newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

వంగవీటి మాటల దాడి.. తుళ్ళూరు ధర్నాకు మద్దతు

14-01-202014-01-2020 16:56:18 IST
2020-01-14T11:26:18.581Z14-01-2020 2020-01-14T11:26:16.694Z - - 08-07-2020

వంగవీటి మాటల దాడి.. తుళ్ళూరు ధర్నాకు మద్దతు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చాలాకాలంగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా వున్న వంగవీటి రాధా మళ్ళీ మాటల దాడికి దిగారు. తాజాగా తుళ్ళూరు రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. సీఎం జగన్‌పై రాధా తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఏ జిల్లాలో జగన్ సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే వెన్నుపోటు పొడిచారని రాధా ఆరోపించారు. అమరావతిలోని తుళ్లూరు మహిళలు ఈ రోజు రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. వారికి వంగవీటి సంఘీభావం తెలిపారు. 151 సీట్లు ఇచ్చినవారిని పట్టించుకోవడం లేదన్నారు. 

వైసీపీ నేతలు, మంత్రుల రాజధాని విషయంలో చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఏపీకి 30 రాజధానులు అనుకున్నా ఫర్వాలేదని, తమకు తెలిసింది మాత్రం ఒకటే రాజధాని అని.. ఒకటే రాష్ట్రమని అది అమరావతి అన్నారు. అమరావతి విషయంలో వైసీపీ నేతలు తీరు, పోలీసుల దురుసు ప్రవర్తన వంటి అంశాలను మందడం మహిళలు రాధా దృష్టికి తీసుకెళ్ళారు.

పోలీసులు తమపై దాడి చేశారని, మహిళలని కూడా చూడకుండా భౌతికంగా వేధించారని వారు కన్నీటి పర్యంతమయ్యారు. అమరావతి రైతులకు, మహిళలకు తాము అండగా ఉంటామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ను ఇటీవల కలిసిన రాధా.. చాలా విరామం తర్వాత ఆందోళనల్లో పాల్గొనడంతో రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి ఒక్కటే వుండాలని అన్ని విధాలుగా సహకారాన్ని ఇస్తామని చెప్పారు.

ఇటు జేఏసీ నేతలు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు.  ప్రభుత్వం పోలీసుల ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోందన్నారు. గుంటూరు జిల్లాలో ఈనెల 20న జైల్‌భరో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 

ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఉద్యమంలో పాల్గొనాలని వారు పిలుపు ఇచ్చారు. రాజధాని ఉద్యమం పట్ల పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. హైకోర్టు ఇంటీరియమ్‌ ఆర్డర్లు ఇవ్వడం ప్రభుత్వానికి చెంపపెట్టని, మూడు రాజధానుల రెఫరెండంతో జగన్‌ ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేతలు గల్లా జయదేవ్‌, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు డిమాండ్ చేశారు.

‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

   36 minutes ago


కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

   an hour ago


గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

   an hour ago


టీటీడీపై ‌కుట్ర‌లా..?! మ‌రి ఆ కుట్ర‌ల‌ను చేధించ‌లేరా..?

టీటీడీపై ‌కుట్ర‌లా..?! మ‌రి ఆ కుట్ర‌ల‌ను చేధించ‌లేరా..?

   2 hours ago


టెస్టుల్లో ఆలస్యం నిజమే.. క్వారంటైన్లో నాణ్యమైన ఆహారం

టెస్టుల్లో ఆలస్యం నిజమే.. క్వారంటైన్లో నాణ్యమైన ఆహారం

   15 hours ago


టీటీడీలో ఉద్యోగులకు భారీగా కరోనా పరీక్షలు

టీటీడీలో ఉద్యోగులకు భారీగా కరోనా పరీక్షలు

   15 hours ago


డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్

డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్

   19 hours ago


విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్.. తిరిగి రావాల్సిందేనా?

విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్.. తిరిగి రావాల్సిందేనా?

   a day ago


ఏపీలో మూడ్రోజులపాటు వర్షాలు

ఏపీలో మూడ్రోజులపాటు వర్షాలు

   a day ago


విజయవాడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ కిట్లు.. కరోనాపై జాగ్రత్తలు

విజయవాడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ కిట్లు.. కరోనాపై జాగ్రత్తలు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle