newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

వరద ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ ఏరియల్ సర్వే

17-08-201917-08-2019 14:32:00 IST
Updated On 17-08-2019 14:35:29 ISTUpdated On 17-08-20192019-08-17T09:02:00.876Z17-08-2019 2019-08-17T09:01:54.905Z - 2019-08-17T09:05:29.725Z - 17-08-2019

వరద ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ ఏరియల్ సర్వే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీలో వరద పరిస్థితిని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్  బిస్వ భూషణ్ హరిచందన్. కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వరద పోటెత్తడంతో అధికారులు ఇప్పటికే హై అలర్డ్‌ ప్రకటించారు.

ముంచుకొస్తున్న వరద నేపథ్యంలో రెండు జిల్లాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పడు అంచనా వేస్తూ అధికారులు మందుజాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నారు.

వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. రెండు జిల్లాల్లోనూ ఫైర్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బృందాలుగా ఏర్పడి​ బోట్ల ద్వారా సాయాన్ని అందిస్తున్నారు.వరద ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలతో పాటు మెడికల్‌ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు.వరద ‍ప్రభావిత ‍ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు.

ముంపు ప్రాంతాల్లో మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలు పర్యటించారు. పెనమలూరులో పార్థసారథి, అవినగడ్డలో సింహాద్రి రమేష్, మంగళగిరిలో ఆర్కే, నందిగామలో డాక్టర్‌ జగన్‌మోహన్‌రావు, విజయవాడలో మల్లాది విష్ణులు పర్యటించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle