newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

వణికిస్తున్న‘పెథాయ్’... ఏపీ హై అలర్ట్

15-12-201815-12-2018 17:04:44 IST
Updated On 15-12-2018 17:05:27 ISTUpdated On 15-12-20182018-12-15T11:34:44.752Z15-12-2018 2018-12-15T11:34:42.787Z - 2018-12-15T11:35:27.031Z - 15-12-2018

వణికిస్తున్న‘పెథాయ్’... ఏపీ హై అలర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీకి సుదీర్ఘమయిన సముద్ర తీరం ఉంది. బంగాళాఖాతంలో ఏ తుపాను ఏర్పడినా దాని దెబ్బకు ఏపీ వణికిపోతోంది. గతంలో వచ్చిన తుపానుల దెబ్బకి కోస్తాతీరం అతలాకుతలం అయింది. ఇప్పుడు మళ్ళీ తుపానులు ఏపీ వాసుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈసారి తెరమీదకు వచ్చిన తుపాను ‘పెథాయ్’ పేరును థాయ్‌లాండ్‌ ప్రతిపాదించింది, ఇప్పటివరకూ అనేక తుపాన్లు జనజీవనాన్ని, ఆస్తిపాస్తులను తుడిచేశాయి. వేలకోట్లరూపాయల అన్నదాతల కష్టం నీళ్ళపాలైంది. అంతకంటే విలువైన ఆస్తులు తుపాను దెబ్బకి గురయ్యాయి. తిత్లీ తుపానుకి శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయింది. తాజాగా ఏర్పడిన ‘పెథాయ్’ తుపాను ఏపీవైపు అతి వేగంగా దూసుకువస్తోంది. వాయుగుండం శ్రీహరి కోటకు 790కిలోమీట్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కదులుతోంది. ఈ నెల 17వ తేదీన కినాడ-విశాఖ సమీపంలో తీరందాటే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావం‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.పెథాయ్ వల్ల ఈనెల 15న కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులో కొన్నిచోట్ల భారీ వర్షాలు, 16, 17న కోస్తాలోని పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అలాగే 17వ తేదీ కోస్తాతో పాటు ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. తుపాను వల్ల శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ 16వ తేదీ నుంచి గంటకి 80 కి.మీ నుంచి 110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.  

ఈ తుపాను ప్రభావంతో  కోస్తాంధ్ర అంతటా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలల ఉద్ధృతి పెరిగే సూచనలు ఉన్నట్లు హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌ హెచ్చరికలు జారీ చేసింది. పెథాయ్ తుపాను ఎలా పయనిస్తుంది, ఏయే ప్రాంతాలపై ప్రభావం ఉంటుందనే విషయాలను ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాను నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో రాత్రిపూట కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని పేర్కొన్నారు. తిత్లీ తుపాను సందర్భంగా ఎదురైన అనుభవాలను అధికారులకు గుర్తుచేసిన సీఎం.. మరోసారి అలాంటి పరిస్ధితులు ఎదురయ్యే అవకాశముందని తెలిపారు. టెక్నాలజీ సాయంతో నష్టాన్ని తగ్గించుకోగలిగామని, అదే విధంగా ఇప్పుడు కూడా హెచ్చరికలు జారీచేయాలని చంద్రబాబు సూచించారు.  ‘పెథాయ్‌’ తుపాను నేపథ్యంలో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. పత్తి, మిర్చి పంటలపై ప్రభావం పడుతుందని, వరికోతల యంత్రాలను ఎక్కువ ధరలకు అద్దెకు తీసుకుని రైతులు వరికోతలకు దిగారు. ఐవీఆర్ఎస్ ద్వారా 48 వేల మంది మ‌త్స్య‌కారుల‌కు ఫోన్లు చేశారు. దీంతో మ‌త్స్యకారుల ప‌డ‌వ‌లు తీరంలోనే నిలిచిపోయాయి. అటు.. చేప‌ల వేట‌కు వెళ్లిన 133 ప‌డ‌వ‌లు తిరుగు ప్ర‌యాణం అయ్యాయి. తుపాన్ సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్‌లో ఉంటూ పరిస్థితిని ప‌ర్యవేక్షిస్తున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle