newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

వంశీ ‘అదుర్స్’...టీడీపీ ‘బెదుర్స్’

09-07-201909-07-2019 13:46:43 IST
Updated On 10-07-2019 11:57:29 ISTUpdated On 10-07-20192019-07-09T08:16:43.073Z09-07-2019 2019-07-09T08:16:41.418Z - 2019-07-10T06:27:29.075Z - 10-07-2019

వంశీ ‘అదుర్స్’...టీడీపీ ‘బెదుర్స్’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీ ‘ఆకర్ష్ టీడీపీ’ ప్రచారంలో వాస్తవమెంతో తెలియదు కానీ, పూటకో ‘పచ్చ ఎమ్మెల్యే’ వార్తల్లో నిలుస్తున్నారు. మొదట గంటా శ్రీనివాసరావు దీనికి గంటకొట్టారు, తరువాత పత్తిపాటి పోటీపడ్డారు. తాజాగా వల్లభనేని వంశీ తెరపైకి వచ్చారు. 

జూనియర్ ఎన్టీఆర్‌ సూపర్ డూపర్ హిట్ సినిమా ‘అదుర్స్’ నిర్మాతగా వల్లభనేని వంశీ  సుపరిచితుడు. ఈ ట్యాగ్ లైనే వంశీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు ఎంతో అక్కరకొచ్చిందని చెప్పాలి. తొలిసారిగా 2009లో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన వంశీ.. 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి శాసనసభ్యునిగా పోటీచేసి గెలుపొందారు. 

ఇటు ‘సుజన’తో బంధుత్వం, ఇటు ప్రజలతో మమేకమయ్యే తత్వం కారణాలుగా ఈ యువ నేత తెలుగుదేశం పార్టీలో క్రమేణా ఎదుగుతూ కృష్ణాజిల్లా రాజకీయాల్లో ఒక కేంద్రస్థానంగా మారారు. అన్నీ బావుండి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేవినేని ఉమాకు ‘ప్రత్యామ్నాయం’గా వంశీ తప్పకుండా మంత్రి అయ్యేవారని ఒక అంచనా. 

ఎమ్మెల్యే కాక ముందు నుంచే వంశీకి ‘దేవినేని ఉమ’తో రాజకీయ వైరం ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఉమతో సహా టీడీపీ హేమాహేమీలంతా చిత్తుచిత్తుగా ఓడిపోయారు. గన్నవరంలో మాత్రం వంశీ 900 ఓట్ల తేడాతో సంచలన విజయం నమోదుచేసుకుని సభలో రెండోసారి ప్రవేశించారు.

ఇక ఈ ఐదేళ్లలో వంశీ పొలిటికల్ రూటు ఎలా ఉండబోతోంద‌నేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.  కొత్త ప్రభుత్వంలో మంత్రిగా మారిన ఒకనాటి తన సహచర సినీ నిర్మాత కొడాలి నానికి వంశీ అత్యంత సన్నిహితుడు. ఎప్పటి నుంచో వీరి మధ్య అనుబంధం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో కూడా వంశీకి మంచి స్నేహమే ఉందని చెబుతారు.

అసలు  ఎన్నికలకు ముందే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ వంశీ తెలుగుదేశం టిక్కెట్‌పై పోటీచేసి గెలిచారు. అంతేగాక, ఆ పార్టీ నుంచి సభలో మిగిలిన 23 మంది ఎమ్మెల్యేలలో చంద్రబాబుకు అత్యంత విశ్వసనీయుడిగా నిలిచారు. 

ఐతే, ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపి నుంచి బీజేపీలోకి జంప్ చేసే ఎమ్మెల్యేల లిస్టులో వంశీ పేరు వినిపించడం ఒక ఆసక్తిదాయక అంశం. తెలుగుదేశం నుంచి ముఖ్యమైన నేతలను కమలదళంలోకి తీసుకువెళ్లే బాధ్యతలు చూస్తున్న వ్యక్తి తనను ఆహ్వానించిన మాట వాస్తవమేనని,  తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని వీడే ప్రసక్తే లేదని వంశీ క్లారిటీ కూడా ఇచ్చారు.

తాజాగా, విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో వంశీ భేటీ కావడం మళ్లీ మరిన్ని సందేహాలకు తావిచ్చింది. కిషన్‌రెడ్డి తాజా ఆహ్వానంతో బీజేపీలో చేరేందుకు వంశీ రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి. అటువంటిది ఏదీ లేదని చివరికి వంశీ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇవ్వాల్సివచ్చింది. 

మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయంతో సంకట స్థితిలో పడిన తెలుగుదేశం పార్టీ  ఇప్పుడు సభలో వంశీ వంటి యువ నేతను వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదనేది నిర్వివాదం. ఎన్నికల ఫలితాల తరువాత ఇటు వైసీపీ, అటు బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ వున్న చంద్రబాబునే తీవ్రంగా కలవరపెడుతున్నాయి.

గతంలో ఎప్పుడూ లేనంతగా తెలుగుదేశం పార్టీ తీవ్రమైన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం తీసుకున్నారు. మరోవైపు, పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. 

అందరూ అంచనా వేస్తున్నట్టు ఒకవేళ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వంశీ బీజేపీ లేదా వైసీపీలలో ఏదో ఒక పార్టీలోకి చేరాలని నిర్ణయించుకుంటే అది చంద్రబాబు శిబిరానికి తీరని శరాఘాతం అవుతుంది.

ఇక వంశీ వైపు నుంచి చూస్తే అతనికి రెండు పార్టీల్లోనూ అత్యంత సన్నిహితులైన వ్యక్తులే కీలకంగా ఉన్నారు. ఏ పార్టీలోకి వెళ్లాలనుకున్నా అతనికి పెద్ద ఇబ్బందులేమీ లేవు. నిజానికి వంశీ ఇప్పుడు టీడీపీలో కూడా చేయ‌డానికి ఏమీ లేదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle