newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

వర్మ చేసిన తప్పేంటి?ఎన్నాళ్ళీ నిరంకుశత్వం?

29-04-201929-04-2019 15:25:06 IST
Updated On 03-07-2019 14:49:06 ISTUpdated On 03-07-20192019-04-29T09:55:06.638Z29-04-2019 2019-04-29T09:55:02.684Z - 2019-07-03T09:19:06.895Z - 03-07-2019

వర్మ చేసిన తప్పేంటి?ఎన్నాళ్ళీ నిరంకుశత్వం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా వివాదమే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ సినిమా తీసి రచ్చరచ్చ చేశారు. ఎన్టీఆర్-చంద్రబాబు మధ్య జరిగిన రాజకీయ పోరాటం, వెన్నుపోటు రాజకీయాలను తెరమీద చూపించారు. దీంతో ఈ మూవీ విడుదల ఏపీలో ఆగిపోయింది. తాజాగా ఈ మూవీని మే1వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. విజయవాడలో ప్రెస్ మీట్ అంటూ హడావిడి చేశారు. చివరాఖరికి పోలీసులు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రాకుండా అడ్డుకుని.. బలవంతంగా విజయవాడ నుంచి హైదరాబాద్ తరలించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడుపై తీవ్రంగా విమర్శలు చేశారు వైసీపీ అధినేత జగన్.

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ప్రెస్‌ మీట్‌ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను బంట్రోతులు కన్నా హీనంగా వాడుకుంటున్నారని జగన్ ఆరోపించారు. రామ్‌గోపాల్‌ వర్మ ప్రెస్‌ మీట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడానికి ఆయన చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిచారు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామంలో చోటుచేసుకోవడం దారుణం అన్నారు. ఈమేరకు జగన్ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.

Image may contain: one or more people and text


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle