newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

వలసలకు తలుపులు తెరిచిన బీజేపీ

02-06-201902-06-2019 20:34:28 IST
Updated On 24-06-2019 17:31:02 ISTUpdated On 24-06-20192019-06-02T15:04:28.379Z02-06-2019 2019-06-02T15:04:23.537Z - 2019-06-24T12:01:02.498Z - 24-06-2019

వలసలకు తలుపులు తెరిచిన బీజేపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ‌వ్యాప్తంగా తిరుగులేని పార్టీగా ఎదిగిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ద‌క్షిణాదిన మాత్రం అంత‌గా ప‌ట్టు సాధించ‌లేక‌పోతోంది. క‌ర్ణాట‌క‌ను మించి సౌత్ లో ఆ పార్టీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోతోంది. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లోనూ ఇది స్ప‌ష్ట‌మైంది. అయితే, ఈసారి తెలంగాణ‌లో అనూహ్యంగా నాలుగు సీట్లు గెలుచుకొని స‌త్తా చాటిన ఆ పార్టీ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ బ‌లం పెంచుకోవాల‌ని యోచిస్తోంది.

ఇందుకు గానూ ఆ పార్టీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిందంటున్నారు. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓట‌మిపాలైంది. దీంతో ఆ పార్టీ నేత‌లు పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయారు. చంద్ర‌బాబు త‌ప్ప తెలుగుదేశం పార్టీలో ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డం కూడా ఇందుకు కార‌ణం. ఇంత దారుణంగా ఓడిపోవ‌డం, జ‌గ‌న్ బ‌లంగా త‌యార‌వ‌డంతో తెలుగుదేశం పార్టీ నేత‌లు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ పై బెంగ పెట్టుకున్నారు.

ఈ విష‌యాన్ని గుర్తించిన బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బ‌ల‌ప‌డ‌టానికి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయాల‌ని భావిస్తోంద‌ట‌. భ‌విష్య‌త్ పై బెంగ‌తో, ఓట‌మిపై దిగులుగా ఉన్న టీడీపీ నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకోవాల‌ని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీలోనే కొన‌సాగితే రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున త‌మ‌కు ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని కొంద‌రు నేత‌లు భయ‌ప‌డుతున్నారు. ఇటువంటి వారికి బీజేపీ గాలం వేయ‌నుంది.

గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కార‌ణంగా ఆ పార్టీ రెండు ఎంపీ స్థానాల‌ను, నాలుగు ఎమ్మెల్యే స్థానాల‌ను గెలుచుకుంది. ఈ ఎన్నిక‌ల్లో మాత్రం బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉండ‌టంతో ఆ పార్టీకి దారుణ ప‌రాభ‌వం ఎదురైంది. నోటాకు వ‌చ్చిన‌న్ని ఓట్లే ఆ పార్టీకి పోల‌య్యాయి. ఇటువంటి స‌మ‌యంలో చేరిక‌లు ఒక్క‌టే ఆ పార్టీని బ‌లోపేతం చేస్తుంద‌ని చెప్ప‌లేం.

ముఖ్యంగా ప్ర‌జ‌ల్లో ఆ పార్టీకి ఆద‌ర‌ణ పెర‌గాలంటే రాష్ట్రానికి ఎదో ఒక రూపంలో న్యాయం చేయాలి. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జ‌గ‌న్ కూడా బీజేపీతో స‌త్సంబంధాలు క‌లిగి ఉండాల‌ని, సానుకూల ధోర‌ణిలోనే రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవాల‌ని భావిస్తున్నారు. రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని నిజంగానే ఆ పార్టీకి ఉంటే మాత్రం రాష్ట్రానికి ఈ ఐదేళ్లు ఎంతో కొంత స‌హ‌కారం అందించ‌డం ఖాయం. ఇలా చేస్తేనే టీడీపీ నేత‌ల‌ను చేర్చుకుంటే ఏమైనా లాభం. లేక‌పోతే చేరిన నేత‌లు సైతం ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌లా నామ‌మాత్రంగా మారిపోతారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle