newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

వారికి త‌ల‌నొప్పులు తెస్తున్న జ‌గ‌న్‌..

24-09-201924-09-2019 16:30:21 IST
Updated On 25-09-2019 12:29:29 ISTUpdated On 25-09-20192019-09-24T11:00:21.063Z24-09-2019 2019-09-24T11:00:10.346Z - 2019-09-25T06:59:29.455Z - 25-09-2019

వారికి త‌ల‌నొప్పులు తెస్తున్న జ‌గ‌న్‌..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అధికారంలోకి వ‌చ్చాక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప‌క్క రాష్ట్రాల్లో ర‌చ్చకు దారి తీస్తున్నాయి. పాద‌యాత్ర‌లో భాగంగా రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌ను వివిధ వ‌ర్గాల వారు క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. వీటిన్నింటికి తాను అధికారంలోకి రాగానే ప‌రిష్క‌రించేస్తా అనేది ఏకైక జ‌వాబు చెబుతూ జ‌గ‌న్ ముందుకు సాగారు.

ఇలా పాద‌యాత్ర స‌మ‌యంలో ఆయా వ‌ర్గాల వారికి ఇచ్చిన మాట‌ను ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్ హామీలుగా మ‌లిచారు. తాను అధికారంలోకి రాగానే ఈ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పారు. అధికారంలోకి వ‌చ్చాక ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అన్ని హామీల‌ను ఆరు నెల‌ల్లో పూర్తి చేసి మంచి ముఖ్య‌మంత్రి అనిపించుకోవాల‌ని ఆయ‌న తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు.

ఈ మేర‌కు జ‌గ‌న్ అన‌క క‌ఠిన‌, కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణ‌యాలు ప‌క్క రాష్ట్రాల్లో ర‌చ్చ‌కు దారి తీస్తున్నాయి. మంత్రివ‌ర్గ కూర్చు స‌మ‌యంలో అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ ఐదుగురు డిప్యూటీ సీఎంల‌ను జ‌గ‌న్ నియ‌మించారు. దీంతో ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో య‌డియూర‌ప్ప ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేసే స‌మ‌యంలో అక్క‌డ కూడా జ‌గ‌న్‌లా ఐదుగురికి డిప్యూటీ సీఎం ప‌ద‌వులు ఇవ్వాల‌నే డిమాండ్లు వ‌చ్చాయి. చివ‌ర‌కు య‌డియూర‌ప్ప కూడా జ‌గ‌న్ బాట‌లో ముగ్గురికి అవ‌కాశం క‌ల్పించారు.

త‌ర్వాత ప్రైవేటు సంస్థ‌ల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ఇచ్చేలా జ‌గ‌న్ అసెంబ్లీలో ఒక చ‌ట్టం చేశారు. ఇంత‌కుముందు ఇటువంటి డిమాండ్లు, హామీలు ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఇచ్చినా జ‌గ‌న్ మాత్రం చ‌ట్టం చేయ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని కొంద‌రు స‌మ‌ర్థించ‌గా, మ‌రికొంద‌రు వ్య‌తిరేకించారు. ఇప్పుడు ఇదే డిమాండ్‌ను క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాల్లో అక్క‌డి కొన్ని పార్టీలు చేస్తున్నాయి. వారి రాష్ట్రాల్లోనూ ఇటువంటి చ‌ట్టం చేయాల‌ని కోరుతున్నాయి.

తాజాగా, న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీలో ప‌నిచేసే కార్మికుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకోవ‌డం కూడా ప‌క్క రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఈ డిమాండ్‌ను ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా చేస్తున్నా ప్ర‌భుత్వానికి భారం అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పాడి ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. వీరి డిమాండ్ల‌లో ప్ర‌ధాన‌మైంది ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని.

క‌ర్ణాట‌క‌లోనూ అక్క‌డి ఆర్టీసీ కార్మికులు ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం మ‌న వ‌ద్ద ఎందుకు తీసుకోర‌ని వారు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి అక్క‌డి ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం కూడా చేశారు. మొత్తానికి జ‌గ‌న్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప‌క్క రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు త‌ల‌నొప్పిగా మారుతున్న‌ట్లే క‌నిపిస్తోంది.

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   8 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle