newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

లోకేష్ హాట్ ట్వీట్లు..జగన్ తుగ్లక్ 2.O అంటూ వెటకారం

07-09-201907-09-2019 14:56:36 IST
2019-09-07T09:26:36.639Z07-09-2019 2019-09-07T09:26:34.862Z - - 09-12-2019

లోకేష్ హాట్ ట్వీట్లు..జగన్ తుగ్లక్ 2.O అంటూ వెటకారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో ట్వీట్లయుద్ధం చేస్తున్నదెవరో ఎవరిని అడిగినా చెబుతారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు, మాజీ మంత్రి లోకేష్ ఎప్పుడూ ట్వీట్ల వరద పారిస్తునే ఉంటారు.

తాజాగా సీఎం జగన్ వందరోజుల పాలనపై మండిపడ్డారు జగన్.తుగ్లక్ 2.0 సమస్యకి పరిష్కారం అంటూ ట్విట్టర్లో విమర్శలు చేశారు. ‘‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, హైదరాబాద్ రావడం ఖర్చుతో కూడుకున్నది అని కోర్టుకి కహానీలు ఎందుకు చెప్పడం, దోచుకున్న లక్ష కోట్లు రాష్ట్ర ఖజానాకి అప్పగిస్తే సరిపోలా !!  రాష్ట్ర  ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, ఖజానా నిండుతుంది’’ అంటూ ట్వీట్ చేశారు.

No photo description available.

తుగ్లక్ 2.0 @100 డేస్ తుగ్లక్ గారి పాలనలో ధర్నాచౌక్ ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం డల్. అమరావతిని ఎడారి చేసారు, పొలవరాన్ని మంగళవారంగా మార్చారు. 900 హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారు.

ఇంతా చేసి ఏమన్నా సాధించారా అంటే అదీ లేదు. ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారు. ప్రజలకు,కార్మికులకు పని ,తిండి లేకుండా చేసి ఈకేవైసి అంటూ క్యూ లైన్ల లో నిలబెట్టారు. ఈ మాత్రం దానికి వంద రోజుల పండుగ అంటూ సొంత డబ్బా కూడానా !

ఎందుకు ప్రజల సొమ్ము దండగ కాకపోతే . అంతే కాకుండా,  మీరు  ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళ్లి రావడానికి అయ్యే భద్రత, రవాణా ఖర్చులకి, ప్రభుత్వానికి నిధులు కూడా సమకూరుతాయి.

ఇంత సులువైన పరిష్కారం ఉండగా మినహాయింపు ఎందుకు మాస్టారు. శిక్ష ఎలాగో తప్పదుగా ! అంటూ చినబాబు ట్వీటారు. సోషల్ మీడియాలో లోకేష్ ట్వీట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle