newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

ల‌క్ష్మీనారాయ‌ణ ఫిక్స్ అయ్యారా..?

12-03-201912-03-2019 14:10:51 IST
2019-03-12T08:40:51.002Z12-03-2019 2019-03-12T07:34:14.164Z - - 18-07-2019

ల‌క్ష్మీనారాయ‌ణ ఫిక్స్ అయ్యారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయ రంగప్రవేశానికి ముహూర్తం ఫిక్సయ్యింది. అనేక ఊగిస‌లాట‌లు, చ‌ర్చల త‌ర్వాత ఆయ‌న ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటి వరకూ బీజేపీలో చేరాలని ఆయన అనుకున్నట్టు తెలిసింది. అయితే ఇప్సుడు ఆయనలో మార్పు వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఆయ‌న చేరిక దాదాపు ఖాయ‌మైంది. రెండు మూడు రోజుల్లో ఆయ‌న తెలుగుదేశం పార్టీ కండువా క‌ప్పుకోనున్నార‌ని స‌మాచారం. మంత్రి గంటా శ్రీనివాస‌రావుతో భేటీ అయిన ఆయ‌న ఈ మేర‌కు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మ‌హారాష్ట్ర క్యాడ‌ర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ల‌క్ష్మీనారాయ‌ణ స్వస్థలం క‌ర్నూలు జిల్లా. డిప్యుటేష‌న్‌పై సీబీఐ జేడీగా హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆయ‌న వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్రమాస్తుల కేసు ద్వారా ఒక్కసారిగా బాగా ప్రచారంలోకి వ‌చ్చారు. ఈ కేసులో ఆయ‌న త‌ర‌చూ మీడియాలో క‌నిపించ‌డంతో రాష్ట్రవ్యాప్తంగా అంద‌రికీ తెలిసిన వ్యక్తిగా మారిపోయారు. త‌ర్వాత మ‌ళ్లీ మ‌హారాష్ట్రకు బ‌దిలీ అయిన ఆయ‌న కొన్ని రోజులు విధులు నిర్వర్తించి స్వచ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప‌ర్యటిస్తూ రైతులు, యువ‌త ఎదుర్కుంటున్న స‌మ‌స్యల‌ను తెలుసుకున్నారు. దీంతో ఆయ‌న రాజ‌కీయాల్లోకి రానున్నార‌నే వార్తలు వ‌చ్చాయి. మొద‌ట ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరుతార‌ని ప్రచారం జ‌రిగింది. త‌ర్వాత రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి అంత బాగాలేనందున ఆయ‌న జ‌న‌సేన‌లో చేరుతార‌నే వార్తలు వ‌చ్చాయి. కానీ జ‌న‌సేన అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే జ‌న‌సేన అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది. దీంతో ఆ పార్టీలో గుర్తింపు ఉండ‌ద‌ని ఆయ‌న‌కు ప‌లువురు సూచించార‌ట‌.

త‌ర్వాత ఆయ‌న‌కు లోక్‌స‌త్తాలో చేరాల్సిందిగా ఆహ్వానం అందింది. జ‌య‌ప్రకాశ్ నారాయ‌ణ స్థాపించిన ఈ పార్టీ ప్రస్తుతం ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకుంది. ల‌క్ష్మీనారాయ‌ణ వ‌స్తే పూర్తిగా లోక్ స‌త్తా బాధ్యత‌లు ఆయ‌న‌కు అప్పగించాల‌ని జేపీ భావించారు. కానీ, లోక్ స‌త్తా వైపు ల‌క్ష్మీనారాయ‌ణ ఆస‌క్తి చూప‌లేదు. త‌ర్వాత మ‌ళ్లీ బీజేపీలో చేరేందుకు ఆయ‌న మొగ్గు చూపినా త‌ర్వాత వెన‌క్కు త‌గ్గారు.

చివ‌ర‌కు ఎన్నిక‌ల వేళ ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మొగ్గు చూపారు. రెండుమూడు రోజుల్లో ఆయ‌న చంద్రబాబు స‌మ‌క్షంలో పార్టీలో చేర‌వ‌చ్చు. క‌చ్చితంగా టీడీపీ గెలుస్తుంద‌నుకుంటున్న భీమిలి సీటును ఆయ‌న‌కు ఇచ్చేందుకు టీడీపీ ఆఫ‌ర్ చేసింది. ఇక్కడి నుంచి పోటీ చేయాల‌నుకున్న లోకేష్‌ను విశాఖ‌ప‌ట్నం ఉత్తరం నుంచి పోటీ చేయించ‌నున్నారు.

అయితే, శ్రీకాకుళం జిల్లాలో ఓ గ్రామాన్ని ద‌త్తత తీసుకుని ఆ జిల్లాపై ఎక్కువ దృష్టి పెట్టిన ల‌క్ష్మీనారాయ‌ణ భీమిలి నుంచి పోటీ చేస్తారా లేదా శ్రీకాకుళంలోనే ఏదైనా నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారా అనేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

ఇదిలా ఉండ‌గా ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీలో చేరుతుండ‌టంతో వైసీపీ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ‌కు అనుకూలంగా ప్రచారం ప్రారంభించింది. జ‌గ‌న్ ఆస్తుల కేసులో ల‌క్ష్మీనారాయ‌ణ క‌క్షపూరితంగా వ్యవ‌హ‌రించార‌ని, ఆయ‌న ముందు నుంచీ టీడీపీకి అనుకూలంగా ఉన్నార‌ని, ఇప్పుడు ఏకంగా టీడీపీలో చేరుతుండ‌ట‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ అని ప్రచారం చేస్తున్నారు. జ‌గ‌న్ ను అక్రమంగా కేసుల్లో ఇరికించార‌ని చెబుతున్నారు. మ‌రి, ఈ ప్రచారాన్ని ల‌క్ష్మీనారాయ‌ణ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle