newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

వారి ఏకైక కోరిక అదేనంట‌..?

04-05-201904-05-2019 13:14:42 IST
2019-05-04T07:44:42.177Z04-05-2019 2019-05-04T07:44:36.424Z - - 26-06-2019

వారి ఏకైక కోరిక అదేనంట‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మ‌రో పార్టీలోకి వెళ్లడం ఇప్పుడు రాజ‌కీయాల్లో స‌ర్వసాధార‌ణమైంది. ఇందుకు ఏ పార్టీలూ అతీతం కావు. విలువ‌లు అనే ప‌దానికి ఇక్కడ అస‌లే చోటుండ‌దు. అధికార పార్టీలో చేరిపోవాల‌ని విప‌క్ష పార్టీ నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులు త‌హ‌త‌హ‌లాడుతుంటారు. వీరికి ఎలాగూ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాము అనే కామ‌న్ డైలాగ్ ఉండేనే ఉంది. ఇలా గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి పార్టీ మారిన వారు త‌మ రాజ‌కీయ జీవితాన్నే అంధ‌కారంలోకి నెట్టేసుకున్నారు.

2014 ఎన్నిక‌ల్లో గెలిచిన నెల లోపే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపు రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. త‌న పార్టీని ఎదురులేని శ‌క్తిగా చేసుకోవ‌డం, ప్రత్యర్థి పార్టీని ఆదిలోనే పూర్తిగా దెబ్బతీయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ఈ కార్యక్రమానికి ఘ‌నంగా శ్రీకారం చుట్టారు. ప్రమాణ‌స్వీకారం కూడా చేయ‌క‌ముందే పార్టీ మారిన నంద్యాల ఎంపీ మొద‌లు ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఒక్క అరకు ఎంపీ మిన‌హా మిగ‌తా వారంతా తెలుగుదేశం పార్టీలో లాంఛ‌నంగా చేరిపోయారు.

వీరిలో న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు కూడా ద‌క్కాయి. అయితే, ఇలా ఫిరాయించిన నేత‌ల్లో కొంద‌రికి ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. చివ‌రి నిమిషం వ‌ర‌కు తాత్సారం చేసి వారికి టిక్కెట్లు ఇవ్వలేదు. దీంతో వారి రాజ‌కీయ భ‌విష్యత్ ప్రమాదంలో ప‌డింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా క‌నీసం టిక్కెట్ కూడా ద‌క్కించుకోలేక‌పోవ‌డం అంటే వారి రాజ‌కీయ జీవితానికి ఇంచుమించు స‌మాధి క‌ట్టేసిన‌ట్లే.

ముందు పార్టీ మారిన ఎస్పీవై రెడ్డికి టిక్కెట్ రాకున్నా కొంత ముందుచూపుతో ఆయ‌న జ‌న‌సేనలోకి వెళ్లి చివ‌రి నిమిషంలో త‌న కుటుంబానికి ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకొని పోటీ చేశారు. పార్టీకి అక్కడ పెద్దగా బ‌లం లేక‌పోవ‌డంతో వీరి గెలుపు క‌ష్టమే అన్న అంచ‌నాలు ఉన్నాయి. ఇక‌, ప‌లువురు టిక్కెట్ ద‌క్కని ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోటీకి దూరంగా ఉండి సైలెంట్ అయిపోయారు. మ‌రికొంద‌రు మంచోచెడో టీడీపీలో చేరాము క‌దా అనే ఉద్దేశ్యంతో మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే ఏదైనా ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే కోరిక‌తో టీడీపీ అభ్యర్థుల‌కు మ‌ద్దతుగా ప్రచారం చేశారు.

ఇక‌, టిక్కెట్లు ద‌క్కక‌పోవ‌డంతో తాము చేసిన త‌ప్పు గుర్తొచ్చిన కొంద‌రు నేత‌లు మాత్రం త‌ప్పును స‌రిదిద్దుకుంటామ‌ని చివ‌ర‌కు మ‌ళ్లీ వైసీపీలోనే చేరిపోయారు. క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక‌, ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పరుపుల సుబ్బారావు, య‌ర్రగొండ‌పాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు వైసీపీలో చేరారు. వీరు వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం బాగానే క‌ష్టప‌డ్డారు. జగన్ దృష్టిలో పడ్డారు. 

ఇప్పుడు వీరి నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్యర్థులు క‌చ్చితంగా గెల‌వాల‌ని వీరు బ‌లంగా కోరుకుంటున్నారు. అలా గెలిస్తే త‌మ‌కు కొంతైనా గుర్తింపు ఉంటుంద‌ని, వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఏదో ఓ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని, మ‌ళ్లీ రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చని భావిస్తున్నారు. మ‌రి, వీరి కోరిక మేర‌కు జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తారో, వ‌చ్చినా వీరి త‌ప్పును క్షమించి మ‌ళ్లీ వీళ్లకు అవకాశం ఇస్తారేమో చూడాలి. మొత్తంగా వీరు తాత్కాలిక ప్రయోజ‌నాల‌కు ఆశ‌ప‌డి రాజ‌కీయ జీవితాన్నే పాడు చేసుకున్నారు. మ‌రి, వీరి భ‌విష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle