newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

వాళ్ళు చేస్తే తప్పులేదు.. నేను చేస్తే తప్పా? మీడియాపై రోజా ఫైర్

04-08-202004-08-2020 13:32:06 IST
Updated On 04-08-2020 14:11:24 ISTUpdated On 04-08-20202020-08-04T08:02:06.993Z04-08-2020 2020-08-04T08:02:01.578Z - 2020-08-04T08:41:24.326Z - 04-08-2020

వాళ్ళు చేస్తే తప్పులేదు.. నేను చేస్తే తప్పా? మీడియాపై రోజా ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజాకు కోపం వచ్చింది. ఆమె జబర్దస్త్ షోలో వేసుకునే డ్రెస్సులపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ఆమె తన చేతిలో ఉన్న పేపర్‌ని విసిరికొట్టింది. ఇలాంటి ప్రశ్నలు ఎలా వేస్తారు? మీడియా అంటే తనకెంతో గౌరవం ఉంది.. కాని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయొద్దు’ అంటూ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కి లేని అభ్యంతరం మీకెందుకు?? ఒక వేళ జబర్దస్త్‌నా? రాజకీయమా అంటే?? నా ప్రయాణం రాజకీయాలవైపే అంటూ వివరణ ఇచ్చారు రోజా.

నాకు వేరే వ్యాపారాలు, ఆస్తులు లేవు. నాకు సినిమాలు, రాజకీయాలు రెండు కళ్లలాంటివి. నాకు నా ప్రొఫెషన్ వుంది. సినిమా ఆర్టిస్ట్‌గా ఉంచి ప్రజల అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చాను. గతంలో సీఎం అయిన ఎన్టీఆర్, ముఖ్యమంత్రి అయ్యాక కూడా  డాన్స్‌లు చేయలేదా?? అంతెందుకు బాలయ్య గారు ఈరోజుకీ సినిమాల్లో నటిస్తున్నారు.. డాన్స్‌లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసి ఆయనా డాన్స్‌లు చేస్తున్నారు. వాళ్లకో రూలు నాకో రూల్. ఏంటిది అంటూ ఒకరేంజ్ లో తన ప్రతాపం చూపించారు రోజా.

మగవాళ్ళు చేస్తే తప్పులేనప్పుడు ఆడవాళ్ళు చేస్తే తప్పేంటి? నేను ధైర్యంగా ఛాలెంజ్ చేస్తున్నా.. నేను ఏదైతే మోటివేషన్‌తో ముందుకు వచ్చానో నూటికి నూరు శాతం చేస్తున్నారు. గుడ్ విల్‌తో ముందుకు వెళ్తున్నాను. ప్రజలకు నేను బాధ్యురాలిని. వాళ్ళకు ఏం చేయాలో చేస్తున్నాను. జబర్దస్త్ లో నటించడం మా నాయకుడికి తెలుసు. నేను పూర్తిస్థాయి రాజకీయనాయకురాలిగా మారితే అవన్నీ వదిలేస్తా. 

జబర్దస్త్ వల్ల నాకు వుండే క్రేజ్ అలా కంటిన్యూ అవుతుందనే బాధతో మాట్లాడుతున్నారు.  అది హెల్తీ షో. సంతోషం.. నవ్వు అనేది ఎలాంటి వాడినైనా ఆరోగ్యంగా చేస్తుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇప్పటికీ జబర్దస్త్ చూసి చాలా మంది నాతో మాట్లాడుతూ ఉంటారు. మా కష్టాలన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుకుంటాం అంటారు. ఇవన్నీ నేను విన్నాను కాబట్టే.. ఈ తెలుగుదేశం వాళ్లు ఎన్ని ట్రోల్స్ చేసినా నేను పట్టించుకోను. ఎందుకంటే.. వీళ్లు ఉన్నది 10 శాతం మాత్రమే.. మిగిలిన 90 శాతం మంది నన్ను అభిమానించేవారే అన్నారు రోజా.

నేను మంచి డాన్సర్‌ ని.. నన్ను ఎంతో అభిమానిస్తారు కాబట్టి.. నేను డాన్స్ చేస్తా. అయినా రెండో సారి ఎమ్మెల్యే అయిన తరువాత లిమిట్ చేసి.. చైర్‌లోనే డాన్స్ చేస్తున్నాం తప్ప కిందికి దిగడం లేదు. వీళ్లతో అనవసరంగా అనిపించుకోవడం ఎందుకు అని నేను డాన్స్ కూడా తగ్గించేశా అంత మాత్రాన మీరు అలాంటి ప్రశ్నలు వేస్తారా అని ఆమె మండిపడ్డారు. ఇండస్ట్రీ, పాలిటిక్స్ రెండూ రెండు కళ్లు లాంటివి. ఏ ఒక్కటీ వదలుకోను. రాజకీయాల్లో ఖర్చుపెట్టడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల మళ్లీ యాక్ట్ చేయాల్సి వచ్చింది. నా మానసిక సంతృప్తి కోసం కూడా నేను యాక్ట్ చేయాల్సి వచ్చింది. పాలిటిక్స్‌లో ఉన్న ఒత్తిడి నుంచి కోలుకోవడానికి జబర్దస్త్ మళ్లీ చేశానన్నారు. 

జబర్దస్త్, బతుకుజట్కా బండి కూడా నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. మహిళగా, ఎమ్మెల్యేగా మహిళల సమస్యలపై స్పందించి కాపురాలను చక్కబెట్టడానికి ఆ షో ఉపయోగపడుతుంది. అయితే భవిష్యత్‌లో నువ్ ఫుల్ టైం పాలిటిక్స్‌లో ఉండాలి అంటే మాత్రం.. నేను చేసేది ఏం లేదు.. ఖచ్చితంగా రాజకీయాలకే ప్రిఫరెన్స్ ఇస్తా అన్నారు రోజా. రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న వేళ రోజా కామెంట్స్ పై విపరీతమయిన చర్చ సాగుతోంది. 

 

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

   14 minutes ago


దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

   2 hours ago


దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

   2 hours ago


తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

   2 hours ago


తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

   2 hours ago


అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

   2 hours ago


ఉపఎన్నిక నోటిఫికేషన్‌‌తో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌

ఉపఎన్నిక నోటిఫికేషన్‌‌తో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌

   3 hours ago


దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

   4 hours ago


మంచిదే కానీ.. సీఎం జగన్ హెచ్చరిక

మంచిదే కానీ.. సీఎం జగన్ హెచ్చరిక

   6 hours ago


స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మళ్లీ నంబర్‌ వన్‌.. హ్యాట్రిక్ రికార్డు

స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మళ్లీ నంబర్‌ వన్‌.. హ్యాట్రిక్ రికార్డు

   6 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle