లోకేశ్‌కు ఆ సత్తాలేదా..? జూ.ఎన్టీఆర్ రావాల్సిందేనా!?
15-11-201915-11-2019 12:42:54 IST
Updated On 15-11-2019 16:21:10 ISTUpdated On 15-11-20192019-11-15T07:12:54.106Z15-11-2019 2019-11-15T07:12:51.835Z - 2019-11-15T10:51:10.726Z - 15-11-2019

సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆరునెలలు కాకుండానే ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి.. నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతలు నువ్వానేనా అంటూ కాలుదువ్వుతుండగా మరోవైపు బీజేపీ అదేస్థాయిలో ఏపీ రాజకీయాల్లోకి దూసుకొస్తుంది. నిన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ.. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో ఆపార్టీని ఒక్కొక్కరిగా వీడుతున్నారు. మా ఒంట్లో ప్రవహించేది పసుపురక్తం అని చెప్పుకున్న నేతలుసైతం ఇప్పుడు వరుసగా టీడీపీని ఎందుకు వీడుతున్నారు..? ఆ పార్టీకార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తున్న ప్రశ్నగా మారింది. దీనంతటికీ కారణం యువనేత లోకేష్ రాజకీయాల్లో సమర్థవంతంగా రాణించలేకపోవటమేనని పలువురు నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీని వీడిన వల్లభనేని వంశీ బహిరంగంగానే పేర్కొనడం, ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ బతుకుతుందని చెప్పకనే చెప్పడం ఆ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తుంది. ఏపీ రాజకీయాల్లో వై.ఎస్. జగన్ మాస్‌లీడర్‌గా దూసుకెళ్తున్నాడు. కిందిస్థాయి నుంచి పెద్దవారి వరకు.. కూలీ నుంచి ఉద్యోగుల వరకు.. ఎక్కడ చూసినా జగన్.. జగన్.. అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. అంతలా వై.ఎస్. జగన్ ఏపీ ప్రజల్లోకి చొచ్చుకెళ్లకలిగాడు. అలాంటి మాస్ లీడర్‌ను తట్టుకోవాలంటే అదే స్థాయిలో ఉన్న మాస్‌లీడర్ అయితేనే ఢీకొనడం సాధ్యమవుతుందని వంశీతోపాటు టీడీపీలోని పలువురు నేతల వాదన. ప్రస్తుతం టీడీపీ యువనేతగా చెప్పుకుంటున్న లోకేశ్‌లో అలాంటి లక్షణాలు లేవని, ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లే సత్తాలేదని చెబుతున్నారు. దీంతో టీడీపీతోనే ఉంటే భవిష్యత్ ఉండదనే భావనతోనే పలువురు టీడీపీని వీడుతున్నట్లు ప్రచారం సాగుతుంది. లోకేశ్ కేవలం అడ్మినిస్ట్రేషన్ వరకు మాత్రమే పనికివస్తాడని, ప్రజలను సెంటిమెంటల్‌గా తనవైపుకు లాక్కొనే సత్తా అతనికి లేదని.. లోకేశ్ చేతుల్లో పార్టీని పెడితే పార్టీ మునగడం ఖాయమని టీడీపీని వీడుతున్న నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితిని బట్టి చంద్రబాబు నాయుడు తన శాయశక్తులా కృషిచేసినా మెరుగుపర్చలేరనే వాదన పార్టీని వీడుతున్నవారి నుండి వినిపిస్తుంది. చంద్రబాబు అనుభవాన్ని మొత్తాన్ని పెట్టి వచ్చే ఎన్నికల నాటి వరకు పార్టీ ఉనికిని కాపాడుకోగలుగుతారని, ఆ తరువాతైనా పార్టీ కనుమరుగు కావటం ఖాయమని వంశీలాంటి నేతలు బహిరంగంగానే పేర్కొనడం గమనార్హం. ఒకవైపు బీజేపీ, ఒకవైపు వైసీపీ రెండు పార్టీలు ఏపీలో బలమైన ముద్ర వేసుకుంటున్నాయి. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌సైతం తన పంథాలో ప్రజల్లోకి చొచ్చుకెళ్లగలుతున్నారు. రాబోయే కాలంలో ఈమూడు పార్టీలదే భవిష్యత్ అని, టీడీపీ చరిత్ర ముగియడం ఖాయమంటూ టీడీపీని వీడిన, వీడుతున్న నేతలు బలంగా వాదిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి టీడీపీని గట్టెక్కించాలంటే అది కేవలం ఒక్క జూ. ఎన్టీఆర్ అయితేనే సాధ్యపడుతుందనేది టీడీపీలోని కొందరి వాదన . లోకేష్‌కు టీడీపీని నడిపించే సత్తాలేదని ఇప్పటికే తేలిపోవటంతో ఇప్పటికైనా చంద్రబాబు జూ. ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపేలా చర్యలు చేపట్టాలని ఆపార్టీలోని పలువురు నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఏపీలో మాస్‌లీడర్‌గా తిరుగులేని స్థానాన్ని సంపాదించిన జగన్‌ను ఢీకొట్టాలంటే అదేస్థాయిలో మాస్‌లీడర్‌గా పేరుపొందిన ఎన్టీఆర్తోనే సాధ్యమవుతుందని టీడీపీ నేతల్లో చర్చసాగుతుంది. ఏపీలో మునిగిపోతున్న పార్టీని రాజకీయ చానుక్యుణిడిగా పేరున్న చంద్రబాబు ఎలా బతికించుకోగలుగుతారు..? లోకేష్‌తోనే పార్టీని ముందుకు తీసుకెళ్తారా..? టీడీపీలోని ఓ వర్గం కోరుతున్నట్లు జూ. ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతారా? అనేది అందరిలోని ఆసక్తిని రేకెత్తిస్తుంది.

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!
8 hours ago

ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్‌గా అక్బరుద్దీన్ నియామకం
9 hours ago

అమరావతి వార్: వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు
10 hours ago

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!
10 hours ago

శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్
11 hours ago

జర్నలిస్ట్ అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్
11 hours ago

అప్పులు చేయడంలో జగన్ సరికొత్త రికార్డులు..!
12 hours ago

మోడీ సర్కార్ విఫలం.. నిప్పులు చెరిగిన చిదంబరం
13 hours ago

దిశ కేసులో దర్యాప్తు మమ్మరం.. నెలలోపే హంతకులకు శిక్ష
13 hours ago

రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయా పవన్.. విజయసాయి విమర్శలు
14 hours ago
ఇంకా