newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

లోకేష్‌తో ఇవన్నీ చెప్పిన ఆ పెద్దమనిషి ఎవరో?

29-01-201929-01-2019 15:51:18 IST
Updated On 29-01-2019 15:51:11 ISTUpdated On 29-01-20192019-01-29T10:21:18.213Z29-01-2019 2019-01-29T09:50:36.770Z - 2019-01-29T10:21:11.420Z - 29-01-2019

లోకేష్‌తో ఇవన్నీ చెప్పిన ఆ పెద్దమనిషి ఎవరో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ వేదికలను సీఎం చంద్రబాబు బాగా ఉపయోగించుకుంటారు. ఏటా దావోస్‌ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఖచ్చితంగా చంద్రబాబు వెళుతుంటారు. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు అక్కడికి వెళ్ళలేదు. తన ప్రతినిధిగా తన కొడుకు, మంత్రి లోకేష్‌ని దావోస్ పంపించారు. అక్కడికెళ్ళిన లోకేష్ ఏదో ఘనకార్యం సాధించారని కొన్ని పత్రికలు ఊదరగొడుతున్నాయి. చంద్రబాబు సంగతలా ఉంచితే.. లోకేశ్‌బాబు కష్టపడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోందంటూ సదరు కథనం సారాంశం. ఐదురోజులపాటు దావోస్‌లో ఉన్న లోకేశ్‌ బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ల నుంచి రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, ఇప్పటికే దిగ్గజ సంస్థలు కియా, ఇసూజీ, హీరో, అశోక్‌ లేలాండ్ వంటి సంస్థలతో పాటు పలు మొబైల్ కంపెనీలు కూడా పరిశ్రమలు ఏర్పాటుచేశాయి. ఈ అంశాలన్నింటినీ లోకేశ్ బృందం ప్రజెంటేషన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు చూపించింది. 

ఈనేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేలకోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు కలిగిన ఓ అపరకుబేరుడు లోకేశ్ బృందంతో భేటీ అయినట్టు కథనంలో వివరించారు. గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేశ్ బృందానికి జోష్ నింపాయిట. రామాయపట్నం పోర్టుతో పాటు ఏపీలో సుమారు అయిదు వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఆ పారిశ్రామికవేత్త ఢిల్లీ వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు. సదరు పారిశ్రామికవేత్త భారత్ వస్తున్నారని తెలిసి ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం పంపారట. దీంతో ఆయన మోదీని కలుసుకున్నారట. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుతూ ఏపీలో తమ సంస్థ అయిదు వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోందని మోదీకి వివరించారట. గుజరాత్‌లో పెట్టుబడుల గురించి మోదీ సదరు కుబేరుడిని కోరారట. కానీ ఆయన మాత్రం ఏపీలోనే పెట్టుబడులకు సముఖత వ్యక్తంచేసినట్టు చెబుతున్నారు. ఏపీలో పరిస్థితులపై అధ్యయనం కూడా చేశామనీ ఆయన కుండబద్ధలు కొట్టారని కథనం సారాంశం.

స్వయంగా ప్రధాని చెప్పినా ఏపీలోనే పెట్టుబడులకు పారిశ్రామిక దిగ్గజం ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారో లోకేష్ బాబుకి వివరించారట. పనిలో పనిగా ఏపీలో కియాను కేస్ స్టడీగా ఎంచుకున్నారని సమాచారం. ఏపీలో కీలక ప్రాంతాల్లో చేసిన అధ్యయనం తర్వాత ఏపీ పెట్టుబడులకు అనుకూలమని పారిశ్రామికవేత్త లోకేష్ టీంకి వివరించారట. ఏపీలో చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కి ఆయన ఫిదా అయ్యారట.  ఏపీనుంచి తీసికెళ్ళిన చెఫ్‌లు వండిన ఫుడ్ కూడా ఆ కుబేరుడికి తెగ నచ్చేశాయట. దావోస్‌లో లోకేశ్ బృందం అయిదురోజుల పర్యటనలో హైలెట్‌గా నిలిచిన ఈ సంఘటన ద్వారా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అక్కడికి వెళ్లిన అధికారులకు సైతం బోధపడిందంటున్నారు. ఇంతకీ ఏపీ అంటే వల్లమాలిన అభిమానం, ప్రేమ, ఆసక్తి చూపిస్తున్న ఆ అపరకుబేరుడు ఎవరై ఉంటారని ఏపీ అంతటా ఆసక్తిగా గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు జనం.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle