newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

వాస్తవిక ఫలితాలకు అద్దం పట్టిన ‘న్యూస్ స్టింగ్’ ఆన్ లైన్ పోల్

29-05-201929-05-2019 12:54:09 IST
Updated On 26-06-2019 14:36:57 ISTUpdated On 26-06-20192019-05-29T07:24:09.699Z29-05-2019 2019-05-29T07:24:06.644Z - 2019-06-26T09:06:57.981Z - 26-06-2019

వాస్తవిక ఫలితాలకు అద్దం పట్టిన ‘న్యూస్ స్టింగ్’ ఆన్ లైన్ పోల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో జరిగిన ఎన్నికలపై న్యూస్ స్టింగ్ ఎన్నో వినూత్నమయిన, ఖచ్చితమయిన కథనాలను అందించింది. ఏపీలో వైసీపీకి అధికారం దక్కబోతోందని, టీడీపీకి షాక్ తప్పదని తన విశ్లేషణలతో రాజకీయంగా సంచలనం కలిగించింది. అలాగే ‘న్యూస్ స్టింగ్’ ఆన్ లైన్ పోల్ జర్నలిజం విలువల్ని పెంచింది. ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ అంటూ న్యూస్ స్టింగ్ ఒక ఆన్ లైన్ పోల్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రితో పాటు లోక్ సభ ఎన్నికలలో ప్రధానమంత్రిగా మీ ఛాయిస్ అంటూ కూడా ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. న్యూస్ స్టింగ్ చూసే వేలాదిమంది ఇందులో ఓటేశారు. ఒకసారి ఓటేసిన వ్యక్తి మరోమారు ఓటువేయకుండా అత్యాధునిక పద్థతిని న్యూస్ స్టింగ్ అనుసరించింది. 

ఏపీలో ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని , జగన్ కే పట్టం కట్టబోతున్నారని వెల్లడించింది. జగన్ తో పోలిస్తే ఈ పోల్ లో చంద్రబాబు బాగా వెనుకబడ్డారు. అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించిన ఈ ఆన్ లైన్ పోల్ లో మొత్తం 5378 మంది ఓటు వేయగా జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా 2290 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో చంద్రబాబుకి కేవలం 1665 ఓట్లు పోల్ అయ్యాయి. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా బాగానే ఓట్లు పడ్డాయి. చంద్రబాబుకి పోటీగా పవన్ కళ్యాణ్ కు 1,423 ఓట్లు పోలయ్యాయి. చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కి దగ్గర దగ్గరగా ఓట్లు పడ్డాయి. 

ఏపీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు లభించగా, టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం అయింది. 2014 ఎన్నికల అనంతరం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా 23 మందే ఉండడం కాకతాళీయం. ముగ్గురు ఎంపీలను (ఎస్పీ వై రెడ్డి, బుట్టా రేణుక, కొత్తపల్లి గీత) టీడీపీలోకి చేర్చుకున్నారు. 2019 ఎన్నికల అనంతరం 3 ఎంపీలే టీడీపీకి దక్కడంపై రాజకీయంగా చెణుకులు వినిపిస్తున్నాయి. మరోవైపు జనసేనకు కూడా 1-3 సీట్లు వస్తాయని సర్వేల్లో తేలింది. చివరకు రాజోలు సీటుతో పవన్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏపీ ఎన్నికల్లో గెలుపు ఓటములపై న్యూస్ స్టింగ్ కథనాలకు అనూహ్య స్పందన లభించింది. 

మరోవైపు పీఎం ఛాయిస్ అంటూ న్యూస్ స్టింగ్ నిర్వహించిన పోల్ లో మోడీ కంటే రాహుల్ కొంచెం బెటర్ అనిపించారు. రాహుల్ గాంధీకి 1727 ఓట్లు లభిస్తే,మోడీకి 1414 ఓట్లు వచ్చాయి. మొత్తం 3580 మంది ఓటేశారు.అలాగే మమత బెనర్జీకి 362 ఓట్లు, మాయావతికి 77 ఓట్లు వచ్చాయి. పోల్ ఫలితాలకు భిన్నంగా  వాస్తవిక ఫలితాలు లభించిన సంగతి తెలిసిందే. దక్షిణభారతదేశంలో బీజేపీ కర్నాటకలో తప్ప ఎక్కడా మెరుగైన ఫలితాలు రాలేదు. ఏపీ, తమిళనాడు, కేరళలో బీజేపీకి సున్నా ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో మాత్రం 4 సీట్లు దక్కాయి. 

మొత్తం మీద జనం నాడిని ఒడిసి పట్టడంలో న్యూస్ స్టింగ్.ఇన్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. అనతి కాలంలోనే న్యూస్ స్టింగ్.ఇన్ ని ఆదరిస్తున్న వీక్షక దేవుళ్ళకు శతకోటి ప్రణామాలు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle