newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

వంగవీటి ఎపిసోడ్‌లో ట్విస్ట్... ఆయనకు ఎర్త్?

22-01-201922-01-2019 14:56:57 IST
2019-01-22T09:26:57.724Z22-01-2019 2019-01-22T09:26:52.940Z - - 21-08-2019

వంగవీటి ఎపిసోడ్‌లో ట్విస్ట్... ఆయనకు ఎర్త్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇన్నిరోజులూ ఉత్కంఠగా మారిన వంగవీటి రాధాకృష్ణ ఎపిసోడ్ ఎట్టకేలకు కొలిక్కి చేరుకుంది. ‘జనసేన’లోకి జంప్ అవుతారనుకున్న ఆయన అనూహ్యంగా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లాస్ట్ మినట్ వరకూ పవన్ పార్టీలోకి చేరుతారనుకున్న ఆయన సడెన్‌గా టిడిపిలోకి వెళ్ళడం వెనుక ఆంతర్యం ఏమిటని చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే... ఈ మొత్తం తతంగం వెనుక టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రమేయం ఉందని ఓ వార్త బయటకు పొక్కింది.

నిజానికి... వంగవీటి రాధాను టిడిపిలోకి తీసుకురావాలని ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోస్తాలోని బలమైన సామాజిక వర్గానికి రాధా ప్రతినిధి కాబట్టి... ఆయన్ను తమ పార్టీలో తీసుకొస్తే ఆ వర్గానికి చెందిన ఓట్లన్నీ తమ ఖాతాలో పడతాయన్నది టిడిపి వ్యూహం! ఈ ప్లాన్‌లో భాగంగా ఆయన ఆప్తమిత్రుడైన వల్లభనేని వంశీని పావుగా బరిలోకి దింపింది. టిడిపిలో చేరాల్సిందిగా వంశీ కాకాపడుతూ వచ్చారు. కానీ రాధా మాత్రం అందుకు అంగీకరించకపోగా... వైసిపిలోనే కొనసాగేందుకు మొగ్గుచూపారు. అయితే కొంతకాలం నుంచి వైసిపి అధినేత జగన్ తనకు ప్రాధాన్యాత ఇవ్వడం లేదని గ్రహించిన రాధాకృష్ణ... ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అప్పట్నుంచే ఆయన ‘జనసేన’లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతూ వస్తోంది. రంగా అభిమానులు, ఆయన సామాజికవర్గాల్లోనూ ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తూ వచ్చారు.

ఇంతలో వల్లభనేని వంశీ కలగజేసుకుని... టిడిపిలో చేరమని రాధాను బుజ్జగిస్తూ వచ్చారు. సామాజిక వర్గ సమీకరణాలు, ప్రజలనాడిని బట్టి టిడిపిలో చేరాలని... ఆ పార్టీలో చేరితో చాలా లాభాలుంటాయని వంశీ సలహాలు ఇచ్చారట! ఆయన సూచనలతో ఆలోచనలో పడ్డ రాధా... చివరికి టిడిపిలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట! అటు కొడాలి నాని వైసిపిని వీడొద్దని నచ్చజెప్తూ వస్తున్నా... జగన్ నుంచి సంకేతాలు రాకపోవడంతో రాధా రాజీనామా చేసి, వంశీ సలహా మేరకు టిడిపి కండువా కప్పుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. కథ ఇంతటితో అయిపోలేదు... రాధా రాకతో టిడిపిలో మరో ఆసక్తికరమైన ఘట్టం వెలుగుచూసింది.

బొండా ఉమాని టిడిపి చాలాకాలం నుంచి పక్కన పెట్టాలని యోచిస్తోంది. ఆయన ముద్రగడకి అనుకూలంగా మాట్లాడడం, వేరే విషయాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉండడంతో... పార్టీ ఆ నిర్ణయానికి వచ్చింది. అయితే... నేరుగా బరిలోకి దిగితే రిజల్ట్ తేడా కొట్టొచ్చని భావించిన టిడిపి... సీన్‌లోకి ఓ బలమైన అభ్యర్థిని తీసుకొచ్చి కౌంటర్ ఇవ్వాలని యోచించింది. ఇప్పుడు వంగవీటి రాధా సీన్‌లోకి ఎంటరవ్వడంతో... బొండా ఉమా బెర్త్‌కి ఎర్త్ పెట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle