newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

లోకేష్‌కు అంత దమ్ముందా?

16-02-201916-02-2019 12:44:59 IST
Updated On 20-02-2019 12:13:57 ISTUpdated On 20-02-20192019-02-16T07:14:59.518Z16-02-2019 2019-02-16T07:14:57.497Z - 2019-02-20T06:43:57.368Z - 20-02-2019

లోకేష్‌కు అంత దమ్ముందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమ పొలిటికల్ కెరీర్‌ను సమర్థవంతంగా నెట్టుకురావడానికి ప్రతి రాజకీయ నేత తనదైన ప్రయత్నాలు చేస్తాడు. తన ఉనికి చాటుకోవడానికి ప్రజలతో మమేకం అవ్వడమే కాకుండా... కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపడతాడు. ముఖ్యంగా... ఎన్నికల సమయంలో వారిలో ఈ ఉత్సాహం మునుపెన్నడూ లేని స్థాయిలో కనిపిస్తుంది. కానీ... మంత్రి నారాలోకేష్‌లో మాత్రం ఆ ఊపు కొంచెం కూడా కనిపించడం లేదంటున్నారు.

ఓవైపు ఎమ్మెల్సీ నారాయణ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చాలాకాలం క్రితం నుంచే నెల్లూరు అర్బన్‌లో పనులు మొదలుపెట్టేశారు. మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అయితే... ఏకంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ ఎన్నికల్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. లోకేష్ కంటే రెట్టింపు వయసున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటే... లోకేష్‌ మాత్రం అందులో కూసింతైనా ఆసక్తి చూపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లోకేష్ ఇంతవరకూ తనకంటూ ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోలేదు. పార్టీలో స్ఫూర్తి నింపే సమర్థవంతమైన పనులు చేపట్టిన దాఖలాలూ లేవు. అటు... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోవడానికి ముందుకు కూడా రావడం లేదు. తండ్రి పుణ్యమా అని వరించిన మంత్రి పదవిని తానేదో గొప్పగా సాధించేసినట్లు భ్రమలో ఉన్నారే తప్ప... తన ఉనికి చాటుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు.

నిజానికి... చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌ అంతా లోకేష్ చేతిలోనే ఉంటుందని అంటున్నారు. కానీ... లోకేష్‌లో మాత్రం అలాంటి నాయకత్వ లక్షణాలు, చురుకుదనం ఏమాత్రం కనిపించడం లేదు. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా సాహసించలేకపోతున్న ఆయన... పార్టీని ఎలా నడుపుతాడోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle