newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

వారంతా ఏమైనట్టు..?వారి జాడ ఎక్కడ?

10-10-201910-10-2019 08:34:00 IST
2019-10-10T03:04:00.271Z10-10-2019 2019-10-10T03:03:40.942Z - - 14-08-2020

వారంతా ఏమైనట్టు..?వారి జాడ ఎక్కడ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లో లేనంత ఘోర ఓట‌మి ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆ పార్టీ చ‌విచూసింది. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌వాలో కేవ‌లం 23 స్థానాల‌తో టీడీపీ స‌రిపెట్టుకుంది.

ఆ ఫ‌లితాలు చూశాక తెలుగుదేశం పార్టీ ఇంకా కోలుకోవ‌డం క‌ష్ట‌మే అనే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టికీ కొంద‌రు టీడీపీ భ‌విష్య‌త్‌పై న‌మ్మ‌కం లేక ఇత‌ర పార్టీల్లోకి వెళ్లేందుకు దారులు వెతుకుతున్నారు. అయితే, ఊహించ‌ని విధంగా ఓట‌మి నుంచి త్వ‌ర‌గానే తేరుకుంది తెలుగుదేశం పార్టీ.

కొత్త ప్ర‌భుత్వంపై నెల రోజుల‌కే చంద్ర‌బాబు నాయుడు యుద్ధాన్ని ప్ర‌క‌టించారు. క‌నీసం వారంలో రెండుమూడు సార్లు మీడియా ముందుకి వ‌చ్చో, ట్విట్ట‌ర్ ద్వారానో, పార్టీ స‌మావేశాల ద్వారానో ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఆయ‌న త‌న‌యుడు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అయితే ప్ర‌తిరోజూ ట్విట్ట‌ర్‌లో వైసీపీ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు.

కొత్త‌గా ఏర్ప‌డిన ప్ర‌భుత్వానికి క‌నీసం స‌మ‌యం ఇవ్వ‌కుండా అప్పుడే విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని కొంద‌రు త‌ప్పుప‌డుతున్నా.. పార్టీని ప్ర‌జ‌ల్లో ఉంచేందుకు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇవి దోహ‌ద‌ప‌డుతున్నాయి.

ఈ విష‌యంలో చంద్ర‌బాబు, నారా లోకేశ్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నా గ‌త ప్ర‌భుత్వంలో మంత్రులుగా ప‌నిచేసిన 80 శాతం మంది మాత్రం నోరు విప్ప‌డం లేదు. త‌మ అధినేత‌, భావి నేత‌తో గొంతు క‌ల‌ప‌డం లేదు.

అచ్చెన్నాయుడు, అయ్య‌న్న‌పాత్రుడు, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, దేవినేని ఉమ‌ అప్పుడ‌ప్పుడు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నా మిగ‌తా వారు మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

చంద్ర‌బాబు క్యాబినెట్‌లో ప‌ని చేసి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మంత్రుల పేర్లు వెతికినా ఎక్క‌డా మీడియాలో క‌నిపించ‌డం లేదు. ఇక‌, గ‌త క్యాబినెట్‌లో ప‌నిచేసి గెలిచిన గంటా శ్రీనివాస‌రావు, నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప అడ‌పాద‌డ‌పా క‌నిపిస్తున్నా ప్ర‌భుత్వంపై పెద్ద‌గా మాట్లాడ‌టం లేదు.

రాయ‌ల‌సీమ ప్రాంతం నుంచి మంత్రులుగా ప‌నిచేసిన కాల్వ శ్రీనివాసులు, అమ‌ర్‌నాథ్‌రెడ్డి, కేఈ కృష్ణ‌మూర్తి అయితే పూర్తిగా క‌నిపించ‌కుండా పోయారు. అఖిల‌ప్రియ మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో అందుబాటులో ఉంటున్నారు.

ఆదినారాయ‌ణ‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో కూడా ఎవ‌రికి తెలియ‌కుండా పోయింది. గ‌త ఐదేళ్లు జ‌గ‌న్ పేరు వినప‌డితే ఒంటి కాలితో లేచిన వీరు ఇప్పుడు ప‌ద‌వులు పోగానే సైలెంట్ అవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓట‌మి భారంతో క‌నిపించ‌డం లేదా, లేక‌పోతే ఇప్పుడే కొత్త ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం స‌రికాద‌నే ఉద్దేశ్యంతో ఉన్నారో వారే క్లారిటీ ఇవ్వాలి.

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   an hour ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   an hour ago


అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

   an hour ago


ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

   2 hours ago


కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

   2 hours ago


కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

   3 hours ago


వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   16 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   17 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   17 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   21 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle