newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

వంశీకి ఆ ఒక్క‌టే అడ్డంకి..!

14-11-201914-11-2019 08:01:56 IST
2019-11-14T02:31:56.793Z14-11-2019 2019-11-14T02:31:48.238Z - - 22-01-2020

వంశీకి ఆ ఒక్క‌టే అడ్డంకి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇంకా డైల‌మాలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి 15 రోజులు అవుతున్నా ఆయ‌న ఇంకా రాజీనామాను అధికారికంగా స‌మ‌ర్పించ‌లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖ‌రారైనా ఆయ‌న వాయిదా వేసుకున్నారు.

అలాగ‌ని తెలుగుదేశం పార్టీకీ దూరంగానే ఉంటున్నారు. దీంతో అస‌లు ఆయ‌న ఉద్దేశ్యం ఏంట‌నేది వంశీ అనుచ‌రుల‌తో పాటు, గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కూడా అర్థం కాని ప‌రిస్థితి. అయితే, వంశీ ఇలా డైల‌మాలో ఉండ‌టానికి ఎమ్మెల్యే ప‌ద‌వే కార‌ణం అని తెలుస్తోంది.

దీపావ‌ళి పండుగ నాడు వ‌ల్ల‌భ‌నేని వంశీ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అధికార పార్టీ త‌న అనుచ‌రుల‌ను వేధిస్తోంద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు కావ‌డం లేద‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు.

టీడీపీ కూడా త‌న‌కు అండ‌గా లేద‌ని స్వంత పార్టీపైనే నింద‌లు వేశారు. దీంతో చంద్ర‌బాబు ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నించారు.

ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ను ధూత‌లుగా పంపించినా వంశీ పార్టీలోనే ఉంటాన‌నే హామీ మాత్రం ఇవ్వ‌లేదు. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కూడా వంశీ క‌ల‌వ‌డం, ఆ త‌ర్వాత వంశీని కృష్ణా జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని క‌ల‌వ‌డంతో ఆయ‌న వైసీపీలో చేర‌డం ఖాయ‌మైంద‌ని అంతా అనుకున్నారు.

ఈ నెల 3 లేదా 7న వంశీ వైసీపీలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, వంశీ వెనుక‌డుగు వేశారు. ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులుకోవాల్సి వ‌స్తుంద‌నే ఆయ‌న పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. త‌మ పార్టీలో చేరితే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రావాల్సిందేన‌ని వైసీపీ స్ప‌ష్టంగా చెబుతోంది.

దీంతో వంశీ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీలో చేరాల్సి ఉంటుంది. ఇలా చేరితే వంశీకి మ‌ళ్లీ టిక్కెట్ వ‌స్తుందా అనేది వైసీపీ నుంచి క్లారిటీ లేదు.

వంశీపై పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓడిన వైసీపీ గ‌న్న‌వ‌రం ఇంఛార్జి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్‌రావుకే మ‌ళ్లీ టిక్కెట్ ఇస్తార‌ని, వంశీని రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యేగా ఉండేందుకే వంశీ మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇప్పుడే నిర్ణ‌యం తీసుకోకుండా సైలెంట్‌గా ఉండ‌టం మేల‌ని వంశీ నిర్ణ‌యించుకున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు పార్టీని వీడే యోచ‌న‌లో ఉన్నార‌ని, వారిలో కొంద‌రు బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఇప్పుడు తొంద‌ర‌ప‌డ‌కుండా వేచి చూడాల‌ని వంశీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే, కొంత ఆల‌స్య‌మైనా ఆయ‌న మాత్రం వైసీపీలో చేర‌డం ప‌క్కా అంటున్నారు. ఈ విష‌యాన్ని వంశీ త‌న అనుచ‌రుల‌కు కూడా స్ప‌ష్టం చేశారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle