newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

లోకేష్ ట్వీట్‌కు సాయిరెడ్డి పంచ్‌లు

17-08-201917-08-2019 12:24:06 IST
Updated On 20-08-2019 12:01:56 ISTUpdated On 20-08-20192019-08-17T06:54:06.464Z17-08-2019 2019-08-17T06:54:04.861Z - 2019-08-20T06:31:56.492Z - 20-08-2019

లోకేష్ ట్వీట్‌కు సాయిరెడ్డి పంచ్‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కృష్ణానది కరకట్ట దగ్గర వరద ఉధ‌ృతి పెరుగుతోంది. అక్కడే ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాలని అధికారులు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది.

No photo description available.

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘చంద్రబాబుగారి ఇంటిని ముంచేయడానికి వైసీపీ చేసిన మరో కుట్ర చూడండి. నాగార్జునసాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 590 అడుగులు. ఇప్పుడు జలాశయ నీటిమట్టం 586 అడుగులే ఉంది. అయినా ప్రకాశం బ్యారేజీ దగ్గర అంత వరద ఎందుకు అంటే సాగర్ లోకి వస్తున్న వరద కంటే ఎక్కువ నీటిని విడుదల చేసారు’’అంటూ మండిపడ్డారు లోకేష్. 

అంతేకాదు.. టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా ఘాటుగానే స్పందిస్తోంది. ‘‘కావాలి జగన్, రావాలి జగన్ అని ఆయన్ని గెలిపించుకుంటే ఇప్పుడు మమ్మల్ని పిల్లా పాపలతో రోడ్డున పడేశారని బాధిత ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

వరద ముంపు పొంచివుందని తెలిసినా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. కనీసం వారికి నీళ్లు ఆహరం అందించకుండా ఇబ్బందుల పాలు చేస్తోంది’’ అంటూ విమర్శలు చేసింది. 

ఇదిలా ఉంటే.. లోకేష్ ట్వీట్‌కు ఘాటుగానే బదులిచ్చారు వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, లోకేశ్ ‘పెద్ద మనిషయ్యాక’ ఇంత పెద్ద వరదను చూసి ఉండడు. వానలు లేకున్నా7 లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో అంతుబట్టడం లేదతనికి. వరదలో కొట్టుకొచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహ పడుతున్నాడు. ఇరిగేషన్ వారితో కౌన్సిలింగ్ ఇప్పించండయ్యా. బేసిక్ నాలెడ్జన్నా పెరుగుతుందంటూ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టారు. 

No photo description available.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle