newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

వికేంద్రీకరణకే బోస్టన్ రిపోర్టు మొగ్గు ... మూడుకే చోటు

04-01-202004-01-2020 09:04:24 IST
Updated On 04-01-2020 12:41:46 ISTUpdated On 04-01-20202020-01-04T03:34:24.750Z04-01-2020 2020-01-04T03:34:13.394Z - 2020-01-04T07:11:46.059Z - 04-01-2020

వికేంద్రీకరణకే బోస్టన్ రిపోర్టు మొగ్గు ... మూడుకే చోటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చారిత్రక నేపథ్యం ఆధారంగా డిస్ట్రిబ్యూటెడ్ క్యాపిటల్ అయితే ఏపీకి బాగుంటుందని బీసీజీ సిఫార్సు చేసింది. ఒక ప్రాంతంపై మరో ప్రాంతానికి ఉన్న అనుమానాల నేపథ్యంలో వికేంద్రీకరణకు అవకాశం ఇవ్వాలని సూచించింది. ప్రాంతీయ అకాంక్షలను సమన్వయం  చేస్తూ., చారిత్రక నేపథ్యానికి న్యాయం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికతో పాటు రాష్ట్రంలో 13 జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రపంచంలో గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలు, రాజధాని నగరాల నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనం చేసిన బీసీజీ ప్రతినిధులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక సమర్పించారు. ఒకేచోట సంపదంతా పోగుచేయడం మంచిది కాదని సిఫార్సు చేసింది. 

రాజధానులు జనసమర్ధ నగరాలు కాకుండా ఉండేలా జాగ్రత్తలు వహించాలని, సౌత్ ఆఫ్రికాలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేశారని, కర్ణాటక- ఉత్తర కర్ణాటక., మహారాష్ట్ర- విదర్భలలో  ప్రాంతీయ ఉద్యమాలతో ప్రత్యేక అసెంబ్లీలు పెట్టారని బీసీజే నివేదిక తెలిపింది. తూర్పు-పశ్చిమ  జర్మనీల ఏకీకరణ సమయంలో రాజధానులు బెర్లిన్‌., బాన్‌లలో ఉంచారు. సౌత్ అఫ్రికా., మలేషియా., చిలీ, జర్మనీ., సౌత్ కొరియా దేశాల్లో రాజధానుల వికేంద్రీకరణ జరిగిందని నివేదిక వెల్లడించింది. 

మూడురాజధానుల పాలన వివిధ రాష్ట్రాలకు కొత్తకాదని వెల్లడించింది. దేశంలో ఏడు రాష్ట్రాల్లో యూపీ., కేరళ., ఉత్తరాఖండ్., ఒడిసా., మధ్యప్రదేశ్ వంటి చోట వేర్వేరు నగరాల్లో పాలన సాగుతోంది. న్యాయ., శాసన., పరిపాలన వ్యవస్థల మధ్య సమన్వయం చేయడంపై దృష్టి పెట్టడం. ప్రజలకు సులువైన పాలనా సేవలు అందించడంపై  పలు సిఫార్సులు చేశారు. ప్రాంతీయ అకాంక్షల ఆధారంగా నగర విస్తీర్ణం., చారిత్రక నేపథ్యం, జనాభాల ఆధారంగా సిఫార్సులు చేశారు.  గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ నిర్మాణం రాష్ట్రానికి నష్టదాయకం అని సూచించింది.

ప్రపంచంలో 30 గ్రీన్‌ఫీల్డ్‌ సిటీల నిర్మాణాలు విఫలమయ్యాయని, తన నివేదికలో హెచ్చరించింది బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు. అమరావతి కోసం రూ.1.20 లక్షల కోట్లు పెట్టినా ఫలితం ఉండదన్నారు.

ఒక్కచోటే లక్ష కోట్లకు పైగా పెడితే రాయలసీమ, ఉత్తరాంధ్రకు అన్యాయం చేసినట్లేనని నివేదిక వెల్లడించింది. ఈ మొత్తం ఇరిగేషన్‌పై పెడితే ఐదేళ్లలో 90 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని విశ్లేషించింది.  ఏపీలో అధికార వికేంద్రీకరణ కోసం రెండు ఆప్షన్లు ఇస్తూ.. విశాఖ, అమరావతి, కర్నూలు పట్టణాల్లో పరిపాలనను వికేంద్రీకరించాలని సూచించింది. 

బోస్టన్‌ నివేదికలోని ముఖ్యాంశాలు: 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ. 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల నుంచి 1.20 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం అని బీసీజే పేర్కొంది.  ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15 నుంచి 16 శాతం జనాభా వృద్ది చెందితే 2045 నాటికి అమరావతి నుంచి రూ. 8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందని తెలిపింది.

గ్రీన్‌ఫీల్డ్‌ సిటీల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకే న్యాయం జరుగుతుంది., సామాన్య ప్రజల జీవన ప్రమాణా పెరగవని బీసీజీ తెలిపింది. రష్యాలో ఇన్నోపోలీస్, ఈజిప్టులో న్యూ కైరో, సదత్, షేక్‌ జియాద్‌ సిటీ, పోర్చుగల్‌లో ప్లాన్‌ ఐటీ వ్యాలీ, ఆస్ట్రేలియాలో మొనార్టో, చైనాలో చెంగాంగ్, కాంగ్‌బసీ ఆర్డోస్, నానుహీ న్యూ సిటీ, లావాసా, లాంజోహు, యూఏఈలోని మస్డర్‌ మెగా సిటీల నిర్మాణాల్లో లక్ష్యాన్ని చేరుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని నివేదికలో వెల్లడించారు. 

1991లో నైజీరియాలో అబూజాను రాజధాని నగరంగా నిర్మించగా.. 20 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం 30 శాతమే చేరుకుని ఆరు లక్షల జనాభాతో ఆగిపోయింది. శ్రీలంక 1982లో శ్రీ జయవర్ధనెపుర కొట్టేలో రాజధాని నిర్మించగా.. 10 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం లక్ష జనాభా కూడా చేరలేకపోయింది. 1999లో మలేసియా రాజధానిగా పుత్రజయ నిర్మాణం చేపట్టగా 5 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం లక్ష జనాభాతోనే ఆగిపోయింది.  2007లో దక్షిణ కొరియాలో సెజాంగ్‌ సిటీ నిర్మాణం చేపట్టారు. 10 లక్షల జనాభా లక్ష్యానికి గాను ప్రస్తుతం 3 లక్షల జనాభా మాత్రమే ఉంది. 

ఒకే ప్రాంతంలో అభివృద్ధికి రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తే.. అందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల నుంచి 9 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఇది ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో 6–8 శాతం సమానంగా ఉంటుందని బీసీజే తెలిపింది.  అమరావతిపై భారీగా వ్యయం చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న విషయమని హెచ్చరించింది.

బోస్టన్ నివేదిక అధికార వికేంద్రీకరణే పరిష్కారం అని సూచించింది. రాష్ట్రంలో ఏ జిల్లాలు వెనుకబాటులో వున్నాయి.. అభివృద్ధిలో ఏ ప్రాంతాల మధ్య తారతమ్యాలు, వ్యత్యాసాలున్నాయనే వివరాలను బోస్టన్‌ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది.  రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడంతో పాటు అన్ని జిల్లాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించాలని సూచించింది. ఇందుకు ఉదాహరణగా జర్మనీలో రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడాన్ని బోస్టన్‌ నివేదిక ప్రస్తావించింది.

పరిపాలన వికేంద్రీకరణకు బోస్టన్‌ గ్రూపు రెండు ఆప్షన్లను ప్రభుత్వానికి సూచించింది. మొదటి ఆప్షన్‌లో విశాఖపట్నంలో సచివాలయం, గవర్నర్, సీఎం కార్యాలయాలు, కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం శాసనసభ, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని... అమరావతిలో అసెంబ్లీతో పాటు కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్‌... కర్నూలులో హైకోర్టు, అనుబంధ కోర్టులు, స్టేట్‌ కమిషన్లు ఉండాలని సూచించింది.

రెండో ఆప్షన్‌లో విశాఖపట్నంలో సచివాలయం, గవర్నర్, సీఎం కార్యాలయాలు, అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం శాసనసభ, హైకోర్టు బెంచ్‌... అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు, అనుబంధ కోర్టులు, స్టేట్‌ కమిషన్లు ఉండాలని అభిప్రాయపడింది. రెండో ఆప్షన్‌ ఉత్తమమని కమిటీ పేర్కొనడం విశేషం.  మొత్తం మీద సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు చెబుతున్నట్టుగానే బోస్టన్ నివేదికలోని అంశాలున్నాయి. ఈ నివేదికను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ పేర్కొన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle