newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

వారి కంటే ముందే క‌లుస్తారా..?

06-12-201906-12-2019 09:15:56 IST
Updated On 06-12-2019 17:39:21 ISTUpdated On 06-12-20192019-12-06T03:45:56.768Z06-12-2019 2019-12-06T03:45:55.269Z - 2019-12-06T12:09:21.685Z - 06-12-2019

వారి కంటే ముందే క‌లుస్తారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనేక రాజ‌కీయ ఊహాగానాల‌కు తావిస్తోంది. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న అనూహ్యంగా ఢిల్లీ వెళ్ల‌డం కొత్త స‌మీక‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతుందా అనే చ‌ర్చ మొద‌లైంది. ఓ వైపు చంద్ర‌బాబు నాయుడు, మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీకి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని ఉవ్విళ్లూరుతున్న స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను క‌ల‌వాల‌నుకోవ‌డం వెనుక రాజ‌కీయ కార‌ణాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలుపున‌కు, త‌మ ఓట‌మికి బీజేపీకి దూరం కావ‌డ‌మే కార‌ణ‌మ‌ని చంద్ర‌బాబు నాయుడు మ‌థ‌న‌ప‌డుతున్నారు. మ‌ళ్లీ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ మేర‌కు బీజేపీలో త‌న‌కున్న ప‌రిచ‌యాల‌ను, ప‌లువురు ఆరెస్సెస్ ముఖ్యుల‌ను ఉప‌యోగించుకొని రాయ‌బారాలు జ‌రుపుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకే చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు, మోడీకి విభేదాలు లేవ‌ని ప‌దేప‌దే చెబుతున్నారు.

మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా క‌మ్యూనిస్టు మిత్రుల‌కు చేయిచ్చి కాషాయ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న మూడు రోజుల పాటు సీక్రెట్‌గా ఢిల్లీ వెళ్లి వ‌చ్చారు. అక్క‌డ ఎవ‌రిని క‌లిసిందీ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. ఢిల్లీ నుంచి వ‌చ్చాక ప‌వ‌న్ మాట తీరు మారింది. మోడీ, అమిత్ షాను ఆయ‌న కీర్త‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. దేశానికి వారే స‌రైన వార‌ని కితాబిస్తున్నారు. వారి పేర్లు చెప్పి వైసీపీకి వార్నింగ్‌లు ఇస్తున్నారు.

రాష్ట్రంలో జ‌గ‌న్‌ను ఎదుర్కోవాలంటే బీజేపీ స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నిస్తున్నారు. బీజేపీ త‌ల‌పులు తెరిస్తే వెంట‌నే బీజేపీతో చేతులు క‌లిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీ బాట ప‌ట్టారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న కూడా అనూహ్యంగా ఖ‌రారైంది. ప్ర‌ధాని మోడీ, అమిత్ షాను జ‌గ‌న్ క‌ల‌వ‌నున్నారు. అమ్మ ఒడి ప‌థ‌కం, క‌డ‌ప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్స‌వానికి ప్ర‌ధానిని ఆహ్వానించేందుకు జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కానీ, జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వెనుక రాజ‌కీయ కార‌ణాలు కూడా ఉండ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇందులో నుంచి గ‌ట్టెక్కించి సంక్షేమాన్ని, అభివృద్ధిని గాడిన పెట్టాలంటే కేంద్రం స‌హ‌కారం చాలా అవ‌స‌రం. కేంద్రంలో స‌ఖ్య‌త‌గా ఉండాల‌నే జ‌గ‌న్ ముందు నుంచీ భావిస్తున్నారు. ఈ మ‌ధ్య బీజేపీకి - జ‌గ‌న్‌కు దూరం పెరిగింద‌నే ప్ర‌చారం ఉంది. వీరి మ‌ధ్య దూరం పెర‌గాల‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌మ సంబంధాల‌ను మెరుగుప‌రుచుకునేందుకు జ‌గ‌న్ ఈ ప‌ర్య‌ట‌న‌ను ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంది. అయితే, ఎన్‌డీఏ నుంచి శివ‌సేన బ‌య‌ట‌కు వ‌చ్చినందున వైసీపీని ఎన్‌డీఏలోకి ఆహ్వానించే అవ‌కాశాలు కూడా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే జ‌రిగితే వైసీపీకి కేంద్ర మంత్రివ‌ర్గంలో స్థానం ద‌క్క‌డంతో పాటు రాష్ట్రానికి కూడా కేంద్రం స‌హ‌కారం మెరుగ‌వుతుంది. రాజ‌కీయంగా త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు బీజేపీ బ‌లం తోడుకాకుండా జ‌గ‌న్ అడ్డుకునే అవ‌కాశం ఉంటుంది. ఈ విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle