newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

ల‌క్ష్మీనారాయ‌ణ అప్పుడే మారిపోతున్నారా..?

10-08-201910-08-2019 15:24:57 IST
Updated On 13-08-2019 12:32:30 ISTUpdated On 13-08-20192019-08-10T09:54:57.047Z10-08-2019 2019-08-10T09:54:32.325Z - 2019-08-13T07:02:30.174Z - 13-08-2019

ల‌క్ష్మీనారాయ‌ణ అప్పుడే మారిపోతున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సివిల్ స‌ర్వీసెస్‌లో ప‌నిచేసిన రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారి స‌క్సెస్ రేటు చాలా త‌క్కువ‌. ఉద్యోగంలో ఉన్న‌ప్పుడు త‌మకు వ‌చ్చిన క్రేజ్‌తో రాజ‌కీయాల్లో కూడా రాణించి ప్ర‌జ‌ల‌కు సేవ చేద్దామ‌ని రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న కొంద‌రు అంత‌గా స‌క్సెస్ కాలేక‌పోతున్నారు. 2009లో ఐఏఎస్ అధికారి జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ లోక్‌స‌త్తా పార్టీ పెట్టి సంచ‌ల‌నం సృష్టించారు.

సివిల్ స‌ర్వెంట్‌గా మంచి పేరు ఉండ‌టం, అవినీతి నిర్మూల‌న అజెండాతో తెర‌పైకి రావ‌డంతో ఆయ‌న పార్టీపైనే చాలానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ, ఎన్నిక‌ల నాటికి ఫ‌లితాలు రివ‌ర్స్‌లో వ‌చ్చాయి. కేవ‌లం జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ త‌ప్ప మిగ‌తా ఎవ‌రూ గెల‌వ‌లేదు. 2014లో ఎంపీగా పోటీ చేసిన ఆయ‌న ఓడిపోయి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పేశారు.

ఆయ‌న త‌ర్వాత సీబీఐ మాజీ జేడీ వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ కూడా జేపీ బాట‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. జ‌గ‌న్ ఆస్తులు, ఎమ్మార్, గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి గ‌నుల కేసుల‌ను ధ‌ర్యాప్తు చేసిన ఆయ‌న‌కు అవినీతి నిర్మూల‌న చేసే నిజాయితీ క‌లిగిన అధికారిగా బాగా పేరొచ్చింది. త‌ర్వాత కొన్ని రోజులు మ‌హారాష్ట్ర పోలీస్ శాఖ‌లో ప‌నిచేసిన ఆయ‌న వీఆర్ఎస్ తీసుకొని ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.

రాష్ట్ర‌మంతా తిరిగి రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకున్న ఆయ‌న ప్ర‌త్యేకంగా పార్టీ పెడ‌తారని ప్ర‌చారం జ‌రిగింది. త‌ర్వాత ఆయ‌న బీజేపీలో చేర‌తార‌ని, టీడీపీలో చేర‌తార‌ని అన్నారు. చివ‌ర‌కు ఆయ‌న ఊహించ‌ని విధంగా జ‌న‌సేనలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయం కీల‌క మ‌లుపు తీసుకోనున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రెండుమూడు సంద‌ర్భాల్లో క‌నిపించిన ఆయ‌న ఇటీవ‌ల దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌ల జ‌న‌సేన వేసిన కీల‌క క‌మిటీల్లోనూ ఆయ‌న పేరు లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న స‌మీక్ష‌ల్లోనూ ల‌క్ష్మీనారాయ‌ణ క‌నిపించ‌డం లేదు. దీంతో ఆయ‌న పూర్తిగా జ‌న‌సేన పార్టీకి దూర‌మైన‌ట్లే అనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

త్వ‌ర‌లోనే ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న బీజేపీ కీల‌క నేత‌ల‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ.. కొంత ఇమేజ్ ఉన్న నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించాలని క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ల‌క్ష్మీనారాయ‌ణ‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని, పార్టీలో చేరేందుకు ఆయ‌న అంగీక‌రించార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల విశాఖ న‌గ‌రంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన త‌న అనుచ‌రుడితో క‌లిసి ల‌క్ష్మీనారాయ‌ణ త్వ‌ర‌లోనే బీజేపీలో చేరే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఓట‌మి త‌ర్వాత పెద్ద షాక్ అవుతుంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle