newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

లోకేష్‌కు పవన్ మార్క్ షాక్ ట్రీట్‌మెంట్.. !

25-03-201925-03-2019 14:55:00 IST
Updated On 26-03-2019 18:02:21 ISTUpdated On 26-03-20192019-03-25T09:25:00.258Z25-03-2019 2019-03-25T09:24:58.411Z - 2019-03-26T12:32:21.862Z - 26-03-2019

లోకేష్‌కు పవన్ మార్క్ షాక్ ట్రీట్‌మెంట్.. !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంగళగిరిలో చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్‌కు పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. తన పార్టీ అభ్యర్థిని లోకేష్‌పై పోటీకి నిలబెట్టారు. ఇంతకాలం పొత్తులో భాగంగా మంగళగిరి సీటును జనసేన సీపీఐకి కేటాయించింది. దీంతో లోకేష్ గెలుపుపై ధీమాగా వున్నారు. రాజధాని, అభివృద్ధి పేరుతో జోరుగా ప్రచారం చేస్తూ వచ్చారు. యువత కూడా సీపీఐ కంటే టీడీపీ యువనాయకుడైన లోకేష్ వైపే మొగ్గుచూపినట్లు కనిపించింది. అయితే.. నామినేషన్ల చివరి రోజు రాత్రికి రాత్రి పవన్ కల్యాణ్ వ్యూహం మార్చారు. మంగళగిరి స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి.. తన పార్టీ నాయకుడు చల్లపల్లి శ్రీనివాస్‌కు అర్థరాత్రి వేళ బీ-ఫారం ఇచ్చారు. 

పవన్ ఇచ్చిన షాక్‌తో ఎలాగూ సీపీఐకి షాక్ తింది. అంతకంటే ఎక్కువగా.. లోకేష్ గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళగిరిలో పవన్ కల్యాణ్ అభిమానులు, యువ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో వాళ్లంతా ఒక్కసారిగా లోకేష్ వైపు నుంచి జనసేన వైపు మొగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయంతో పవన్ మరో విషయాన్ని కూడా స్పష్టం చేయదలిచినట్లు తెలుస్తోంది.

టీడీపీతో లోపాయకారి ఒప్పందం కారణంగానే మంగళగిరిలో జనసేన అభ్యర్థిని పోటీకి పెట్టలేదన్న విమర్శ వైసీపీ వర్గం నుంచి వినిపించేది. దీంతో అక్కడా మేమున్నాం అంటూ పవన్ అభ్యర్థిని ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల్లో చినబాబు గెలుపుపై ఆందోళన నెలకొంది. 

మరోవైపు.. ఇక్కడున్న వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్థానికంగా మంచి పట్టుంది. జనసేన అభ్యర్థిని బరిలోకి దించడం ద్వారా ఆళ్లకు పడే ఓట్లను చీల్చాలనేది కూడా పవన్ వేసిన తిరుగులేని స్కెచ్. ఈ నిర్ణయం ప్రభావం ఎక్కువగా ఆర్‌కె కంటే లోకేష్ పైనే పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle