newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

వారంలో లిస్ట్.. టార్గెట్ 140/25 !

21-02-201921-02-2019 13:09:44 IST
Updated On 22-02-2019 18:56:47 ISTUpdated On 22-02-20192019-02-21T07:39:44.843Z21-02-2019 2019-02-21T07:37:58.719Z - 2019-02-22T13:26:47.341Z - 22-02-2019

వారంలో లిస్ట్.. టార్గెట్ 140/25 !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నిక‌ల‌కు త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా పార్టీల‌న్నీ వ్యూహ‌లు ప‌న్నుతున్నాయి.  ఎన్నిక‌ల‌ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే జాబితా విడుదలకు ఇటు టీడీపీ, అటు వైసీపీ సిద్ధం అవుతున్నాయి. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీ, లోక్‌సభకు పోటీచేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల జాబితా తయారీలో తలమునకలై వున్నారు. వారంలో తొలిజాబితా విడుదల చేయాలని ఆయన భావిస్తు్న్నారు. గెలుపు గుర్రాల‌కు టికెట్లు ఇవ్వాల‌నే నిర్ణయానికి వ‌చ్చిన పార్టీలు, వివిధ స‌ర్వేలు నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నాయి.

నాలుగైదు సర్వేలు నిర్వహించిన టీడీపీ అధిష్టానం మెజార్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రికి టికెట్లు ఇవ్వాల‌నే దానిపై ఒక అవగాహనకు వచ్చింది. ఈ వారం చివరిలోగా జాబితా విడుదల కావచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ నియోజక వర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికే మెజార్టీ అభ్యర్థుల ఎంపికను పూర్తిచేయనున్నారు. కొన్ని లోక్‌సభ స్థానాలతోపాటు, ప్రతి జిల్లాలోనూ ఆరేడు శాసనసభ స్థానాల అభ్యర్థులపై ఆయనకు ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. 

ఐవీఆర్‌ఎస్‌ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, వివిధ సర్వేల ఫలితాలు, స్థానిక పరిస్థితులు, రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుని ఆయన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రోజూ రెండు లోక్‌సభ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు చంద్రబాబు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబు ఆయా జిల్లాల పార్టీ ముఖ్యనేతలు, లోక్ సభ సిట్టింగ్ ఎంపీలతో భేటీ అవుతున్నారు.

100 అసెంబ్లీ, 15 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి లిస్ట్ రెడీ అయిపోయింది. మొదటి దశలో రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, విజయనగరం, గుంటూరు జిల్లాలపై ఫోకస్ పూర్తయింది. వైసీపీలోకి వెళ్ళిన అనకాపల్లి, అమలాపురం నియోజకవర్గాలపై చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. అక్కడ ఎలాగైనా వారిని ఓడించాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. చీరాలపై గెలుపును ప్రతిష్టగా తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీలోకి రావడానికి సిద్ధమయిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబానికి రెండుమూడు అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబునాయుడు. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కొడుకు రంగారావుతో పాటు సాంబశివరావు సోదరుడు శ్రీనివాసరావు టికెట్ కోరుతున్నారు. ఎమ్మెల్యే కాదంటే ఎమ్మెల్సీ టికెట్లు వారు ఆశిస్తున్నారు. టీజీ వెంకటేష్ కూడా తన కొడుకు కోసం ఒక అసెంబ్లీ టికెట్ కోరారు. మొత్తం మీద ఈ నెలాఖరునాటికి లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి, మార్చి 1వ తేదీనాటికి జాబితా విడుదల చేయనున్నారు. ఈ జాబితాలో తమకు సీటు దక్కుతుందో లేదోనని నేతలు టెన్షన్ పడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   4 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   4 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   9 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   9 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   11 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   12 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   12 hours ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   13 hours ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   13 hours ago


ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle