newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

వంశీ ఎపిసోడ్‌తో రాజకీయాలపై యువత నిర్లిప్తత

17-11-201917-11-2019 09:28:26 IST
Updated On 17-11-2019 09:28:59 ISTUpdated On 17-11-20192019-11-17T03:58:26.053Z17-11-2019 2019-11-17T03:58:20.213Z - 2019-11-17T03:58:59.046Z - 17-11-2019

వంశీ ఎపిసోడ్‌తో రాజకీయాలపై యువత నిర్లిప్తత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వంశీ ఘాటు వ్యాఖ్యలతో మరింత దూరం 

పార్టీలో ఉన్నప్పుడు ఒకలా.. బయటికి వచ్చాక మరోలా ప్రవర్తన

అన్నం తినేవారే పార్టీ మారతారని గతంలో విమర్శలు

అప్పటి నీతి ఇప్పుడు ఏమయిందంటున్న తెలుగు తమ్ముళ్ళు

టీడీపీపై ఆశలు ఆవిరి అవుతున్నాయా? 

నేతలను ఆపి భరోసా కల్పించడంలో బాబు విఫలం

చంద్రబాబు స్ట్రాటజీ ఏమైంది?

నేతలు పార్టీలు మారడం రాజకీయాల్లో సహజం. కానీ తాము వీడుతున్న పార్టీపై తీవ్రమయిన స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఈమధ్యకాలంలో ఎక్కువైపోయింది. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం నేతలపై చేసిన విమర్శలు శృతిమించాయనే కామెంట్లు సోషల్ మీడియాలో పడుతున్నాయి. ఇలాంటి ఫిరాయింపుల వల్లే యువత రాజకీయాలపై నిర్లిప్తత పెంచుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. 

టీడీపీలో వల్లభనేని వంశీ రేపిన చిచ్చు మరింత పెద్దదవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై పంచ్‌లతో విరుచుకుపడ్డ తీరు సంచలనంగా మారుతోంది. అంతేకాకుండా ఓ ప్రైవేటు ఛానెల్‌ చర్చ రచ్చగా మారింది. వంశీ, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ మధ్య జరిగిన డైలాగ్‌ వార్‌ విమర్శలకు కారణమైంది. లైవ్‌ డిస్కషన్‌లోనే వంశీ తన నోటికి పనిచెప్పారు. రాజేంద్రప్రసాద్‌పై బూతులతో దాడి చేశారు.

ఈ ఎపిసోడ్ లో వంశీ వాడిన పదాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. రాజకీయాల్లోకి రావడానికి యువత వెనుకాడడానికి కారణాల్లో ఇలాంటి ఎపిసోడ్స్ కూడా ఒకటి. పార్టీలో ఉన్నంత సేపు ఒకలా.. బయటకు వచ్చాక మరోలా ప్రవర్తించడం నేతలకు వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది. 2019 ఎన్నికల తర్వాత టీడీపీపై ఆశలు ఆవిరి అవుతున్నాయనే భావన వ్యక్తం అవుతోంది. టీడీపీలో ఒక సామాజిక వర్గం ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం పార్టీకి క్రమేపీ దూరం అవుతోంది. 

తాజాగా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ...గతంలో రాజ్యసభ ఎంపీలు సుజనాచౌదరి, గరికపాటి మోహనరావు, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్.. ఇలా వరుసబెట్టి నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయారు. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం 5 నెలలు కాకుండానే నేతలు ఇలా నిర్లిప్తతకు గురవుతున్నారు. చంద్రబాబు సమర్థత మీద అపోహలు పెరిగిపోతున్నాయి.

వయసు మీద పడడంతో ఆయన మీద నమ్మకం తగ్గిపోతోందని అంటున్నారు. చంద్రబాబు తర్వాత... అనే భావన టీడీపీ నేతలను వేరే పార్టీల వైపు వెళ్ళేలా చేస్తోంది. అందుకు కారణం చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి లోకేష్ నాయకత్వంపై నమ్మకం కుదరడంలేదు. ఆయనను ప్రత్యామ్నాయంగా టీడీపీ నేతలు గుర్తించడం లేదు. అంత నమ్మకం కూడా ఆయన కలిగించడంలేదు. దీంతో టీడీపీలో వుంటే భవిష్యత్తు లేదని నేతలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

టీడీపీని రక్షించే బాహుబలి ఎవరూ కనిపించడం లేదు. ఈ సంక్షోభ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే ఆశాదీపంగా కనిపిస్తున్నారు. కానీ ఎన్టీఆర్ వారసులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. సినిమాలు వదిలి తారక్ ఏపీ వైపు వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు దక్షిణాదిన బీజేపీ బలపడుతోంది. వివిధ రాజకీయ కారణాల వల్ల వైసీపీలోకి వెళ్ళలేని వారు బీజేపీ ని ఆశ్రయిస్తున్నారు.  పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న వేళ చంద్రబాబు వైఖరి పార్టీ సీనియర్లకు అంతుచిక్కడం లేదు. టీడీపీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నా ఆపే ప్రయత్నం చేయడంలేదు బాబు.

అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ని బాబు బాగా వాడుకున్నారు. ఏ ఎమ్మెల్యే ఆలోచన ఎలా వుందో ఆయన తెలుసుకునేవారు. వారిని ఓ కంట గమనించేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆయన చుట్టూ చేరి ప్రతి విషయాన్ని వివరించేవారు ఏమయ్యారు? ఏ పరిస్థితులు ఎదురైనా పార్టీలో ఉండమని భరోసా కల్పించలేకపోతున్నారు చంద్రబాబు.

పార్టీలో వలసల నివారణకు చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? ఇందుకు తగిన నష్టనివారణ చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. విజయవాడలో 12 గంటల ఇసుక దీక్షలో ఉండగానే ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడుతున్న సంగతి బాబుకి తెలియదా? తెలిసినా ఏం చేయలేక ఊరుకున్నారా? విజయవాడ నడిబొడ్డున చంద్రబాబు ఉండగానే ఇద్దరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం ఏం సంకేతాలిచ్చినట్టు? 

తనపై వంశీ మాటలతో దాడి చేసినా పార్టీ నుంచి ఎవరూ స్పందించకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అలకబూనారు. పార్టీతో పాటు తనపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేసిన ఏ ఒక్కరూ స్పందించకపోవడంపై ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని వీడి వెళ్ళిపోయేవారు పార్టీలో ఉన్నవారిని తిట్టినా వారికి సరైన కౌంటర్ వేయడంలో టీడీపీ విఫలం అవుతోంది. మొత్తం మీద తాజా సంఘటనలు తెలుగు తమ్ముళ్ళకు భవిష్యత్తుపై నిరాశను, నిస్పృహను పెంచుతున్నాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle