newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

వంశీ త‌ర్వాత ఆయ‌నేనా..?

03-11-201903-11-2019 07:28:17 IST
2019-11-03T01:58:17.287Z03-11-2019 2019-11-03T01:57:59.376Z - - 14-11-2019

వంశీ త‌ర్వాత ఆయ‌నేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 23 మంది ఎమ్మెల్యేల్లో మ‌రో ఎమ్మెల్యే పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇప్ప‌టికే పార్టీకి రాజీనామా చేయ‌డం ఖాయ‌మైంది. ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు టీడీపీ నేత‌లు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. ఈ నెల 7న ఆయ‌న వైసీపీలో చేరే అవ‌కాశాలు ఉన్నాయి.

తాజాగా ప్ర‌కాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ కూడా పార్టీని వీడ‌నున్నార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున సాగుతోంది. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గొట్టిపాటి త‌ర్వాత వైసీపీలో చేరి 2014లో విజ‌యం సాధించారు. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్‌కు స‌న్నిహిత నేత‌ల్లో ఒక‌రిగా ఆయ‌న ముద్ర వేసుకున్నారు. టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ వ‌ల‌లో చిక్కిన ఆయ‌న వైసీపీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీలో చేరారు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ నుంచి పోటీ చేసి జ‌గ‌న్ ప్ర‌భంజ‌నాన్ని త‌ట్టుకొని విజ‌యం సాధించారు. కానీ, వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న సెలంట్‌గా మారిపోయారు.

గొట్టిపాటి ర‌వికి గ్రైనేట్ వ్యాపారం ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టంతో ఈ వ్యాపారినికి అడ్డంకులు ఎదుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న వైసీపీ వైపు చూసేందుకు ఇది కూడా ఒక ప్ర‌ధాన కార‌ణం అంటున్నారు.

వాస్త‌వానికి టీడీపీలో చేరినా గొట్టిపాటి ర‌వి ఎప్పుడూ జ‌గ‌న్‌ను ప‌ల్లెత్తు మాట కూడా అన‌లేదు. ఆయ‌న‌తో పాటు టీడీపీలో చేరిన అప్ప‌టి వైసీపీ ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌పై అనేక విమ‌ర్శ‌లు చేసి అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ద్ద మార్కులు వేయించుకోవాల‌ని తాప‌త్ర‌య‌ప‌డ్డారు.

కానీ, జ‌గ‌న్ మాత్రం టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు, వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా జ‌గ‌న్‌పై ఎటువంటి విమ‌ర్శ‌లు చేయ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతున్నారు.

పైగా ఆయ‌న‌కు వైసీపీ ముఖ్య నేత‌ల‌తో స‌త్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో గొట్టిపాటి ర‌వికి త‌న బాగోగులు చెప్పుకునేంత‌టి సాన్నిహిత్యం ఉంది. దీంతో ఆయ‌న ద్వారానే గొట్టిపాటి వైసీపీలో చేర‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే వైసీపీలో ఈ చ‌ర్చ జ‌రిగింద‌ని, గొట్టిపాటి రాక‌కు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఆయ‌న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును క‌లిశారు. వ్యాపారప‌రంగా త‌న‌కు ఎదురువుతున్న ఇబ్బందుల‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని, ధైర్యంగా పార్టీలోనే కొన‌సాగాల‌ని చంద్ర‌బాబు భ‌రోసా ఇచ్చార‌ట‌. అయినా కూడా గొట్టిపాటి ర‌వి వైసీపీ వైపే చూస్తున్నార‌ని అంటున్నారు.

కానీ, వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలి. మ‌రి, గొట్టిపాటి ర‌వి ఇందుకు సిద్ధంగా ఉన్నారా ? ఉప ఎన్నిక‌ల‌ను ఆయ‌న ఎదుర్కునే ధైర్యం చేసి వైసీపీలో చేరుతారా అనేది ప్ర‌శ్న‌గా మారింది. మొత్తానికి గొట్టిపాటిని టీడీపీలోనే అనుమాన‌పు చూపులు చూస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle