newssting
BITING NEWS :
*ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం *ఏపీలో మరో ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్.. తెలంగాణలో ప్రభుత్వ విప్ సునీతకు కరోనా పాజిటివ్ నిర్దారణ *గోల్కొండ, చార్మినార్ సందర్శనకు అనుమతి *అమరావతి ఉద్యమానికి 200 రోజులు... కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే నిరసనలు తెలపాలని పిలుపు. ఊరిలో 10 మంది చొప్పున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చిన అమరావతి జేఏసీ. *హైదరాబాద్: పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ నేడు కాంగ్రెస్ ఆందోళనలు. తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్న కాంగ్రెస్*తెలంగాణలో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1892 పాజిటివ్ కేసులు న‌మోదు, ఎనిమిది మంది మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,658 కొత్త క‌రోనా కేసులు*ఏపీ: మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర అరెస్ట్.. తుని మండలం సీతారాంపురం ద‌గ్గ‌ర కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు*ఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా జేఈఈ, నీట్ వాయిదా.. జేఈఈ మెయిన్ ప‌రీక్ష‌లు సెప్టెంబర్ 1 నుంచి 6 వ తేదీ మధ్య, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ సెప్టెంబర్ 27న.. నీట్ సెప్టెంబర్ 13న నిర్వ‌హ‌ణ*ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో కంపించిన భూమి... రిక్ట‌ర్ స్కేల్‌పై తీవ్ర‌త 4.5గా న‌మోదు*ఢిల్లీ: లోకసభ స్పీకర్‌ను క‌లిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై ఫిర్యాదు*భారత ప్రధాని మోడీ లఢఖ్ పర్యటన గురించిన సమాచారం మాకు ముందే తెలుసని చైనా విదేశాంగ శాఖ ప్రకటన*ఏపీలో కొత్తగా 837 కరోనా కేసులు నమోదు. 9 మరణాలు. ఏపీలో 16,934కి చేరిన కరోనా కేసులు. ఇప్పటి వరకు 206కరోనా మరణాలు*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 6,44,404...మరణాలు 18597

వామ్మో వసంత బూతుపురాణం.. దేవినేని ఉమా టార్గెట్

25-02-202025-02-2020 15:13:23 IST
2020-02-25T09:43:23.607Z25-02-2020 2020-02-25T09:43:18.477Z - - 04-07-2020

వామ్మో వసంత బూతుపురాణం.. దేవినేని ఉమా టార్గెట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో తిట్ల పర్వం ఎక్కువ అవుతోంది. సాక్షాత్తూ మంత్రులే తమ నోటికి పని చెబుతున్నారు. కొడాలి నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ.. వంటివారు తమ మాటల దాడి కొనసాగిస్తూనే వున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు మాజీ మంత్రి దేవినేని ఉమాపై తీవ్ర విమర్శలతో సంచలనం రేపారు.

‘‘ఉమామహేశ్వర నీ సొంత తమ్ముడు వెంకటరమణ నీ ఇంటికి రాడు.. దేవినేని వెంకటరమణ కూతుళ్లు కూడా ఇంటికి రారు. నిన్ను ఏ శుభకార్యానికి పిలవాలన్నా భయం, తెల్ల బట్టలు వేసుకున్న ఓర్వలేని వాడివి నువ్వు ఒక లేబర్‌వి..నిన్ను ఓడించడం కృష్ణ ప్రసాద్‌ని గెలిపించడంతో నా చిరకాలకోరిక నెరవేరింది. నేను టీడీపీ నుంచి బయటకు రావడంతో నీకు అవకాశం వచ్చింది.

మీ అన్న, మీ నాన్న ఏం చేశారో చెబుతా.. అది చెబితే జనం నీమీద ఉమ్మేస్తారన్నారు. ఇసుక మీద నీవు ఎంత సంపాదించావో నాకు తెలుసు. జగన్ ప్రభుత్వం ఇసుకతో నిర్మించింది కాదు. ఉక్కుతో నిర్మించిందన్నారు. నీవేం పోరాటాలు చేశావు. మా ఆస్తి చెబుతా.. నీవు చెప్పగలవా? దేవినేని కుటుంబం నిన్ను వెలివేసింది’’ అంటూ విరుచుకుపడ్డారు వసంత నాగేశ్వరరావు.

ఎన్నికల ముందు నుంచి దేవినేని ఉమా, వసంత నాగేశ్వరరావు కుటుంబాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. ‘‘వసంత నాగేశ్వరావు లంచం తీసుకున్నాడు అని అంటున్నావ్ దానిని రుజువు చెయ్యి, రుజువు చేస్తే  నేను కరెంటు తీగ పట్టుకుంటా ....కృష్ణ ప్రసాద్ ఎప్పుడో చెప్పాడు రాజధాని ఇక్కడే ఇష్టమని, కానీ పార్టీ విధానమే నా విధానం అన్నాడు. నీవు ఇరిగేషన్ శాఖలో ఎంతో  తిన్నావో, నీవు జైలుకు వెళ్లడం ఖాయం’’ అన్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా వుండే వసంత నాగేశ్వరరావు నోటివెంట ఈ పురాణం విని అంతా అవాక్కవుతున్నారు. ఇవేం రాజకీయాలంటూ జనం నోరెళ్ళబెడుతున్నారు. 

బందరులో ఇంకో అలజడి... మరో హత్యాయత్నం, దాడి

బందరులో ఇంకో అలజడి... మరో హత్యాయత్నం, దాడి

   an hour ago


‘‘జనం ఆశలు గల్లంతు.. జగన్ ఉండేది ఇంకో ఏడాదే ’’

‘‘జనం ఆశలు గల్లంతు.. జగన్ ఉండేది ఇంకో ఏడాదే ’’

   2 hours ago


టీటీడీ పాలకమండలి భేటీ... ఉద్యోగులకు కరోనా పరీక్షలు

టీటీడీ పాలకమండలి భేటీ... ఉద్యోగులకు కరోనా పరీక్షలు

   2 hours ago


ఓ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి.. జగన్‌కు రఘురామ లేఖ

ఓ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి.. జగన్‌కు రఘురామ లేఖ

   8 hours ago


వైసీపీ ఎమ్మెల్యే, ఓ మాజీమంత్రికి కరోనా పాజిటివ్

వైసీపీ ఎమ్మెల్యే, ఓ మాజీమంత్రికి కరోనా పాజిటివ్

   8 hours ago


రైళ్ళు తిరగక.. ఆదాయం లేక ...హైదరాబాద్ మెట్రోకి కరోనా కష్టాలు

రైళ్ళు తిరగక.. ఆదాయం లేక ...హైదరాబాద్ మెట్రోకి కరోనా కష్టాలు

   9 hours ago


విజయసాయిని ఇలా ఎప్పుడైనా చూశారా?

విజయసాయిని ఇలా ఎప్పుడైనా చూశారా?

   9 hours ago


సేవ్ అమరావతి ఉద్యమానికి 200 రోజులు.. అంగుళం కదల్చలేరన్న విపక్షాలు

సేవ్ అమరావతి ఉద్యమానికి 200 రోజులు.. అంగుళం కదల్చలేరన్న విపక్షాలు

   10 hours ago


ఎంపీ రఘురామ వ్యవహారం.. కాగల కార్యం స్పీకర్ తీరుస్తారా?

ఎంపీ రఘురామ వ్యవహారం.. కాగల కార్యం స్పీకర్ తీరుస్తారా?

   11 hours ago


తునిలో అరెస్ట్... గూడూరు పీఎస్‌లో కొల్లు రవీంద్ర ప్రత్యక్షం

తునిలో అరెస్ట్... గూడూరు పీఎస్‌లో కొల్లు రవీంద్ర ప్రత్యక్షం

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle