newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

లోకేష్ పోటీ అక్క‌డి నుంచే..!

11-03-201911-03-2019 07:17:05 IST
2019-03-11T01:47:05.025Z11-03-2019 2019-03-11T01:41:35.284Z - - 22-09-2019

లోకేష్ పోటీ అక్క‌డి నుంచే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మంత్రి నారా లోకేష్ ఈసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్నారు. ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా అటు పార్టీ వ్య‌వ‌హారాల‌ను చూసుకోవ‌డంతో పాటు మంత్రిగా ప్ర‌భుత్వంలోనూ కీల‌క పాత్ర పోషించారు. అయితే, ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయ‌న మంత్రి ప‌ద‌వి చేపట్టడాన్ని ప్ర‌తిప‌క్షాలు ప‌దేప‌దే విమ‌ర్శిస్తూ వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఈసారి ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయాలని నిర్ణ‌యించుకున్నారు.

నారా లోకేష్ పోటీ చేస్తే క‌చ్చితంగా గెలిచే స్థానాల‌ను తెలుగుదేశం పార్టీ అన్వేషిస్తోంది. అనేక క‌స‌ర‌త్తులు చేసిన త‌ర్వాత ఆయ‌న విశాఖ‌ప‌ట్నం జిల్లా నుంచి పోటీ చేయ‌డం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. జిల్లా తెలుగుదేశం పార్టీ నేత‌లు సైతం లోకేష్ ను విశాఖ‌ప‌ట్నం జిల్లా నుంచే పోటీ చేయించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై అనేక స‌ర్వేలను ప‌రిశీలించి, వివిధ స‌మీక‌ర‌ణాల‌ను, గెలుపోట‌ముల అవ‌కాశాల‌ను పూర్తిగా విశ్లేషించిన తర్వాత లోకేష్ ను భీమిలి లేదా విశాఖ‌ప‌ట్నం ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక స్థానం నుంచి పోటీ చేయించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యానికి వ‌చ్చారు.

రెండు రోజుల క్రితం విశాఖ‌ప‌ట్నం జిల్లాలో అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించి చాలా నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. కానీ, భీమిలి, విశాఖ‌ప‌ట్నం ఉత్తర నియోజ‌క‌వ‌ర్గాల‌ను మాత్రం పెండింగ్ లో పెట్టారు. దీనికి కార‌ణంగా లోకేష్‌ను పోటీ చేయించానికే అంటున్నారు. ఈ రెండింటిలోనూ ఫ‌స్ట్ ఆప్ష‌న్ కింద భీమిలినే చూస్తున్నారు. ప్ర‌స్తుతం భీమిలి నుంచి మంత్రి గంటా శ్రీనివాస‌రావు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. గత ఎన్నిక‌ల్లో ఆయ‌న 37 వేల మెజారిటీతో విజ‌యం సాధించారు. 

భీమిలి నియోజ‌క‌వ‌ర్గం మొద‌టి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌లా ఉంది. ఇక్క‌డి నుంచే ఏకంగా టీడీపీ అభ్య‌ర్థులు ఆరుసార్లు విజ‌యం సాధించారు. టీడీపీకి బ‌ల‌మైన క్యాడ‌ర్‌, ఓటు బ్యాంకు ఉన్న భీమిలి అయితే సులువుగా గెల‌వ‌వ‌చ్చ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. లోకేష్ ను భీమిలి నుంచి పోటీ చేయిస్తే గంటాను విశాఖ‌ప‌ట్నం ఉత్త‌రానికి లేదా విశాఖ‌ప‌ట్నం ఎంపీ స్థానానికి మార్చే అవ‌కాశం ఉంది.

గంటా కూడా ప్ర‌తీ ఎన్నిక‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గం మారుతూ, గెలుస్తుండ‌టంతో ఆయ‌న‌కు కూడా ఇబ్బంది ఏమీ ఉండ‌ద‌ని పార్టీ భావిస్తోంది. అయితే, భీమిలి మ‌రీ అంత సేఫ్ సీట్ కూడా కాదు అనే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. ఇక్క‌డ కాపుల జ‌నాభా ఎక్కువ‌గా ఉండ‌టం, వైసీపీ నుంచి అదే సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన అవంతి  శ్రీనివాస‌రావు బ‌రిలో ఉంటుండ‌టంతో మ‌రోసారి ఆలోచించుకోవాల‌నే సూచ‌న‌లు కూడా అందుతున్నాయి.

దీంతో మ‌రో ఆప్ష‌న్ కింద విశాఖ‌ప‌ట్నం ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌రిశీలిస్తున్నారు. న‌గ‌రం మ‌ధ్య‌లో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం అయితే గెలవ‌డం సులువు అని టీడీపీ పెద్ద‌లు భావిస్తున్నారు. న‌గ‌రం నుంచి ఆయ‌న పోటీ చేస్తే ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌పై కూడా సానుకూల ప్ర‌భావం ఉంటుంద‌ని న‌గ‌రంలోని మిగ‌తా ఎమ్మెల్యేలు కూడా చంద్ర‌బాబు దృష్టికి తీసుకువ‌చ్చారు.

ప్ర‌స్తుతం ఇక్క‌డ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు ఉన్నారు. టీడీపీతో పొత్తు కార‌ణంగా ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి 17 వేల మెజారిటీతో గెలిచారు. ఆయ‌న ఈసారి పోటీలో ఉండ‌క‌పోవ‌చ్చు. మొత్తానికి మంత్రి నారా లోకేష్ ఈసారి భీమిలి లేదా విశాఖప‌ట్నం ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం మాత్రం ఖాయం. మ‌రో రెండుమూడు రోజుల్లో దీనిపై పూర్తి స్ప‌ష్ట‌త వ‌స్తుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle