facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
*పుల్వామా అమర జవాన్లకు చంద్రబాబు సాయం... ఒక్కో జవాను కుటుంబానికి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా * పుల్వామా ఘటనపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం....తీవ్రవాదులపై చర్యలకు పూర్తి మద్దతు.. ఒక దేశం ఒకటే మాట * కోమటిరెడ్డి, సంపత్ కేసు.... న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు, శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులకు జ్యుడీషి‌యల్‌ కస్టడీ.. 10వేల పూచీకత్తుపై విడుదల *పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్.. ఉగ్రవాద చర్యలు ఆపాలని, వారి ఆశ్రయం ఇవ్వొద్దని హెచ్చరికలు* ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా *టీటీడీ బోర్డు సభ్యుడిగా సండ్ర నియామకం రద్దు.. టీఆర్ఎస్‌లో చేరే అవకాశం * ఫిబ్రవరి 17 నుంచి తెలంగాణలో 33 జిల్లాలు.. అందుబాటులోకి నారాయణపేట, ములుగు జిల్లాలు * భారత మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’‌ సాంకేతిక అడ్డంకులు.. ప్రారంభించిన మరుసటి రోజే ఆగిపోయిన రైలు

లోకేష్ ‘ఆటో’ పంచ్ వేస్తే... ‘కుర్చీ’లతో కొట్టారు

11-02-201911-02-2019 16:41:48 IST
Updated On 11-02-2019 16:41:46 ISTUpdated On 11-02-20192019-02-11T11:11:48.758Z11-02-2019 2019-02-11T11:08:59.566Z - 2019-02-11T11:11:46.592Z - 11-02-2019

లోకేష్ ‘ఆటో’ పంచ్ వేస్తే... ‘కుర్చీ’లతో కొట్టారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిన్నటివరకు తన ప్రసంగాల్లో తప్పులు దొర్లించి అడ్డంగా బుక్కయ్యే ఏపీ మంత్రి నారాలోకేష్... ఇప్పుడు ట్విట్టర్‌లో దొరికిపోతున్నారు. ఎప్పుడో మూడేళ్ళ క్రితం చేసిన విజయవాడ మెట్రో రైలు ట్వీట్‌ని ఈమధ్యే బయటకు తీసుకొచ్చి లోకేష్‌ని ఓ ఆటాడుకున్న నెటిజన్లు... తాజాగా ఆయన చేసిన ‘ఆటో’ ట్వీట్‌కి ‘కుర్చీ’లతో తిప్పికొట్టారు.

ఇంతకీ లోకేష్ చేసిన ట్వీట్ ఏమిటంటే... ‘‘ఆంధ్రులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలకకపోగా... మోడీగారితో జోడి కట్టిన జగన్‌గారు వైకాపా కార్యకర్తలను మోడీగారి సభకి పంపుతున్నారు’’ అంటూ జగన్ స్టిక్కర్స్ ఉన్న ఆటో ఫోటోల్ని షేర్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు... ఆ వెంటనే కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈమధ్యే జరిగిన లోకేష్ సభలో జగన్ స్టిక్కర్స్ ఉన్న కుర్చీల ఫోటోలను షేర్ చేస్తూ... ‘‘మరి దీని సంగతేంటి’’ అని నిలదీస్తున్నారు. ‘‘ఒక మంత్రి అయ్యుండి మరీ ఇలాంటి చీప్ ట్వీట్ చేయడమేంటని’’ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి... కొందరు అభిమానంతో తమ ఆటోల వెనకాల స్టిక్కర్స్ వేసుకుంటారు. అలా కాకపోతే ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలు డబ్బులిచ్చి, ఆటోల వెనకాల తమ నాయకుడి స్టిక్కర్స్ అంటిస్తారు. ఆమాత్రం దానికి... అదేదో పెద్ద బ్రహ్మాస్తం అన్నట్లు లోకేష్ ట్వీట్ చేయడం మరీ కామెడీగా ఉందని జోకులు వేసుకుంటున్నారు. పాపం లోకేష్... ప్రత్యర్థికి గట్టి కౌంటర్ ఇద్దామని ప్రయత్నించినా ప్రతిసారీ ఇలాగే బోల్తాకొడుతుంటారు.

Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle