newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

వారసులంతా ఓటమి పాలు.. చంద్రబాబు తప్పుచేశారా?

24-05-201924-05-2019 07:57:35 IST
Updated On 26-06-2019 16:54:28 ISTUpdated On 26-06-20192019-05-24T02:27:35.130Z24-05-2019 2019-05-24T02:27:28.342Z - 2019-06-26T11:24:28.918Z - 26-06-2019

వారసులంతా ఓటమి పాలు.. చంద్రబాబు తప్పుచేశారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు ఉన్న‌ట్లు తెలుగుదేశం పార్టీ దారుణ ఓట‌మికి కూడా అనేక కార‌ణాలు ఉన్నాయి. వీటిల్లో ముఖ్య‌మైన‌ది వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు పెద్ద పీట వేయ‌డం. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి చంద్ర‌బాబు నాయుడు నేత‌ల వార‌సుల‌కు టిక్కెట్లు ఇచ్చారు. త‌న కుమారుడు నారా లోకేష్ స‌హా అనేక మంది సీనియ‌ర్ నేత‌ల వార‌సుల‌కు టిక్కెట్లు క‌ట్ట‌బెట్టారు. వీరంతా దారుణంగా ఓట‌మి పాల‌య్యారు.

అనేక ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ నియోజ‌క‌వ‌ర్గాలను ఏలిన ప‌లువురు టీడీపీ ముఖ్య నేత‌లు ఈసారి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. వారి స్థానాల్లో వారి పిల్ల‌ల‌కు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. త‌మ పిల్ల‌ల‌ను గెలుపించుకునేందుకు శ‌క్తియుక్తుల‌న్నీ ఒడ్డారు. అయినా వారికి ఎదురుదెబ్బ త‌గిలింది.

ఏళ్లుగా తండ్రుల‌ను గెలిపిస్తున్నాం... ఇప్పుడు పిల్ల‌ల‌ను గెలిపించాలా..? అనే భావ‌న ప్ర‌జ‌ల్లో బ‌లంగా క‌నిపించింది. ఈసారి వార‌సుల‌కు కాకుండా కొత్త వారికి అవ‌కాశం ఇద్దామ‌నే భావ‌న‌తో వార‌సులంతా ఓట‌మి పాల‌య్యారు. ఇందుకు మంచి ఉదాహ‌ర‌ణ అనంత‌పురం జిల్లాలోని రాప్తాడు, తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గాలు. రాప్తాడులో ప‌రిటాల సునీత గ‌త ఎన్నికలలో రెండుసార్లూ విజ‌యం సాధించారు.

https://www.photojoiner.net/image/6q3xDdIC

ఈసారి రాప్తాడులో ప‌రిటాల శ్రీరామ్ టీడీపీ నుంచి బ‌రిలో దిగారు. ఆయ‌న‌పై వైసీపీ అభ్య‌ర్థి తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి 25 వేల‌కు పైగా భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ప‌రిటాల సునీత‌పై ప్ర‌కాష్ రెడ్డి రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి ఉంది. దీంతో ఇన్నేళ్లు ప‌రిటాల ర‌వి, సునీత‌కు ఓట్లేశాము క‌దా ఈసారి ప్ర‌కాష్ రెడ్డికి అవ‌కాశం ఇద్దామ‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో రావ‌డంతో ప్ర‌కాష్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు.

ఇదే ప‌రిస్థితి టీడీపీ వార‌సులు పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఉంది. మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ మొద‌లు వార‌సులంతా ఓడిపోయారు. తాడిప‌త్రిలో జేసీ అస్మిత్ రెడ్డి, ప‌లాస‌లో గౌరు శిరీష‌, విజ‌య‌న‌గ‌రంలో అదితి గ‌జ‌ప‌తిరాజు, అర‌కులో కిడారి శ్రావ‌ణ్‌, పెడ‌న‌లో కాగిత కృష్ణ‌ప్ర‌సాద్‌, విజ‌య‌వాడ వెస్ట్ లో ష‌బానా ఖాతూన్, గుడావాడ‌లో దేవినేని అవినాష్‌, న‌గ‌రిలో గాలి భానుప్ర‌కాష్ రెడ్డి, శ్రీకాళ‌హ‌స్తిలో బొజ్జ‌ల సుధీర్ రెడ్డి, క‌ర్నూలులో టీజీ భ‌ర‌త్‌, ప‌త్తికొండ‌లో కెఇ శ్యాంబాబు ఓట‌మి పాల‌య్యారు.

లోక్ స‌భ బ‌రిలో దిగిన తెలుగుదేశం నేత‌ల వార‌సులు సైతం ఈసారి ఓడిపోయారు. అనంత‌పురంలో జేసీ దివాక‌ర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, రాజ‌మండ్రిలో ముర‌ళీమోహ‌న్ కోడ‌లు మాగంటి రూప‌, విశాఖ‌ప‌ట్నంలో బాల‌కృష్ణ అల్లుడు భ‌ర‌త్ ఓట‌మి పాల‌య్యారు. ఈ స్థానాల్లో ఈసారి వార‌సులను నిల‌బెట్ట‌కుండా మ‌ళ్లీ వారే నిల‌బడి ఉంటే గెలుపు అవ‌కాశాలు కొంత మెరుగ్గా ఉండేవి. పైగా వైసీపీ హ‌వాను అంచ‌నా వేయ‌లేక ఈసారే వార‌సుల‌ను తెర‌పైకి తెచ్చి వారికి మొద‌టి ఓట‌మి రుచి చూపించారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle