newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

వంశీపై ఆశ‌లు వ‌దులుకున్న‌ట్లే..!

01-11-201901-11-2019 07:34:53 IST
Updated On 01-11-2019 17:26:28 ISTUpdated On 01-11-20192019-11-01T02:04:53.103Z01-11-2019 2019-11-01T02:04:16.301Z - 2019-11-01T11:56:28.228Z - 01-11-2019

వంశీపై ఆశ‌లు వ‌దులుకున్న‌ట్లే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ఖాయ‌మైంది. ఈ నెల 3, 4 లేదా 7వ తేదీల్లో ఒక రోజు ఆయ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డానికి ముహూర్తం సిద్ధ‌మైంది. ఈ విష‌యాన్ని వంశీ స్థానిక మీడియా ప్ర‌తినిధుల‌కు ఆఫ్ ది రికార్డ్‌గా కూడా చెప్పేశారు.

త‌న అనుచ‌రులు, టీడీపీ శ్రేణులకు సైతం ఈ విష‌యంపైన వ‌ల్ల‌భ‌నేని వంశీ క్లారిటీ ఇచ్చారు. వంశీని బుజ్జ‌గించి పార్టీలోనే ఉంచేందుకు తెలుగుదేశం పార్టీ చేసిన ప్ర‌య‌త్నాలు కూడా ఫ‌లించ‌లేదు. వంశీతో సంప్ర‌దింపులు జ‌రిపేందుకు చంద్ర‌బాబు ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ను పంపించారు.

వీరిద్దరు వంశీతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. పార్టీలోనే కొన‌సాగాల్సిందిగా అధినేత మాట‌గా కోరారు. అయితే, పార్టీలో తాను ప‌డ్డ ఇబ్బందులు, జిల్లాకు చెందిన ఓ సీనియ‌ర్ నేత వ‌ల్ల తాను ఎంత ఇబ్బంది ప‌డ్డాడో వంశీ వారికి వివ‌రించిన‌ట్లు తెలిసింది. ఇక‌, పార్టీలో కొన‌సాగేది లేద‌ని సైతం ఆయ‌న స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం.

వంశీకి చెప్పాల్సింది చెప్పామ‌ని, నిర్ణ‌యం ఆయ‌న ఇష్ట‌మ‌ని కేశినేని చెప్పారు. కేశినేని మాట‌లు బ‌ట్టి చూస్తే పార్టీలోనే ఉంటాన‌ని వంశీ నుంచి ఎటువంటి హామీ ల‌భించ‌లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇదే స‌మ‌యంలో బుధ‌వారం గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు చంద్ర‌బాబు నాయుడు. అనుకున్న‌ట్లుగానే ఈ స‌మావేశానికి వంశీ హాజ‌రుకాలేదు.

స‌మావేశానికి వ‌చ్చిన కొంద‌రు కార్య‌క‌ర్త‌లు వంశీని బుజ్జ‌గించ‌డాన్ని అధినేత ముందే త‌ప్పుబ‌ట్టారు. ముఖ్య‌మంత్రిని స్వ‌యంగా క‌లిశాక వంశీ ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని వారు చంద్ర‌బాబును కోరారు. ఈ మేర‌కు స‌మావేశంలో నినాదాలు చేశారు. దీంతో చంద్ర‌బాబు వారికి న‌చ్చ జెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక‌, వంశీ పార్టీని వీడ‌టం ఖాయ‌మే అనే అంచ‌నాకు చంద్ర‌బాబు నాయుడు కూడా వ‌చ్చేశారు. అయితే, నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ క్యాడ‌ర్ రెండుగా చీలే అవ‌కాశం క‌నిపిస్తోంది. వంశీతో కొంత క్యాడ‌ర్ వెళ్లినా మ‌రికొంద‌రు టీడీపీలోనే కొన‌సాగ‌నున్నారు.

గ‌న్న‌వ‌రం ఇంఛార్జి బాధ్య‌త‌ల‌ను దేవినేని అవినాష్‌ కు ఇవ్వాల‌ని కొంత‌మంది కార్య‌క‌ర్త‌లు కోరుతున్నారు. వంశీ ఒక క్లారిటీకి వ‌చ్చిన త‌ర్వాత గ‌న్న‌వ‌రం ఇంఛార్జి బాధ్య‌త‌లు ఎవ‌రికి ఇవ్వాలనేది చంద్ర‌బాబు నిర్ణ‌యించ‌నున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle