ జ‌మ్మ‌ల‌మ‌డుగు టిక్కెట్ కోసం ఇద్ద‌రూ ప‌ట్టుబ‌ట్ట‌డంతో కీల‌క‌మైన స‌మ‌యంలో ఏడెనిమిది సార్లు వీరిద్ద‌రితో చంద్ర‌బాబు మాట్లాడి.. రామ‌సుబ్బారెడ్డిని అసెంబ్లీకి, ఆదినారాయ‌ణ‌రెడ్డిని క‌డ‌ప ఎంపీగా పోటీ చేయించారు. 

ఓడిపోయే స్థానం నుంచి త‌న‌ను పోటీ చేయిస్తున్నార‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి అప్ప‌టికే అసంతృప్తికి గుర‌య్యారు. కాగా, ఇద్ద‌రూ దారుణంగా ఓట‌మి పాల‌య్యారు.

పైగా తాను అనేక వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసిన జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డంతో ఆదినారాయ‌ణ‌రెడ్డి ఆలోచ‌న‌లో ప‌డిపోయారు. క‌డ‌ప జిల్లాలో వైసీపీ బ‌లాన్ని త‌ట్టుకొని తాను నిల‌బ‌డాలంటే బీజేపీలోకి వెళ్లాల్సిందే అనే నిర్ణ‌యానికి ఆయ‌న వ‌చ్చారని తెలుస్తోంది. ఎన్నిక‌ల వేళ డ‌బ్బు విష‌యంలోనూ చంద్ర‌బాబుతో ఆదినారాయ‌ణ‌రెడ్డికి కొంత దూరం పెరిగింద‌నే ప్ర‌చారం కూడా ఉంది. 

వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఆదినారాయ‌ణ‌రెడ్డి.. త‌న‌కు ఇప్పుడు బీజేపీ అయితేనే సేఫ్ అనే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఆయ‌న బీజేపీలో చేరితే క‌డ‌ప జిల్లాలో ఆ పార్టీ బ‌లోపేతానికి కొంత ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు. మొత్తంగా క‌డ‌ప‌లో చంద్ర‌బాబు చేసిన ప్ర‌యోగం విక‌టించింద‌నే చెప్పాలి. ఇక‌, మూడేళ్ల మంత్రి ప‌ద‌వి కోసం ఆదినారాయ‌ణ‌రెడ్డి సైతం అనాలోచిత నిర్ణ‌యం తీసుకొని రాజ‌కీయ జీవితాన్ని రిస్క్ చేశారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle