newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

లేటెస్ట్ ట్రెండ్ : మా బూతే.. మా భ‌విష్య‌తిః..!

22-11-201922-11-2019 09:19:54 IST
2019-11-22T03:49:54.975Z22-11-2019 2019-11-22T03:49:52.004Z - - 15-12-2019

లేటెస్ట్ ట్రెండ్ : మా బూతే.. మా భ‌విష్య‌తిః..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌స్తుతం ఏపీలో చోటు చేసుకుంటున్న రాజ‌కీయాలు చీద‌రించుకునే దుస్థితికి దిగ‌జారాయ‌ని ప్ర‌జ‌లు బాహాటంగా విమ‌ర్శిస్తున్నారు. తాము ఓట్లేసి ప్రజా ప్ర‌తినిధులుగా ఎన్నుకున్న నేత‌లే అదుపు త‌ప్పి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, అస‌లు రాజ‌కీయాలంటేనే ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డ‌మే అన్న ట్రెండ్‌ను సెట్ చేసేలా నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని బాధ‌ప‌డుతున్నారు.

త‌మ కోసం సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్ప‌డ‌తార‌ని భావించి ఎన్నుకున్న నేత‌లు వాట‌న్నిటిని ప‌క్క‌న‌పెట్టి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కే ప్రాధాన్య‌మిస్తుండ‌టాన్ని చూస్తున్న జ‌నాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఒకానొక స‌మ‌యంలో విధి విధానాల మీద పోరాటాలు చేయడం, విమర్శ‌లు గుప్పించ‌డం వంటివి రాజ‌కీయాల్లో జ‌రుగుతుండేవి. నేత‌ల మాట‌లు హ‌ద్దులు మీరేవి కావు. విమ‌ర్శ‌లు కూడా ప‌ద్ధ‌తి ప్ర‌కారంగా సాగావేవి.

కానీ, ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయ శ్రేణుల మ‌ధ్య‌ వైరం బాగా పెరిగింది. ఆ క్ర‌మంలోనే రాజ‌కీయాల‌ను వ్య‌క్తిగ‌తంగా తీసుకోవ‌డంతోపాటు ఒక‌రి మీద ఒక‌రు హ‌ద్దులు మీరుతూ ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. బూతులు కూడా మాట్లాడేసుకుంటున్నారు. ఇవ‌న్నీ చూస్తూ ఇంత దిగ‌జారుడు రాజ‌కీయాలేంట‌ని ఒక‌రినొక‌రు ప్ర‌శ్నించుకోవ‌డం ప్ర‌జ‌ల వంతుగా మారింది.

అయితే, గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మ‌ధ్య ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌యివేటుగా ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు చేసుకోవ‌డం, తిట్టుకోవ‌డం లాంటివి ఉండేవి. అవ‌న్ని ఒకానొక స‌మయం. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. మీడియా చ‌ర్చ‌ల్లోనూ హ‌ద్దులు మీరుతున్నారు. నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు.

మ‌న‌కూ ఒక హోదా ఉంది.. ఆ హోదాకు ఒక గౌర‌వం, బాధ్య‌త ఉంటాయ‌న్న విష‌యాన్ని రాజ‌కీయ నాయ‌కులు మ‌రిచిపోతున్నట్టుగా ఉంది. ప్ర‌జా ప్ర‌తినిధుల నోటి నుంచి ఓవ‌ర్ ఫ్లో అయిపోతున్న బూతుల‌ను విని ప్ర‌జ‌లు ఈస‌డించుకుంటున్నారు.

సాధార‌ణ నాయ‌కుడైనా.. మంత్రి అయినా.. ఏ పార్టీ వారైనా ఇందులో మిన‌హాయింపేమీ లేదు. జ‌నం మ‌ధ్య ఉన్నామా..? మైకు ముందు ఉన్నామా..?  ఎంత మంది గ‌మ‌నిస్తున్నారు..? ఇలాంటివేం మన నేత‌ల‌కు ప‌ట్ట‌డం లేదు.

ఇష్టాను సారంగా నోటికి ఎంత వ‌స్తే అంత నిస్సిగ్గుగా మాట్లాడేస్తున్నార‌ని జ‌నం చెవులు కొరుక్కుంటున్నారు. ఇలాంటి వారినా.. మ‌నం నేత‌లుగా ఎన్నుకున్నామ‌ని.. ఆ నేత‌ల బూతు పురాణం విన్న జ‌న‌మే సిగ్గుప‌డుతున్నారు.

మంత్రి ప‌ద‌విలో ఉన్నామంటే.. ఎంతో బాధ్య‌త‌గా ఉండాలి. కానీ, త‌న‌కేం లేద‌న్న‌ట్టుగా ఒక మంత్రి మాట‌కు ముందు.. మాట‌కు త‌రువాత ఏదో ఒక బూతును య‌థాలాపంగా వాడేస్తున్నారు. చివ‌ర‌కు ఆ నాయ‌కుడు అలా మాట్లాడ‌ట‌మే హీరోయిజం అనుకుంటున్నారేమో గానీ.. జ‌నం మాత్రం చీ..చీ అనుకుంటున్నారు.

ప్ర‌శాంతంగా ఉండాల‌న్న ఉద్దేశంతో కొన్ని నియ‌మాలు అనుస‌రిస్తూ దేవుడ్ని కొలుస్తాం. అలాంట‌ప్పుడు నోరు జార‌కుండా ప్ర‌శాంత చిత్తంతో ఉండేలా చూసుకుంటాం. కానీ, ఈ నేత‌ల‌కు మాత్రం అలాంటి ప‌ట్టింపులేమీ లేన‌ట్టుగా ఉంది. ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా నోటికొచ్చింది మాట్లాడేస్తుండ‌టంతో ఆ మాత్రం దానికి పూజ‌లు, పునస్కారాలెందుక‌ని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు.

కాగా, ఈ బూతుల విష‌యంలో ఏ రాజ‌కీయ‌ పార్టీ నేతా మిన‌హాయింపు కాదు. అవ‌కాశం వ‌స్తే చాలు బూతు పురాణం మొద‌లుపెట్టేసి రాజ‌కీయాలంటేనే చిరాకు పుట్టించేలా చేస్తున్నార‌ని జ‌నం చ‌ర్చించుకుంటున్నారు. భ‌విష్య‌త్తులో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వ‌స్తుందోన‌ని బాధ ప‌డుతున్నారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle