newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

వారిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆప‌లేరా..?

05-10-201905-10-2019 07:45:57 IST
Updated On 05-10-2019 15:30:08 ISTUpdated On 05-10-20192019-10-05T02:15:57.146Z05-10-2019 2019-10-05T02:15:54.632Z - 2019-10-05T10:00:08.039Z - 05-10-2019

వారిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆప‌లేరా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు గ‌త ఎన్నిక‌ల  ఓట‌మి అనేక గుణ‌పాఠాల‌ను నేర్పి ఉంటుంది. ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెంత‌కు చేరిన నేత‌లంతా ఇప్పుడు వ‌రుస‌బెట్టి గుడ్‌బై చెబుతున్నారు.

ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి అని చెప్పిన వారే ఇప్పుడు క‌నీసం ఆయ‌న‌కు కూడా చెప్ప‌కుండా పార్టీ మారిపోతున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ డోర్లు బార్లా తెరిచిపెట్ట‌డంతో కాషాయ కండువా క‌ప్పేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

2014లో పార్టీని స్థాపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంస్థాగ‌తంగా మాత్రం బ‌లోపేతం చేసుకోలేక‌పోయారు. పూర్తి స్థాయిలో త‌న స‌మ‌యాన్ని రాజ‌కీయాల‌పై పెట్ట‌క‌పోవ‌డం, పార్టీ అభిమానుల నుంచి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

అయితే, ఎన్నిక‌ల ముందు మాత్రం జ‌న‌సేన పార్టీకి కొంత హైప్ వ‌చ్చింది. వైసీపీ, టీడీపీలో టిక్కెట్లు ద‌క్క‌ని వారు, ఆ రెండు పార్టీల్లో అవ‌కాశం లేని వారు జ‌న‌సేన వైపు చాలా మంది వ‌చ్చారు.

కొత్త నాయ‌క‌త్వాన్ని త‌యారుచేస్తాన‌ని, యువ నాయ‌క‌త్వాన్నిప్రోత్స‌హిస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ విష‌యంలో మాత్రం త‌ను అనుకుంది చేయ‌లేక‌పోయారు. చాలా చోట్ల ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారిని న‌మ్మి టిక్కెట్లు ఇచ్చారు.

అయితే, ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా స్వ‌యంగా ఓడిపోవ‌డం, ఓటమి త‌ర్వాత కూడా ప‌వ‌న్ పూర్తి స్థాయి రాజ‌కీయాలు చేయ‌లేక‌పోతుండ‌టంతో ఎన్నిక‌ల ముందు చేరిన నేత‌లంతా ఎవ‌రి దారి వారు వెతుక్కుంటున్నారు.

టీడీపీలో మంత్రిగా ప‌నిచేసి ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన‌లో చేరిన రావెల కిషోర్ బాబు పార్టీ ఓడిపోగానే వెళ్లి బీజేపీలో చేరిపోయారు. ఎన్నిక‌ల ముందు ఆయ‌న పార్టీలో కీల‌క నేత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు.

ఇక‌, తాజాగా పార్టీ అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి చింత పార్థ‌సార‌థి కూడా జన‌సేన‌కు గుడ్‌బై చెప్పారు. బీజేపీలో మంత్రిగా ప‌నిచేసి ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన‌లో చేరి రాజ‌మండ్రి నుంచి పోటీ చేసిన ఆకుల స‌త్య‌నారాయ‌ణ కూడా జ‌న‌సేన‌ను వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

వీరితో పాటు ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ప‌లువురు అభ్య‌ర్థులు పార్టీ మారారు. మ‌రికొంద‌రు స‌మ‌యంలో కోసం వేచి చూస్తున్నారు. ఇంకొంద‌రు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

అయితే, ఇలా పార్టీ మారే వారిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నీసం ఆపేందుకు బుజ్జ‌గించిన దాఖ‌లాలు కూడా లేవు. మ‌రి, పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు, నేత‌ల వ‌ల‌స‌ల‌ను నివ‌రించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎటువంటి ఆలోచ‌న‌ల‌తో ఉన్నారో రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు కూడా అంతుచిక్క‌డం లేదు.

 

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   10 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle