newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

వంగవీటి వారసుడి వ్యూహాత్మక తప్పిదం

31-05-201931-05-2019 11:38:25 IST
Updated On 25-06-2019 14:23:30 ISTUpdated On 25-06-20192019-05-31T06:08:25.454Z31-05-2019 2019-05-31T06:08:23.038Z - 2019-06-25T08:53:30.043Z - 25-06-2019

వంగవీటి వారసుడి వ్యూహాత్మక తప్పిదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స‌రైన స‌మయంలో స‌రైన స్టెప్ తీసుకుంటేనే రాజ‌కీయంగా స‌క్సెస్ కావ‌చ్చు. ట్రెండ్ ను అంచ‌నా వేయ‌కుండా వెళ్లే నేత‌లు ఫెయిల్ అవ్వడానికి ఖాయం అన‌డానికి ప్రత్యక్ష ఉదాహ‌ర‌ణ వంగ‌వీటి రాధా. వంగ‌వీట రంగా వార‌సుడిగా, అశేష అభిమానం ఉన్న నాయకుడిగా ఎంతో మంచి స్థాయిలో ఉండాల్సిన ఆయ‌న త‌న తొంద‌ర‌పాటు నిర్ణ‌యాల వ‌ల్ల రాజ‌కీయంగా ఫెయిల్ అవుతున్నారు.

2014కు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వంగ‌వీటి రాధా ఆ ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత చాలా కాలం పాటు ఆయ‌న పార్టీలోనే కొన‌సాగారు. వంగ‌వీటి రంగా వార‌సుడిగా ఆయ‌న‌కు పార్టీలో బాగానే ప్రాధాన్యత ఉండేది. అయితే, ఈసారి విజ‌య‌వాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాల‌ని రాధా భావించారు.

అయితే, సెంట్రల్ లో మ‌ల్లాది విష్ణు అయితే బెస్ట్ అని భావించిన జ‌గ‌న్ రాధాను గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన తూర్పు నుంచే పోటీ చేయాల‌ని సూచించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన సానుభూతి కూడా క‌లిసి వ‌స్తుంద‌ని చెప్పారు. తాను సెంట్ర‌ల్ నుంచే పోటీ చేస్తాన‌ని రాధా ప‌ట్టుబ‌ట్టారు. దీంతో మ‌చిలీప‌ట్నం ఎంపీగా పోటీ చేయాలని పార్టీ సూచించింది. అక్కడ రాధా అయితే గెలుపు అవ‌కాశాలు ఎక్కువ ఉంటాయ‌ని జ‌గ‌న్ భావించారు.

మ‌చిలీప‌ట్నం ఎంపీగా పోటీ చేయ‌డానికి కూడా రాధా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు గుంటూరు నుంచి బాల‌శౌరిని తీసుకువ‌చ్చి మ‌చిలీప‌ట్నంలో పెట్టారు జ‌గ‌న్‌. దీంతో వంగ‌వీటి రాధా ఎన్నిక‌ల ముందు పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. త‌న తండ్రి ఏ పార్టీపైనైతే పోరాడారో అదే పార్టీ కుమారుడు చేర‌డాన్ని రంగా అభిమానులు సైతం అంద‌రూ జీర్ణించుకోలేక‌పోయారు. కానీ, రాధాకు వేరే ఆప్షన్ లేక‌పోవ‌డంతో టీడీపీలో చేరాల్సి వ‌చ్చింది. అప్పుడే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని చంద్రబాబు హామీ ఇచ్చినా ఇవ్వలేదు.

ఇక‌, టీడీపీలో చేరిన రాధా వైసీపీని, జ‌గ‌న్ ను శత్రువుగా భావించి ఆ పార్టీ ఓట‌మే ల‌క్ష్యంగా ప్రచారం చేశారు. టీడీపీకి స్టార్ క్యాంపెయిన‌ర్‌గా మారారు. టీడీపీ గెల‌వాల‌ని ఏకంగా యాగం కూడా నిర్వహించారు. అయినా, ఆయ‌న ఊహించింది జ‌ర‌గ‌లేదు. వైసీపీ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. దీంతో ఇప్పుడు అంతా వంగ‌వీటి రాధాపై సానుభూతి చూపుతున్నారు. మ‌చిలీప‌ట్నం ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. వంగ‌వీటి రాధా ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఉంటే మ‌రింత మెజారిటీ వ‌చ్చేది. దీంతో ఆయ‌న పార్ల‌మెంటులో అడుగుపెట్టేవారు.

రాధా ఇంత‌కుముందు కూడా ఇలానే తొంద‌ర‌పాటు నిర్ణయం తీసుకున్నారు. 2004లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయ‌న 2009కి ముందు వైఎస్సార్ వారించినా విన‌కుండా ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ ఓడిపోవ‌డంతో పాటు తాను కూడా స్వయంగా ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచింది. అప్పుడే ఆయ‌న కాంగ్రెస్‌లో ఉండి ఉన్నా, ఈ ఎన్నిక‌ల్లో వైసీపీలో ఉండి ఉన్నా వంగ‌వీటి రాధా పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ మ‌రోలా ఉండేది. ఇలా మోస్ట్ అన్ ల‌క్కీ పొలిటీషియ‌న్ గా వంగ‌వీటి రాధా మిగిలిపోయారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle