newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

వంశీ ఎఫెక్ట్ బీజేపీపై.. ఎలానో తెలుసా..?

19-11-201919-11-2019 09:34:26 IST
Updated On 19-11-2019 10:33:16 ISTUpdated On 19-11-20192019-11-19T04:04:26.566Z19-11-2019 2019-11-19T04:04:24.860Z - 2019-11-19T05:03:16.498Z - 19-11-2019

వంశీ ఎఫెక్ట్ బీజేపీపై.. ఎలానో తెలుసా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భనేని వంశీ ఎఫెక్ట్ బీజేపీపై ప‌డిందా..? అంటే అవున‌న్న స‌మాధానం రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వినిపిస్తోంది. అంతేకాక దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్కదిద్దుకోవాల‌న్న వాస్త‌వాన్ని బీజేపీ మ‌రిచిందంటూ ప‌లు ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా వినిపిస్తున్నారు. బీజేపీలో చేరుతాం మ‌హా ప్ర‌భో అంటూ ఒకానొక స‌మ‌యంలో పార్టీ కార్యాలయాల ముందు క్యూ క‌ట్టిన నేత‌ల‌కు నో ఎంట్రీ బోర్డు చూపి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటుందంటూ వారి విశ్లేష‌ణ‌ల్లో పేర్కొంటున్నారు.

ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేరుదామ‌ని భావించిన వారంతా ఒక్కొక్క‌రుగా ఇప్పుడు వైసీపీ కండువా వేసుకుంటున్నారంటూ వారు బ‌లంగా వాదిస్తున్నారు. ఇలా బీజేపీ గేట్లు మూసెయ్య‌డంతో వైసీపీ వైపు చూస్తున్న వారిలో మొద‌టి వ‌రుస‌లో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఉన్నారు. కాగా, వ‌ల్ల‌భ‌నేని వంశీ  బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రికి శిష్యుడు కావ‌డం, ఆయ‌న‌తో ప‌లు ద‌ఫాలు చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం వైసీపీ కండువా వేసుకునేందుకు వంశీ సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే.

మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల‌లో ఉంటున్న ముఖ్య నేతలు సైతం వంశీ బాట‌లోనే న‌డిచేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. ఇదే గ‌నుక జ‌రిగితే ఏపీలో బ‌లం పుంజుకుందామ‌నుకున్న బీజేపీకి మ‌రోసారి గ‌డ్డు ప‌రిస్థితి త‌ప్పేలా లేద‌న్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల నుంచి స్ప‌ష్టంగా వినిపిస్తోంది.

నిజానికి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత పెద్ద సంఖ్య‌లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేల‌ను ఆక‌ర్షించేందుకు బీజేపీ ప్ర‌య‌త్నించింది. అందులో భాగంగానే తొలుత రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను బుట్ట‌లో వేసుకుంది. అయితే, ఆ త‌రువాత ఎమ్మెల్యేల వంతు వ‌చ్చేస‌రికి వైసీపీ స్పీడ్ పెంచింది అంటున్నారు.

ఆల‌స్యం చేస్తే ఆశాభంగం త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన వైసీపీ ఒక్క‌సారిగా త‌న రూటును మార్చేసింది. అంత వ‌ర‌కు ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన త‌రువాతే చేర్చుకుంటామ‌ని చెప్పిన అధికార పార్టీ దాన్ని ప‌క్క‌న‌పెట్టి ముందుగా చేరిక‌ల జోరును పెంచేసింది.

ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ.. చాలా మంది వ‌రుస‌లో ఉన్నార‌ని, ఆ ప‌ని త‌న‌కు జగ‌న్  అప్ప‌గిస్తే పూర్తి చేస్తాన‌ని మంత్రి కొడాలి నాని చెప్ప‌డ‌మే. వైసీపీ త‌న రూటును మార్చేసింద‌ని చెప్ప‌డానికి కొడాలి నాని మాట‌లు బ‌లం చేకూర్చాయి. దీంతో రాష్ట్రంలో వైసీపీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని భావించిన బీజేపీకి ఇప్పుడు ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ల‌యింద‌ని అంటున్నారు.

మ‌రోప‌క్క‌, ఈ దెబ్బ‌తో టీడీపీ ప‌రిస్థితి కుడితిలోప‌డ్డ ఎలుక‌లా త‌యారైంది. రాష్ట్రంలో అధికార పార్టీలో చేరేందుకు ప్ర‌తిప‌క్షంలో ఉన్న నేత‌లు ఉత్సాహం చూపించ‌డం స‌ర్వ సాధార‌ణ‌మే అయినా  బీజేపీకంటే వైసీపీ అయితే బెట‌రన్న ఆలోచ‌న ఎక్కువ మందిలో ఉండ‌టం గ‌మ‌నార్హం. అందుకే బీజేపీ ఆల‌స్యం చేస్తున్న కొద్దీ టీడీపీ నేత‌లు వైసీపీ వైపు చూస్తున్నారు. వైసీపీ అగ్ర నేత‌ల నుంచి ఆహ్వానం అందిన వెంట‌నే పెట్టేబేడా స‌ర్దేసుకుని జంప్ అయిపోదామ‌ని ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle