newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు *ఈసారి భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు *కరోనా వ్యాక్సిన్ తయారీకి సన్నాహాలు-కేంద్ర ఆరోగ్య శాఖ* అమెరికాలో సమ్మర్ ఇంటర్న్ షిప్ లు రద్దు ... భారతీయ విద్యార్థులకు భారీ నష్టం *కరోనా కేసులకు ప్రాంతాలుగా 10 హాట్ స్పాట్ లు... ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, యూపీలోని 10 ప్రాంతాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదు అయినట్టు గుర్తింపు-కేంద్రం *తెలంగాణలో నిన్న 30 మందికి కరోనా నిర్ధారణ, ముగ్గురు మృతి, రాష్ట్రంలో తొమ్మిదికి చేరిన కరోనా మృతుల సంఖ్య*తెలంగాణలో 127 , ఆంధ్రప్రదేశ్ లో 111 కరోనా పాజిటివ్ కేసులు*భారత్ లో క్రమంగా పెరుగుతోన్న కరోనా.. నిన్న ఒకేరోజు 437 కొత్త కేసులు నమోదు, దేశంలో 1834 కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య*ఏపీలో 111 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు... నిన్న ఒక్కరోజే 67 కొత్త కేసులు నమోదు

వంశీ తటస్థుడా? కథ వైసీపీ కంచికా?

31-10-201931-10-2019 07:29:59 IST
Updated On 31-10-2019 15:14:59 ISTUpdated On 31-10-20192019-10-31T01:59:59.890Z31-10-2019 2019-10-31T01:59:46.986Z - 2019-10-31T09:44:59.075Z - 31-10-2019

వంశీ తటస్థుడా? కథ వైసీపీ కంచికా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత నాలుగైదు రోజులుగా రాష్ట్ర రాజకీయాలలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రెండు రోజులలో మూడు పార్టీల నేతలతో మీటింగులు పెట్టి చివరికి ఉన్న పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన సంగతీ తెలిసిందే. అందుకు ఆయన చెప్పుకున్న కారణం కూడా వేధింపులే అని. కానీ ఆ వేధింపులు ఎవరితో అన్నది ఎక్కడా చెప్పలేదు.

అయితే అధికారంలో ఉన్న వైసీపీనే వేధింపులు చేస్తుందని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వంశీ రాజీనామా పంపిన వాట్స్ యాప్ లోనే ఓ రిప్లై మెసేజ్ ఇచ్చారు. సమస్యను చూసి పారిపోకూడదని కలిసి పోరాడదామని అందులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా వంశీతో సంప్రదింపుల కోసం ఇద్దరు నేతలను కూడా నియమించారు. దీనిని పార్టీలో మరికొందరు నేతలే నచ్చకపోగా చంద్రబాబు వంశీ స్థాయిని పెంచుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు.

వంశీ ఏ గుట్టు మనసున పెట్టుకొని వేధింపులని రాజీనామాకి వెళ్లారో కానీ చంద్రబాబు మధ్య లేఖల రాజకీయం రసవత్తరంగా సాగింది. ఆ లేఖల రాయబారాలలో బాబు-వంశీ ఎవరికి వారు ఎత్తుగడలతో పోటీపడ్డారు. ఆ విషయాన్ని కాసేపు పక్కనపెడితే అసలు వంశీ ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. మరి ఎమ్మెల్యేగా తటస్థుడా? లేక పదవికి కూడా రాజీనామా చేశారా?

తాను రాజీనామాలకు సిద్దపడ్డానన్న వంశీ వాట్స్ యాప్ ద్వారానే పార్టీ అధినేతకు తెలియజేసిన సంగతి, వాట్స్ యాప్ లేఖ బయటకి వచ్చాయి. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని అందులో పేర్కొన్నారు కానీ ఇప్పటివరకు ఇంకా రాజీనామా స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. మరి వంశీ తటస్థుడిగా ఉంటారా? లేక ఉంచుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో టీడీపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పథకం వేసిన వైసీపీ మూడు ప్రాంతాల నుండి ముగ్గురితో పార్టీకి రాజీనామాలను చేయించి తటస్థంగా ఉంచి ఆట ప్రారంభించి అవసరాన్ని బట్టి పదవికి రాజీనామా.. ఉప ఎన్నికలకు వెళ్లి అక్కడ కూడా దెబ్బకొట్టాలని పన్నాగం వేసినట్లుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి వంశీ తటస్థంగా ఉండాలని వైసీపీ సూచించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతానికి టీడీపీని నైతికంగా దెబ్బతీసే మాస్టర్ ప్లాన్ లో వల్లభనేనిని ఒక పావుగా వాడుకొని చివరికి తమ సైనంలో కలిపేసుకోనున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. బెజవాడ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న వాదనల ప్రకారం అయితే వంశీ ఇప్పుడు ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా కథ ఈరోజు కాకపోయినా మరో ఐదారునెలలకైనా చివరికి వైసీపీ కంచికే చేరుతుందని బలంగా వినిపిస్తుంది. మరి వంశీ ఒక పావైతే మిగతా ఇద్దరు ఎవరు? అని తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన చర్చ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.

 

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

   5 hours ago


తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

   5 hours ago


కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

   6 hours ago


జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

   7 hours ago


గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

   8 hours ago


ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

   9 hours ago


శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

   10 hours ago


సింగరేణి  గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

సింగరేణి గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

   11 hours ago


గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

   12 hours ago


ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle